Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/794

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

బలీయమైన (dominant) గుణమని అనెను. రెండవది మీదికి కనుపడక దాగియుండి రెండవ సంతతియందు గోచరించు దానిని ప్రచ్ఛన్నమైన (Recessive) గుణ మనెను. ఇట్లు గుణము ల నన్నింటిని బలీయమైనవి. (Dominant) లేక ప్రచ్ఛన్నమైనవి (Recessive) అను రెండు తరగతులలో విభజించవచ్చునని నిర్వచించెను.

2. జీవులయందు ప్రతి గుణమునకు సంబంధించిన ఒకజత సృజనులు (Genes) ఉండును. ఇందులో ఒకటి తండ్రి నుండి, మరొకటి తల్లినుండివచ్చి ఒక జతగా నేర్పడు ననెను. వీనియందు రెండును ఒకేజాతికి చెందినవైనచో ఆ జత ఏకగుణ సృజనయుగ్మకము (Homozygous) అనియు లేక రెండును వ్యత్యాసము కలిగియున్న చో ఆ జత ఉభయగుణ సృజన యుగ్మకము (Heterozygous అనియు వ్యవహరింపబడును. ఉ. తల్లి రంగు ఎఱ్ఱగాను, తండ్రి రంగు నల్లగాను ఉన్నచో, సంతతియందు రంగునకు సంబంధించిన సృజనులజత ఉభయగుణ యుగ్మకము అగును. ఇద్దరు ఒకేరంగు కలిగియున్న సృజనులజత ఏక గుణయుగ్మక మగును.

3. ఒకదానికంటే ఎక్కువ గుణములు దృష్టి యందుంచుకొని సంపర్కము గావింపజేసిన ప్రతిగుణము, సంతతీయందు స్వాతంత్య్రము కలిగియుండి, తన నిష్పత్తిని తానే గలిగియుండును. ఒకదానివలన వేరొక గుణము యొక్క నిష్పత్తియందు ఎట్టి భేదమురాదు. ఈ గుణము, వారసత్వమున, మీద సుదాహరించిన మెండెల్ పరిశోధనముల ననుసరించి యుండును.

4. ఉభయగుణ సృజనయుగ్మక గుణమునకు సంబంధించిన వానియందు సంపర్కము గావింప జేసినచో మూడు విధములగు సంతతులు లభించును. ఇందులో