ఆనువంశికము
కొంతవరకు విషయము గ్రాహ్యమైనదే కాని ఇట్లు జరుగునని రూఢముగా తెలియలేదు. మెండెలు (Mendel) కావించిన పరిశోధనలు శాస్త్రబద్ధములై విషయమును విశద పరచుటకే గాక ముందు పరిశోధనములకు ఆధారములై నిలిచినవి.
మెండెల్ సిద్ధాంతము (Mendelism) :- అనువంశికమును గురించిన సూత్రములను కనుగొన్న వారిలో గ్రెగర్ మెండెల్ (Gregor Mendel 1822-1884) ప్రథముడు. ఇతడు ఆస్ట్రియా దేశీయుడు. మొదట ఈతనికి పరిణామ సూత్రములతో గాని, వాటికి సంబంధించిన అభిప్రాయ భేదములతోగానీ ఎట్టి సంబంధము లేకుండెను. ఈతడు తెలిసికొనదలచిన విషయము ఒక్కటే. అదేమన శిశువు అన్ని విధముల తన తల్లిదండ్రులను ఎందుకు పోలియుండవలెను? శిశువునందుగల గుణములకు తల్లిదండ్రుల గుణములకు గల సంబంధమేమి? అను అంశము లను తెలిసికొనుటకై కృతనిశ్చయుడై తన తోటలోని సాధారణమైన చిక్కుడు చెట్టును పరిశోధన ద్రవ్యముగా గైకొనెను. చివరకు సఫలుడయ్యెను. ఈతడు తన సూత్రములను 1865వ సంవత్సరమున బ్రన్ (ఆస్ట్రియా) ప్రకృతి చరిత్ర సంఘ (Natural History Society) సమా వేశములో ప్రకటించెను. కాని అప్పటంతలో ఈతని సూత్రములను అర్థము చేసికొని ఒప్పుకొనునంత శక్తి గలవా రొకరును లేనందున ఆతని సూత్రములన్నియు అంధకారమునందుండి పోయెను. మెండెల్ మరణానంతరము వేరు ప్రాంతములందు ముగ్గురు శాస్త్రవేత్తలు అవే సూత్రములను రెండవసారి కనుగొనిరి. వారు డి వేరిస్ (హాలెండు), కారెన్సు (జర్మనీ), వాన్షర్ మార్కు (ఆస్ట్రియా). ఎన్నడో విస్మరించిన మెండెల్ సూత్రములను వీరు వెలికి తీసి పునరుజ్జీవింప జేయుటయే గాక ఒప్పుకొని, వానినే ఆధారముగ చేసికొని పరిశోధనములు సాగించిరి. ఒకనాడు అంధకార బంధురమైన సూత్రములు నేడు సృజన శాస్త్రమున కే కాక ఆధునిక జీవశాస్త్రమునకే పునాదులై పరిశోధనములను, అతి తేజోవంతములను కావించినవి. కాని చివరకు తన సూత్రము లామోదింపబడు గౌరవమును చూచి సంతసించు భాగ్యము మెండెలునకు చిక్క లేదు. ఐననేమి? నేడు ఆతని పరిశ్రమమునకు తగిన స్థానము లభించినది.
మెండెల్ పరిశోధనములు :- మొదట మెండెలు తన తోటలోని చిక్కుడు తీగలలో ఒక పొడవుజాతిని, ఒక పొట్టిజాతిని తీసికొని పెంచి వానియందు పర పరాగ సంపర్కము (Cross Pollination) గావించి సంతతి కలిగించెను. ఇందు అన్నియు పొడవు రకపు గుణమునే ప్రకటించినవి. ఒకటియైనను పొట్టిరకపు తీగ లేక యుండెను. ఈ సంతతిని మెండెల్ మొదటి పిత్య్రమైన సంతతి (1st. filial generation) అనెను. ఈ సంతతిని పెంచి పెద్దచేసి దీనియందు స్వపరాగమునే సంపర్కము (Self pollination) గావించి, రెండవ సంతతి కలిగించెను. ఇది రెండవ పిత్య్రమైన సంతతి (2nd filial generation) అనబడెను. ఇందులో మాత్రము కొన్ని పొడవుజాతివి, కొన్ని పొట్టి జాతివి ఉండెను. వీని నిష్పత్తి 3:1 అనగా మూడు పొడవుజాతి తీగలైన ఒకటి పొట్టిజాతి తీగ యుండెను. తరువాత సంతతులలో పొట్టివాటి నుండి స్వపరాగ సంపర్కమువలన పొట్టి జాతియే సదా సంభవించుచు వచ్చినది. పొడవు జాతీయందు మాత్రము ఇట్లుకాక కొన్ని పొడవు జాతివి, కొన్ని పొట్టి జాతివి సంభవించినవి. వీటిని సూక్ష్మముగ పరిశీలించినచో పొడవైన మూడింటిలో, ఒకటి మాత్రము, లేక మొత్తము పొడవుజాతిలో మూడవభాగము ఎల్లప్పుడు పొడవుజాతినే ఉద్భవింపజేసెను. కాని మిగిలినవి పొడవు జాతిని, పొట్టి జాతిని రెండింటిని ఉద్భవింపజేసెను. ఇట్లు ప్రతి సంతతి యందు నాలిగింటిలో ఒకటి పొట్టిజాతిని మిగిలిన మూడింటిలో ఒకటి పొడవుజాతిని కలిగించుచుండెను. శేషించిన రెండును, పొడవు పొట్టి అను రెండు గుణములు గల జాతుల నుద్భవింప జేయుచుండెను. అనగా ప్రతి సంతతియందు 1 పొడవుజాతి, 2 పొడవు (బాహ్య), పొట్టి (అంతర) గుణములు కలజాతి, 3. పొట్టిజాతి కలుగు చుండెను. ఈయన ఈ ఫలితముల నాధారముగా జేసికొని ఈ క్రింది నాలుగు సూత్రములను బేర్కొన్నాడు.
1. రెండు వ్యతిరేక గుణములు కలవాటియందు సంపర్కము కలుగ చేసినయెడల మొదటి సంతతియందు ఒకే గుణము వెలువడును. దీనిని మెండెల్ (Mendel)