ఆనకట్టలు : నిక్షేప జలాశయ నిర్మాణము
యని యడిగిన ఈ జడులేమి చెప్పగలరు ? -' అని పరిహసించినవారి మోములు వెల్లబార ధ్వని గ్రంథము వెలసినది. ధ్వని ప్రస్థానము సిద్ధాంతమై మెరసినది. ఈ ధ్వని భావము తొలుత వైయాకరణుల స్ఫోటవాదము చే స్ఫురింప జేయబడినది. స్ఫోటవాదము మిక్కిలి ప్రాచీనమైనది. పాణిని మహర్షి కంటే ముందే యీ వాదమున్నట్లు తెలియు చున్నది. స్ఫోటాయనుడను నాచార్యుని పాణినియే స్మరించియుండెను. ధ్వన్యాలోక గ్రంథరచనమును గురించి చెప్పుచు ఆనందవర్ధనుడు, 'ఈ గ్రంథము ధ్వని సిద్ధాంతమును నిరూపించుటకు మాత్రమే ప్రవృత్తము కాలేదనియు, కవితా ప్రయోజనమును వివరించుచు సహృదయాస్వాద్యమగు రసనిబంధనమున కవులకు మార్గ దర్శకముగా కూడ నీది యువకరించుననియు నుడివెను. ధ్వన్యాలోకము కవితానౌకకు దీపగృహము.
ఈ ధ్వనివాదమును వ్యక్తి వివేకము, హృదయ దర్పణము మున్నగు గ్రంథములలో మహిమభట్టు, భట్ట నాయకుడు మొదలగువారు నిరసించిరి. కాని యాలంకారికులలో పలువురిచే నాదరింపబడిన ధ్వని ప్రస్థాన గౌరవమున కంతమాత్రమున నా వంతయు లోపము రాలేదు.
ధ్వన్యాలోకముమీద
ధ్వన్యాలోకము - వ్యాఖ్యలు :- ధ్వన్యాలోకము మీద చంద్రిక యను నొక వ్యాఖ్య పూర్వ మున్నట్లు తెలియు చున్నది. అది యిపుడు లభ్యము కాదు. ప్రసిద్ధమయిన ధ్వన్యాలోక వ్యాఖ్య లోచనము. దీనిని రచియించినది శ్రీమదభినవగుప్తాచార్యులు. వీరు మహాపండితులు, విమర్శకులు, కాశ్మీర శైవాచార్యులు, పాణినీయమునకు మహాభాష్య మెట్లో, అలంకార శాస్త్రమునకు లోచన వ్యాఖ్య యట్లు. లోచన వ్యాఖ్య వలననే ధ్వన్యా లోకమున కంతటి ప్రచార ప్రసిద్ధులు గలిగిన వనుట యతిశయోక్తి కానేరదు. చంద్రికా వ్యాఖ్యాత శ్రీ మదభినవ గుప్తాచార్యుని పూర్వ వంశీయుడే యని తెలియుచున్నది. దానిని సమగ్రముగా అవలోకించియే యభినవ గుప్తులు లోచనమును రచించిరి. అక్కడక్కడ చంద్రికా వ్యాఖ్యను ఖండించుచు 'మా పూర్వ వంశీయునితో నిక కయ్యము చాలును' అనుచు లోచనకర్త వాదము నుపసంహరించు చుండుటయే యిందుకు సాక్షి.
ఆంధ్ర ధ్వన్యాలోకములు ... :- అఖిలభారత ప్రఖ్యాతిని గని పఠన పాఠములలో మిక్కిలి ప్రచారము నొంది యున్న ధ్వన్యాలోకమునకు తెలుగులోను గొన్ని యను వాదములు వెలసినవి. ధ్వనికారికలు కనువాద మగు “ఆంధ్రధ్వని" సుప్రసిద్ధ పండితులయిన శ్రీ అవ్వారి సుబ్రహ్మణ్యశాస్త్రిగారు రచించిరి. పిమ్మట ప్రకటింపబడిన వానిలో శ్రీ విద్వాన్, సాహిత్య శిరోమణి భాగవతుల కుటుంబశాస్త్రి (ఎం. ఏ.) గారి “అభిన వాంధ్ర ధ్వన్యా లోకము ( ప్రథ మోద్యోతము మాత్రమే), శ్రీ పంతుల లక్ష్మీనారాయణ శాస్త్రులుగారి “ఆంధ్రధ్వని”, న్యాయ శిరోమణి శ్రీమాన్ వేదాల తిరువేంగళాచార్యుల వారి "ఆంధ్ర ధ్వన్యాలోకము" ప్రసిద్ధములు.
చ.రం
ఆనకట్టలు : నిక్షేప జలాశయ నిర్మాణము :-
1. జలాశయ నిర్మాణమునకు గల ముఖ్యోద్దేశములు:- జలాశయములు ఈ క్రింద వివరింపబడిన ఉపయోగముల కొరకై ముఖ్యముగా నిర్మించబడును.
- 1. వర్షములేని ఋతువులలో, లేక వర్షములు తక్కువగా నున్న కాలములో సస్యములకు అనుకూలముగా నీరు
సరఫరా చేయుటకు, బెట్టకాలములో మానవులకు పశుపక్ష్యాదులకు జీవనాధారమునకై నీరు సమకూర్చుటకు.
- 2. పెద్దనదుల వరదలవలన దేశమునకు కలుగు ఉపద్రవములను అరికట్టుటకు,
- 3. దేశములో పారిశ్రామికాభివృద్ధికై అవసరమగు విద్యుచ్ఛక్తిని చౌకగా ఉత్పత్తి చేయుటకు,
- 4. నౌకాయానమునకు వసతులు కల్పించుటకు.
కొన్ని ప్రదేశములలో వర్షములు సంవత్సరములో చాల భాగము విరివిగా కురియుచుండును. ఇవి సామాన్యముగా సస్యానుకూలముగ నుండుటచే పంటలు పండించుటకు వర్షముల ద్వారమున దొరకు నీరు సరిపోవును. కాని యితర ప్రదేశములలో సంవత్సరములో ఏ కొద్ది 'కాలమో వర్షములు కురియును. మిగత కాలములో వర్షము లుండవు. వర్షాకాలములో పైరులకు అవసరమైన దానికంటె అధికముగా నీరు లభించుటయు, ఇతర కాలములో పైర్లు పెరుగుటకు చాలినంత నీరు దొరకక