ఆధునిక వాస్తువాదములు
చున్నది. అమెరికా వాస్తువునందు మాన వావసరముల కొరకును, నిర్మాణాత్మకములు ద్రవ్య సంబంధములు అగు భావముల ప్రకటన కొరకును ఆకృతి యుద్దేశింపబడి పెంపొందుచున్నది. ఐరోపా వాస్తువునందది అచంచల విశుద్ధత్వము కలిగినదై, ఆకృతికొరకే ఆకృతి యన్నట్లు నిల్చుచున్నది. మానవ ప్రయోజనములు దీనిలో అలంకార ప్రాయముగా (plan libre) మాత్రమే భాసించినవి. ముఖ్యముగా ఐరోపాలో ఆధునిక వాస్తువు మానవత్వము యొక్క సారమని నా యభి ప్రాయము. ఇక నిచట ప్రకృతి తత్త్వము, చైతన్యవాస్తువు ప్రబలుచున్నవి" అని డబ్ల్యు, ఎఫ్. డెక్ నేటల్ వ్రాసెను. హెచ్, హెచ్ , హారిస్ అను నాత డిట్లు నుడివెను. "ఈ క్రింది లక్షణములను నా నిర్మాణములయందు గుర్తించ వచ్చును, భవనము ప్రధానముగ నీడపట్టు (శీతాతపములనుండి రక్షణము నిచ్చునది). నేల, గోడ, కప్పులయొక్క సమతలములందు అది ద్యోతకము కావలెను. అది మానవ పరిమాణములో నుండును. భవనము, దానియందు నివసించు వారికి సుఖావహమై గౌరవదాయకముగా నుండవలెను. నివసించువాడు స్వేచ్ఛను సుఖమును పొందునపుడు మాత్రమే వాసగృహము జయప్రదమైన నిర్మాణముగా భావింపదగును. అది జీవితావసరములకు వెనుక హంగుగా ఉండ వలెను. నివాసమునకు సమీపమున సుందరమైన యుద్యానవన మున్నపుడే నివసించువానికి తృప్తియు కట్టడము నకు ఉపయోగమును కలుగును. గృహాంతర్భాగము ఉద్యానములోనికి చొచ్చుకొనియుండదగును. భవనము, అందలి ఆసన పరికరములు, గృహోద్యానము - ఇవన్నియు భావ సమైక్యమును కలిగి యుండవలెను. ఈ నిర్మాణము అరలపై నాధారపడి యున్నది. ఒక యరకు మరొకదానిని అసంఖ్యాకముగ చేర్చుచు పోవచ్చును. ఇది పరివర్తనమునకు మిక్కిలి వీలగు కూర్పు. దీనికి చేర్పు కూర్పులసంఖ్యాకములు. దీనికి శాఖలు ఇష్టమునుబట్టియు అవసరమును బట్టియు ఏర్పడవచ్చును. ఎస్, వాలెట్' అనునాతడిట్లనెను : "ఐరోపాలో నాధునిక భవనములు చాలవరకు ధనవంతుల కొరకు నిర్మింపబడినవి. ఇక అమెరికాలో నాధునిక భవనములం దధికభాగము మధ్యతరగతివారి కొరకు కట్టబడినవి. అందుచే అమెరికాలోని యిండ్లు అధిక సంఖ్యాకుల జీవితమునకు సంబంధించినవియై జాతీయతకు చిహ్నములుగా నున్నవి."
అమెరికా యాంత్రిక దేశమైనప్పటికిని, ఆధునిక మానవునకు లూ యీ మంఫర్డు ఉద్దేశించిన లక్ష్యమును సాధించుటలో నది సఫలమైనది, “యంత్రముల నధిగమించుటలో మన సామర్థ్యము యంత్రములను స్వాధీనము చేసికొని స్వోపయోగమునకు భుక్త పరచుకొనుటపై నాధారపడి యుండును. యంత్రజగత్తు యొక్క లక్షణములైన బ హిర్ము ఖత్వము, వ్యక్తి రాహిత్యము, తాటస్థ్యము - అను ధర్మములను మనలో జీర్ణించుకోను వరకును, మనము జీవచైతన్యము వంకకు పురోగమింప లేము. అప్పుడే సర్వసంపూర్ణ మానవత్వము సాధ్యమగు చున్నది" అని మంఫర్డు భావించెను.
ఇక మనదేశమందలి పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. ఇచట వాస్తుశాస్త్ర చింతన క్రమపరిణామము నందలేదు. పరదేశీయ ప్రభుత్వకాలమం దభివృద్ధికి ఆటంకములు పెక్కు కలిగినవి. కాని యిపుడిపుడే జాగృతి కలుగుచున్నది. యువక వాస్తు కారులు ఆధునిక వాస్తువుయొక్క నిజతత్త్వము నాకళించుకొనుటకు ప్రయత్నించు చున్నారు. సమకాలిక వాస్తుకారులలోను, పట్టణ నిర్మాతలలోను అగ్రేసరుడుగ భావింపబడుచున్న. లి-కార్ బిజీయర్ అను వాస్తుశాస్త్రజ్ఞుని దర్శకత్వమున పంజాబు రాజధానియగు చండీగఢ్ లో ఆధునిక వాస్తురంగమునను నగర నిర్మాణమునను గొప్ప ప్రయోగమని చెప్పబడుచున్న నిర్మాణము సాగుచున్నది. ఇది వాస్తువునందు మనకుగల మహ త్తరమైన వారసత్వముగ గర్వింపదగినదిగా నున్నది. ఈకాలపు మన భవనములలో భారత ప్రాచీన వాస్తువునందలి అలంకరణ చిత్రములను, ఆభరణములను అవలంబించుట విధాయకమని కొందరు నమ్మకముగా చెప్పుచున్నారు. కాని ఈ పద్ధతిని సుదూరము కొనిపోవుటకు వీలులేదు. ఎందుకనగా, వాస్తువుయొక్క సమస్య ముఖ్యముగా భవనముల అంతరస్థలమునకు సంబంధించినది. బాహ్యస్థల ప్రాముఖ్యము దీనితరువాతిది. ఆధునిక వాస్తువు, ద్రవ్య పృథుత్వమును బట్టిగాక ఘనపరిమాణమును బట్టి గణ్యత నొందుచున్నది. ఘనపరిమాణమనగా, సమతలములచే ఆవరణ చేయబడిన అవ