ఆధునిక వాస్తువాదములు
ఆధునిక వాస్తువాదములు :- ఆధునిక వాస్తుశాస్త్రమున పూర్వమును, నేడును కలిగిన రీతులను బరిశీలించుటకు ముందు, వర్తమానోద్యమము ఐరోపాలో నెట్లు వ్యాపించినదో తెలిసికొనుట అవసరము. ఆధునిక వాస్తువు 19 వ శతాబ్దారంభమున ప్రారంభమైనది. సాంఘిక పరిస్థితులు పూర్తిగా పరివర్తనమునంది సామాజిక జీవిత విధానము మారిపోయిన సమయ మిది. ఇట్టి సమయములోను ఐరోపాఖండమున వాస్తువు పరివర్తనరహితముగా నిలిచినది. వాస్తుశాస్త్ర నిపుణులు ప్రాచీనములై, మృతప్రాయములైన పద్ధతుల పునరుజ్జీవింపజేయు ప్రయత్నమున నుండిరి. వాస్తుశాస్త్రమంతయు సామాజికముగ మరణావస్థయం దుండెనని చెప్పనగును. వాటి నిర్మాణముల బరిశీలించినచో శవసంరక్షణమే చైతన్యచిహ్నమని అప్పటి వాస్తుకారులు భావించినట్లు తోచును. మృతరీతులు మాత్రమే నిర్మాణోపయుక్తములైన రీతులని వారు తలపోయుటయే దీనికి కారణము. కాని కొందరు
జిజ్ఞాసువులు వాస్తువునందు రూపకల్పన చేయు సమస్యలను గురించి ఆలోచించ మొదలిడిరి. సంఘమే వాస్తురూపము (Architectural form) నకు మూలమనియు, చైతన్యవంతము, ప్రయోజనకరము అగు సృష్టి జీవ చైతన్యమునుండియే ప్రభవింపగలదనియు వీరు గుర్తించిరి. ఆధునికోద్యమము ప్రథమ ప్రపంచసంగ్రామానంతరము సంపూర్ణముగా రూపొందినది. వాస్తువున బ్రవేశించుటకు బూర్వమీ యుద్యమము కళలలో చేతిపనులలో పొడసూపి వర్ణచిత్రము, అద్దకము, ఘట నిర్మాణము, కఱ్ఱసామానుల తయారులలో నిమగ్నమై యారితేరినది. విలియం మోరిస్, ఫిలివ్ వెబ్ ఈ యుద్యమమునకు మార్గదర్శకులు. . ఫిలిప్ వెబ్ 1851 వ సంవత్సరమున 'అరుణ భవనము' (Red house) ను నిర్మించెను. దీనిలో అలంకారపుజిలుగు లన్నియు పరిహరింపబడి, ముఖ్యాంశములు మాత్రమే గ్రహింపబడెను. అవసరమునకు దగిన వస్తువులు మాత్రమే యుపయో గించుటయందును, సరళములును, యుక్తియుక్తములునగు వివరముల యుపయోగము నందును ఇది ప్రత్యేకతనుగడించినది. ఇదివరలో కీర్తి గడించిన యే రీతులనుండియు వివరముల నీతడిందుప యోగించలేదు. ఈ విధముగా నోక వాసభవనము నిర్మాణ రీతులందు వైలక్షణ్యమునకు మూలమైనది.
వాసగృహవాస్తువే నూతన పద్ధతులు ప్రభవించుటకు కారణమైనది. ఇందవలంబింపబడిన సూత్రములు మూలాధారములైనవి. మానవత్వ నిర్మాణమువైపు గొనిపోవు నూతనసమాజ వ్యవస్థయే వీరి యాశయము. ఈ యుద్యమము ఆర్టు నౌవీ (Art Nowveau) అని ఫ్రాన్ సు దేశమునందును జుగండిస్టిల్ (Jugen distil) అని జర్మనీ దేశము నందును వ్యవహరింపబడినది. బెల్జియం దేశమున ఈ యుద్యమము హెన్రీవాన్ డీ వెల్డీయను వానితో నారంభింపబడెనని చెప్పవచ్చును. ఇది ప్రారంభమున జర్మనీలోను, క్రమముగా ఐరోపా ఖండమందంతటను వ్యాపించెను.
ప్రజల యభిరుచులలో క్రొత్త పరిణామము, శాస్త్రియము, సాంకేతికమునైన నిర్మాణాభివృద్ధి, నూతన సందర్శన సిద్ధాంతములు, ఆధునికోద్యమము బయలుదేరుటకు ముఖ్యకారణములు, స్థాపత్య (Engineering) రంగమునందు అభివృద్ధి ప్రదర్శకమైన నిర్మాణములు,ఉక్కు, గాజు, దృఢీకృతమైన కాంక్రీటు (R. C. C)మొదలగువాని ఉపయోగ జ్ఞానము, వీటి సాంకేతిక సౌందర్యావకాశములు మృతరీతుల బంధనములనుండి వాస్తువునకు విముక్తి కలిగింప కృషి చేయుచున్న వాస్తు శాస్త్రజ్ఞులకు చక్కని దోహద మొసగినవి. ఈ కాలమున నిర్మింపబడిన సుందరమైన వంతెనలు, స్ఫటిక ప్రాసాద ముల (Crystal palaces) వంటి కట్టడములు, నూతన పద్ధతిలో ముఖ్యముగా పేర్కొనదగిన పొలిమేర రాళ్ళు, వాస్తు శాస్త్రజ్ఞులు తమ భావములను ప్రయోజన ధర్మము నాధారముగాగొని నిర్మింప మొదలిడిరి. నిర్మాణ రంగమున నూతన పద్ధతుల నవలంబించుటవలన, రూపపరిణామము ప్రయోజ్య వస్తువులపై నాధారపడ జొచ్చెను. ఆధునిక వాస్తువునకు మార్గదర్శకులైనవారిలో అధిక సంఖ్యాకులు స్థాపత్య శాస్త్రజ్ఞులే. ప్రత్యక్షముగనో పరోక్షముగనో ఆధునిక వాస్తుకారులకు గురు ప్రాయులు లికార్ బిజీయర్, గ్రోపియస్ మొదలగువారు. వీరిలో వెన్నీనుకు చెందిన యిద్దరు శిల్పులు, ఆటోవాగ్నరు (1841-1918).- అడాల్ఫ్ లూసు (1870-1933) ఫ్రాన్సు దేశమునకు జెందిన అగస్ట్ పెర్రెటి, జర్మను దేశస్థుడగు పీటర్ బెహరన్సు అనువారు ముఖ్యులు. 1918 సం