Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/766

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక భారతీయ చిత్రకళారీతులు


ఆనంద కుమార స్వామిగారు “పునరుజ్జీవనము" నందలి తాత్త్వికాశయములను వివరించి, అంతర్జాతీయ ప్రజలకు అతి దక్షతతో విశదపరచిరి. ఈ పునరుజ్జీవన దృక్పథమునకు విలువ కట్టునప్పుడు చరిత్రజ్ఞుడు లోతైన దాని సాంఘిక మూలములను విస్మరింపరాదు.

భారతదేశమున డాక్టరు అవనీంద్రనాథ ఠాకూరుగారి నాయకత్వమున యువ కళాకారులు పలువురు అజంతా కళను మొగలాయి రాజపుత్ర కళాఖండములను నిశితముగా పరిశీలింప నుద్యుక్తులై హావెల్ గారి వాదములను సార్థక 'మొనరించిరి. చిత్రకళా పునరుజ్జీవనము ఈ విధముగా ఆరంభింపబడెను సంస్కృతి విజయముగా పరిణమింపనున్న రాజకీయ విజయముచే ప్రతిహతులైన పునరుజ్జీవన యుగమునందలి కళాకారులు భారత చరిత్ర యందలి మహాయుగముల నుండి అనవద్యమైన ఆవేశ మును గ్రహింప అన్వేషించి రనుటలో ఆశ్చర్యములేదు.

పునరుజ్జీవన కాలమునందలి కళాకారులు యథాస్థిత చిత్రణవిధానము, రూపసాదృశ్య నిర్వహణము మున్నగు పాశ్చాత్యుల విలువలను విసర్జించి కాల్పనికమును (Poetic) ప్రబోధాత్మకమును (Evocative) అగు పద్దతిని అవలంబించిరి. రచనా విధానమునకూడ వారు యూరపునందలి తైలవర్ణ చిత్రణమును విడిచి నీటిరంగుల' వైపునకు మరలిరి. ఈ తిరుగుబాటు కేవలము పాశ్చాత్యపద్ధతి కేకాని సర్వవై దేశిక ప్రభావములకును గాదు. ఏలయన చైనా జపానుదేశములందలి చిత్రకళావిధానములు నిశితముగా పరిశీలింపబడెను. పునరుజ్జీవన యుగమునందలి రేఖా విన్యాస లేఖన విధానము కొంతవరకు చైనా చిత్రకళా విధానమునుండి గ్రహింపబడినదనియు, వర్ణవైశిత్యమును సమీకృత సౌందర్యమును సంపాదించుటకై పలుమార్లు క్షాళనముచేయు విధానమున జపాను ప్రభావము గోచరించుచున్నదనియు చెప్పవచ్చును.

వారి తీవ్ర మనఃప్రవృత్తి దాని చారిత్రక సమర్ధనముతో అంతరించిపోయెను. కాని ఈ పునరుజ్జీవన విధానము నుండియే భారతదేశమునం దంతటను కళను పునరుజ్జీవింపజేయుశక్తి ప్రసరించి యుండెనని కళాచారిత్రకుడు కృతజ్ఞతతో తప్పక స్మరింపవలసి యున్నది. ఈ ఉపఖండ మందలి కళాపాఠశాల లన్నిటికిని ఉపాధ్యాయులను సమకూర్చిన ‘వృద్ధకులపతి' అదియే.

ఆధునిక భారతీయ చిత్రకారులలో ప్రథముడు అవనీంద్రనాథ ఠాకూరు. అదే ఆతని గొప్పతనము నకును కారణము. అతడు నిర్జీవ సంప్రదాయములతో శుష్కించి పోయిన ఢిల్లీ, పాట్నా విధానముల అమితాలంకరణపద్ధతిని విడిచి, చైనా జపాను విధానములందును, పాశ్చాత్యకళయందునుగల లక్షణ పరత్వము, అపరిపక్వ, దృష్టిఅనువానినుండి మరలిపోజాలెను. డా. అవనీంద్ర నాథ ఠాకూరు ప్రాచీన మధ్యకాలములందలి భారతీయ కళా విధానములందలి పద్ధతిని, సిద్ధాంతములను కొనసాగించె ననుట సరియైనది కాకపోవచ్చును. ఒక క్రొత్తసమన్వయ విధానమును కనుగొని నిజ ప్రామాణికత్వమును నిరూపించుట ఆతడు చేసిన ఘనకార్యము. ఆ విధానము ప్రమాణభూతమై భారత దేశమునందలి లఘుచిత్రకళా విధానము (మినియేచరు) లోని మార్దవమును జపానీయుల చిత్రకళా విధానమునకు చెందిన సంపన్న శిల్ప