Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/763

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆధునిక పాశ్చాత్య చిత్రకళ


డయినాడు. అతని ప్రయత్నమంతయు ఎదుటనున్న దృశ్యమునకు సంపూర్ణమై శాశ్వతమైన లక్షణము (Characteristic) నాపాదించుటయందే లగ్నమై యుండెను. అతడే ఒక పర్యాయము నేను ప్రకృతిని యథారూపమున చిత్రించుటకు పూనుకొనలేదు. కాని దాని ప్రతినిధిరూపమును జూపి నాను - అని అనెనట. అతడు తనకు కలిగిన (మూడవ) పరిమాణ విషయకమయిన అనుభూతిని, చిత్రము యొక్క లోతును, (depth) చిత్ర ఫలకమునందు తార్కిక దృష్టిని పునర్నిర్మితము గావించుటకు పూనుకొనెను, సాధారణముగ శాస్త్ర దృష్టిచే నావృతమైన వస్తువుల ఆకార ప్రాతిపదిక లన్నియు, శంకు, స్తూపము, గోళము. వీటియొక్క ఆకారములోనుండునన్న సత్యము నాతడు పునః ప్రతిస్థిత మొనర్చెను. అతడు ఆరేఖాగణిత సంబంధములగు ఆకృతులన్నియు (plane by plane) విధానములో నమర్చి తగిన రంగులతో సంక్షేపముగను, ప్రస్ఫుటముగను చూపగలిగెను. అతని సమకాలిక కళాకారులు, విమర్శకులు అందరు, అతనికళ నిపుణమైనది కాదనియు, వికాసహీనమైన దనియు విమర్శించిరి. అయినను అతడు సరకుగొనక సమకాలిక భావముల కెదురీది తన సిద్దాంతమునకు రూపురేఖల నొసగి ఘనాత్మకత (cubism) అని ప్రపంచములో ప్రఖ్యాతినొందిన సిద్ధాంత విషయమున గురు పీఠము నధిష్ఠించెను. . ఛాయావాదముకంటే ఘనాత్మకత (cubism) అను సిద్ధాంతము యొక్క జీవనపరిమితి చాల స్వల్ప మనియే చెప్పవచ్చును. నిజానె అనునాతనికి సమకాలికుడైన గాగిన్ అనునతడు ప్రతిపాదించిన ప్రాచీనాలంకారిక పద్ధతి ననుసరించినవాడు మతిసే అను చిత్రకారుడు. తన భావములను వ్యక్తీకరించుటకు తోడ్పడు వివిధాంశములను చిత్రకారుడు సాలంకారముగ కూర్చు కళయే చిత్రరచన యని అతడు భావించెను. అతని అనుయాయి వర్గమునే షావులు లేక ఆటవికులు అని పిలిచిరి. ఈ ఫావుల సంచలనమీ శకమునందు ప్రారంభించి దాదాపు 1914 సం. నాటి ప్రథమ ప్రపంచ సంగ్రామము వరకు సాగెను. ఈరీతియందు ప్రసిద్ధులయిన చిత్రకారులు వ్లామింకు, డిరాయిన్, రౌనాల్టు అనువారలు. ఈషావుల వలె వీరె, జొన్నార్టు ఎడునార్డు, విల్లార్డు అనువారు ఉద్రిక్త విధానము ననుసరింపక ప్రశాంత విధానమును చేపట్టిరి. వీరిని ఇంటినిస్ట్రీస్ (Intinistes) అందురు.

తరువాత, చిత్రలేఖనము యొక్త దృక్పథములు కూడ రాజకీయ దృక్పథములతో నేకీభవింపబడ వలయునను ప్రయత్నములు గావింపబడినవి. ఆయత్నముల ఫలితమే ఫ్యూచరిస్టు (Futurist) సంచలనము. 1909 వ సం న మారినెట్టు అనునాతడు ఫ్యూచరిస్టు సిద్ధాంతములను రాజకీయ సిద్ధాంతములతో మేళవించెను. మారి నెట్టు, సేవరీని, అనువారు తమ చిత్రములలో చాలభాగము యంత్రముల యొక్క శక్తుల నధికతరముగ కనబరచుట యందును, అతి త్వరితగమనముగల మోటారు ధ్వనికి సాంకేతిక చిహ్నములను కల్పించుటయందును, విప్లవము చేత నుద్రి క్తమయిన భావములను ప్రదర్శించుటయందును, శ్రద్ధ వహించినట్లు కానవచ్చును. ఐరోపా రాజకీయములు ముఖ్యముగా మస్సోలినీ కాలమునాటి రాజ్యాంగ విధానములు, ఆనాటి చిత్రకళకు సామగ్రిగా గ్రహింపబడినట్లు తెలియుచున్నది. ఈ విధానము ఆనాటి ఫ్రెంచి చిత్రలేఖనముపై అధిక ప్రభావము కలిగించెను.

ఫ్యూచరిస్టుల యొక్క ప్రయోగములు Shock tactics చిత్రకారుల రచనా విధానమునకు తోడుపడు నట్లుగా గ్రహింపబడినవి. 'డాడిజం' అనునవీన సిద్ధాంతము ఫ్రాన్సునందు జన్మింపక జ్యూరిచ్ నందు తలయెత్తినది. దాని ప్రముఖానుయాయి దేశములు జర్మనీ, రుమేనియా అనునవి. ఇంత వరకుగల నియమముల నుల్లంఘించుట, ఏవిధమయిన లక్షణమునకు లొంగకపోవుట అనునవియే ఈ సిద్ధాంతము యొక్క ప్రధానాశయములు. కేవలము చిత్రకళయందేకాక సాహిత్యమునందును, రాజకీయము లందును, తుదకు జీవితమందుకూడ ఏ నియమముచేతను వ్యక్తి బంధింపబడకూడ దనియే వారి భావము. అన్ని పద్ధతులను తిరస్కరించుట, జన సమ్మతినొందిన అన్ని విలువ. లను ధ్వంసముచేయుట, సృష్టి నిర్మాణము తదర్ధమే (స్వాభావికమే) అనుట, సృష్టి నిర్మాణ కళ యందు అది (ప్రకృతి) స్వయముగ నాశన మొందుట” అను సిద్ధాంతములను వారు ఉద్ఘాటించిరి. ఈ సంచలనము 1918 నాటి ప్రపంచ యుద్ధ ఫలితములగు నిరాశ, నిస్పృహ,