Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అంతర్గుహాకములు

బట్టి, ప్రేషక విద్యుత్తులో సుమారు మూడు (3) శాతమునకు మించి వోల్టేజి పతనముండరాదు. అనగా 230 వోల్టుల ప్రేషక విద్యుత్తునకు దాదాపు 8 వోల్టులకన్న అధికముగ వోల్టేజి పతన ముండరాదు.ఈ పరీక్షను చేయుటకు ప్రేషకము వద్ద వోలు మీటరుతో వోల్టేజి కనుగొనవలెను. తరువాత ప్రధాన స్విచ్చినుండి అతి దూరముననున్న దీపము వద్ద వోల్టేజి కనుగొనవలెను. ఈ రెండు విలువల తేడా పై జెప్పబడిన నియమమును మించి యుండరాదు. ఈ పరీక్షను చేయునపుడు అన్ని దీపములు, తదితర విద్యుత్పరికములు పనిచేయు చుండవలెను ('On')

ఒక్కొక్కప్పుడు పై జెప్పబడిన నియమములను శాస్త్ర ప్రకారము పాటించుట కవకాశముండదు. వ్యక్తుల యిండ్లలోను, దుకాణములలోను మనము ప్రతిష్ఠాపనమును చేయుటకగు ఖర్చును తగ్గించుట కొఱకు కొంత వస్తుగుణ ప్రమాణమును (Quality) త్యాగము చేయవలసి యుండును.

ప్రతిష్ఠాపనమును ఏర్పాటు చేయుటకు ముందు ఈ దిగువ అంశములను మొదట నిర్ధారణ చేయవలెను.

1. వినియోగింపబడు వస్తువుల (Material) రకమును,నాణ్యమును (Quality). 2. తంత్రుల ప్రతిష్ఠాపనా విధానము. 3. ప్రతిష్ఠాపన పని సాగుచుండగా, నియమముల నుద్దేశించుట. 4. వివిధ అంగముల యొక్క (మీటరు, ప్రధానమగు స్విచ్ఛి మొదలగు వాటి) స్థాననిర్దేశము, వివిధ అంగములను, పాయింట్లను చూపుపటము (Plan), కావలసిన పరికరములు, వస్తువుల జాబితా. 5. అవసరమైన విద్యుద్వలయముల సంఖ్య. అయిదు (5) ఏంపియర్లకు మించని శక్తితోగూడిన ఒక ఉపవిద్యు ద్వలయము 40 వాట్లు, 220 వోల్టులు, ప్రమాణము గల 20 పాయింట్లకు సరఫరా చేయగలదు. 6. భూసంబంధమును కలుగజేయుట. 7. ప్రతిష్ఠాపనములను పరీక్షించుట. ఎంత జాగరూకతతో ప్రతిష్ఠాపనమును ఏర్పరచినను కొన్ని ప్రమాదములకు దారి దీయగల పొరపాట్లు సంభవించు చుండును. ప్రతిష్ఠాపనములో విద్యుత్తు ప్రవహింపజేయుటకు ముందు (Switch on) విరిగిన తంత్రులు, తప్పుడు కలయికలును లేకుండ సరిచూచినచో, ఇట్లు ప్రమాదముల బారినుండి రక్షణలు పొందవచ్చును.

అ.హు

అంతర్గుహాకములు:- (Celenterata) అంతర్గుహాకములు, సీలెంటరేటా (Celenterata) లేక 'కొనిడేరియా' అనునవి నిర్దిష్టమగు (సీలెంటరేటా) కణజాలమును కలిగిన హీనాతిహీనమగు ఒక తరగతి జంతువులు. (ఇది గ్రీకుభాషనుండి వచ్చినది. (Koilos = Hollow) గుల్లగా నుండు (Enteron = Intestine) ప్రేగు, ఆంత్రము.) ఈ వర్గమునందలి అతి సామాన్యమగు రూపములు అతి సామాన్యమైన స్పాంజీలకన్న ఎక్కువ తరగతిలో నుండవు. అయినప్పటికిని ఈ తరగతికి చెందిన జాతులు ఎక్కువ అభివృద్ధిలో నున్నవి. ఈ జాతియందలి పెక్కు జీవులు సుస్పష్టమైన ధాతుమండలము (Tissue) యొక్కయు, అంగముల యొక్కయు, ప్రారంభదశను వ్యక్తము చేయును. అంతర్గుహాకజాతిలో అనేక రకముల అంగవర్తులత్వ సౌష్ఠవము (Radial symmetry) కన్పించును. మరికొన్ని పార్శ్వ (Lateral part) సౌష్ఠవో పేతములై యుండును. పెక్కు అంతర్గుహాక ములు ఉత్పత్తికి తోడ్పడునవి; అట్లేర్పడిన చిన్న చిన్న గుంపులు అన్యోన్య సహకారమునకును, శ్రమవిభాగమునకును చక్కని ఉదాహరణములు.

అంతర్గుహాకములందు పరిచిత్రములు, సుందరములును అయిన రూపములు అధిక సంఖ్యాకముగా నున్నవి.సముద్రపు పోటు పాటు గల ప్రదేశములలోను, వాటికి దూరముగా ఉండు ప్రదేశములలోను ముత్యపుచిప్పలను, రాళ్ళను జాలరు కట్టునట్లుగా కటు 'జూ ఫైట్సు' అనబడు అందమైన కణజీవులును; గుంటలలో తేలుచు, పారదర్శకములైన (Transparent) చిరుగంటల వంటి జీవులును. రాళ్ళసందులలో గుంపులు కటు 'సముద్రపు అనిమోన్సు' అనబడు గాలిపువ్వులును; అలలపై అతిచురుకుగా ఈదగల జెల్లిచేపలును; అంతర్గుహాక జాతికి చెందిన అలస స్వభావము కల పోలీపాయ్ డ్ (పుర్వగకములు) లకును, చురుకైన స్వభావముగల మెడుసాయ్ డ్ (ఛత్రికలు) లకును కొన్ని నిదర్శనములు, టినోఫోరా ప్రత్యేక జాతికి చెందినటువంటి