Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/70

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గృహాంతర్విద్యుత్ప్రతిష్ఠాపనములలో, తంత్రుల ప్రతి స్థాపనా పద్ధతులు (House wiring systems) ప్రధాన ముగా మూడు రీతులుగ నున్నవి. 1. క్లీటు పద్ధతి (Cleat system) 2. దారు పేటికా tem) విధానము (Wood casing sys- 3. సీసపు తొడుగు పద్ధతి (Lead covered system) 4. సి. టి. యస్. పద్ధతి (C T. S. system) 5. నాళ విధానము (Conduit system) విద్యుత్ప్రతిష్ఠావనము యొక్క ప్రకృతి (Nature), రక్షణ (Protection), ఖర్చుల (Expenditure) నను సరించి, ఈ పైనుదహరింపబడిన పద్ధతులలో నేదో ఒక దానిని ఉపయోగింప వచ్చును. క్లీటు పద్ధతి :- (Cleat system) ఈ పద్ధతిలో, రెండు పోర్సిలీను క్లిటు (బిళ్ళ) లుండును (Porcelain cleats). ఈ రెండు క్లీటుల నడుమ వి.ఐ. ఆర్. తంత్రులు 0 వి.ఐ ఆర్ తంత్రులు. క్లీటులు తంత్రులు దూలము "T" ఆకారపు అతుకు వ. 16 క్లీటువిధానము 31 అంతర్విద్యుత్ప్రతిష్ఠ (Volcanised India Rubber) పోవుటకు వీలుండును. రెండు క్లీటులును స్క్ర్కూతో కఱ్ఱదూలమునకు (Wooden beam)గానీ, క ఱ్ఱబద్దీలకుగాని బిగింప బడును. కాంక్రీటుతో గాని, ఇటుకతోగాని చేయబడిన గోడలకు ఈ పోర్సిలీను క్లీటులను స్క్రూతో బిగింపలేము. అందుచే గోడలోనికి ముందుగ క ఱ్ఱబిళ్ళలన (Wooden plugs)దింపి, సి మెంటుతో వాటిని గోడలో నతికి, ఆ కఱ్ఱబిళ్ళలకు పై పోర్సిలీను క్లిటులను బిగింతురు. (చూ.. 16). తంత్రులు తేమకుగాని, రసాయనిక ధూమములకు (Chemical fumes) గాని, తదితర విధ్వంసక శక్తులకు గాని గురికాకూడదు. గోడలలో నుండిగాని, ఇంటి కప్పులో నుండిగాని తంత్రులు పోవలసి వచ్చినప్పుడు, వాటిని పోర్సిలీను గొట్టముల ద్వారాగాని (Porcelain tubes), దిట్టమైన లోహపు నాళముల (Metallic con- duit) ద్వారాగాని గొంపోవలెను. క్లీటు పద్ధతి ననుసరించిన ప్రతిష్ఠాపనము చాల సుళువు. మరియు మార్పులనుగాని, వ్యాప్తిని (Extensions) గాని చాల సులభతరముగ చేయవచ్చును. కాని ప్రస్తుత కాల మున ఈ పద్ధతి ననుసరించిన ప్రతిష్ఠాపనము వాడుకలో లేదు. ఇది శీఘ్ర కాలములో విధ్వంసక శక్తులకు గురియై చెడిపోవునుగాన తాత్కాలికమైన (Temporary) స్థాపనములకు మాత్రము ఈ పద్ధతి ననుసరింతురు. ప్రతి దారు పేటికా విధానము (Wood casing system)- వి. ఐ. ఆర్. తంత్రులు, గాడీలుగల పేటిక గుండా గొం పోబడును. దీనికి కఱ్ఱ బద్దీ కప్పు (లేక మూత) ఉండును. ఈ ఏర్పాటువలన, తంత్రులకు విధ్వంసక శక్తులవలన అపాయము ఉండదు. పేటికను (Casing) సమాన దూర ములలో స్థాపింపబడిన పోర్సిలీను బిళ్ళల సహాయమున గాని, లేక క్లీటు పద్ధతియందుదాహరింపబడిన కఱ్ఱబిళ్ళల సహాయమునగాని, గోడకుగాని, సీలింగుకుగాని స్క్రూ సహాయముతో బిగింపవచ్చును. (చూ.ప. 17) పేటికయును, పైకప్పును రెండు మారులు షెల్లాక్ వార్నీష్ పూతపూయబడవలెను. లోపలను, వెనుక భాగమునను ఒక మారును; ప్రతిష్ఠాపన తరువాత రెండవ మారు బయట నుండియును ఈ వార్నీషు వేయవలెను. బయటి వార్నీషుకు బదులు రంగు వేయవచ్చును. (ఈ