ఆంధ్ర సారస్వత పరిషత్తు
కీర్తింపబడియున్నాడు. క్రీడాభి రామమున శ్రీకాకుళము నందు జరుగు తిరునాళ్ళ ప్రశంస కలదు. పురుషొత్తమ కవి ఆంధ్రనాయకాలయము పూజాపురస్కార శూన్యమై హీనదశయం దున్నప్పుడు మిగుల పరితపించి "సుప్రసిద్ధుడు ప్రత్యక్షరూపు డగు దేవున కిట్టి విపరీతస్థితి చేకూరుటకుఁ గినిసి నిత్యోత్సవము చేయించికొనక చేతగానివాని వలె నూరకుంట ప్రతిష్ఠ కాదనియు, పూర్వపుకిర్తి నిలుపు కొమ్మనియు నిందాస్తుతులతో ఆంధ్రనాయక శతకము రచించెను. చల్లపల్లి (దేవరకోట) ప్రభువు అంకినీడుగారు ఆలయ పునర్నిర్మాణము గావించిరి. ఈ క్షేత్ర మెన్ని మార్లు పునర్నిర్మాణ దశల ననుభవించినదో! ఆంధ్రవిష్ణువు మాత్రము నేటికిని పూజింపబడుచున్నాడు. ఆ క్షేత్ర మాహాత్మ్య మట్టిది. "శ్రీకాకుళము భక్తలోక చింతా మణి, సుకృతాకరము, మహాక్షేత్రావతంసంబు."
కె. గో.
ఆంధ్ర సారస్వత పరిషత్తు :- ఆంధ్ర సారస్వత సంస్కృతుల అభివృద్ధి, అక్షరాస్యతా వ్యాప్తి అను ఆదర్శాలతో ఆంధ్ర సారస్వత పరిషత్తు హైదరాబాదు నగరమున 1943 సంవత్సరము మే నెల 26 వ తేది నాడు శ్రీలోకనంది శంకరనారాయణరావుగారి అధ్యక్షతన స్థాపితమైనది. ఈ సంస్థ తన ఆదర్శాల ప్రకారము పనిజేయుట కొరకు ఈ క్రింది ఆశయములను నిర్ణయించుకొన్నది.
- 1. సభలు, సమ్మేళనములు, సమావేళములు.
- 2. దేశమందలి సారస్వతమును తత్సంబంధమైన విశేషములను గ్రహించి ప్రకటించుట-
- 3. పారిభాషిక మాండలిక కోశములను సిద్ధపరచుట.
- 4. రాష్ట్రమందలి ఇతర సారస్వత సంస్థలను జతపరచుకొని సారస్వత కృషి సాగించుట.
- 5. సారస్వత పరీక్షలు తెలుగులో జరుపుట.
- 6. రచయితలను ప్రోత్సహించుట.
- 7. సంబంధ శాఖలను స్థాపించుట.
1948వ సం. పోలీసు చర్యకు పూర్వము హైద్రాబాదు రాష్ట్రములో ఆంధ్ర సారస్వత సంస్కృత్యభివృద్ధికి పెక్కు ప్రతిబంధకము లుండెడివి. ప్రతికూల పరిస్థితులలో 1948 వరకు ఈ పరిషత్తు పనిచేయవలసి వచ్చినది. ఈ సంస్థ యొక్క వార్షికోత్సవాలు ఇప్పటి వరకు హైదరాబాదు, ఓరుగల్లు, నల్లగొండ, మహబూబునగరం, తూపురాస్, మంచిర్యాల, అలంపురములలొ ఏడు పర్యాయములు జరిగినవి. అలంపురము వార్షికోత్సవమునకు భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్వన్మణి ప్రారంభోత్సవము చేసి పరిషత్తును ఆశీర్వదించిరి. ఇవిగాక పరిషత్తు జిల్లా సభలుకూడ పలు ప్రాంతాలలో ఒరిగినవి. ఇప్పటివరకు ఈ సంస్థకు శ్రీ లోకనంది శంకరనారాయణరావు, కీ.శే. శ్రీ సురవరము ప్రతాపరెడ్డి, శ్రీ బుజ్జా వేంకటసుబ్బారాయడు, శ్రీ ఇల్లిందల రామచంద్రరావు, శ్రీ పర్సా వేంక టేశ్వరరావు, శ్రీ దేవులపల్లి రామానుజ రావుగార్లు అధ్యక్షులుగా పనిజేసిరి. ఈ సంస్థకు ఇప్పటివరకు కార్యదర్శులుగా పని జేసిన వారు శ్రీ బూర్గుల రంగనాథరావు, శ్రీ విదురు వేంకట శేషయ్య, శ్రీ నూకల నరోత్తమ రెడ్డి, శ్రీ పులిజాల హనుమంతరావుగార్లు.
పరిషత్తు కార్యక్రమములో పరీక్షల నిర్వహణము అతి ముఖ్యమైనది. పోలీసు చర్య తరువాత యీ పరీక్షలకు వేల సంఖ్యాకులుగా అభ్యర్థులు వచ్చుచున్నారు. ప్రాథమిక, మాధ్యమిక, ప్రవేశ, విశారద అను పరీక్షలు సంవత్సరానికి రెండు పర్యాయములు జరుగును. ఇందులో ప్రవేశ పరీక్ష యందు ఉత్తీర్ణత గాంచిన వారు ప్రాథమిక పాఠశాలలలో ఉపాధ్యాయ పదవిని ఆక్రమించుటకు అర్హులుగను, విశారద పరీక్షయందు ఉత్తీర్ణతనొందిన వారు సెకండరీ పాఠశాలలలో తెలుగును బోధించుటకు అర్హులు గను హైదరాబాదు ప్రభుత్వమువారు ఆమోదించియుండిరి. ఇప్పటి వరకు ఈ పరీక్షలలో నలుబది వేల వరకు ఆభ్యర్థులు పాల్గొనియున్నారు. ఈ పరీక్షలు ప్రతిసారి 40 నుండి 100 కేంద్రాలలో జరుగుచుండును. ఇందులో అధిక సంఖ్యాకులైన అభ్యర్థులు పల్లెటూళ్లలో నివసించువారు; పాఠశాలలలో చదువుకొను అవకాశములేని వయోజనులు, తెలంగాణ జిల్లాలలోని ప్రతి పల్లెటూరికి ఈ పరీక్షలు సుపరిచితములు. ఇప్పటివరకు తెలంగాణములోని కొన్ని మార్ల పల్లెటూళ్లలో ఈ పరీక్షలు నిర్వహింపబడినవి. అందుచేతనే శ్రీబూర్గుల రామకృష్ణారావు గా రొకమారు పరిషత్తు కృషిని గూర్చి, మాట్లాడుచు సూర్యుని వెలుతురు