ఆంధ్ర వాఙ్మయ చరిత్రము - II
తిమ్మకవికి సమకాలికుడొ ఇంచుక తరువాతివాడో అని చెప్పదగిన ఏనుగు లక్ష్మణ కవి బహు గ్రంధములు రచించి ప్రసిద్ధి కెక్కెను. రామేశ్వర మాహాత్మ్యము, సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్రము, రామ విలాసము, గంగా మాహాత్మ్యము, గీర్వాణ సూర్య శతకము, విశ్వేశ్వరోదాహరణము, నృసింహ దండకము, మున్నగునవి ఈతని కృతులు. ఇతడును, ఇతని పూర్వులును పెద్దాపుర సంస్థానము నాశ్రయించి ఆ రాజులచే వివిధ సత్కారములు గ్రహించిరి. ఇతడు తిమ్మ జగపతి గారి కాలమునందును వారి తండ్రియైన రాయ జగపతి రాజుగారి కాలమునందును నివసించెను. రామేశ్వర
మాహాత్మ్యమున శ్రీరాముడు సేతువునొద్ద రామేశ్వర లింగమును స్థాపించుటయు, తక్షేత్ర మాహాత్మ్యమును వర్ణింపబడినవి. ఇందలి కథ స్కాంద పురాణగత రామేశ్వర ఖండమునుండి గ్రహింపబడినది. కవి దీనిని గురుజాన పల్లి యందలి మల్లేశ్వర దేవునికి అంకితము చేసియుండెను. ఈ కవి రచించిన కడపటి గ్రంథము రామవిలాసము, దీని నితడు తిమ్మజగపతి రాజుగారి సన్నిహిత బంధువైన వత్సవాయ గోపరాజునకు (1759-1797) అంకితము చేసెను. ఇతడు రచించిన గ్రంథములలోని కెల్ల మిక్కిలి ప్రసిద్ధి నొందినది సుభాషిత రత్నావళి. ఇది సంస్కృతమున భర్తృహరి యోగీంద్రుడు రచించిన సుభాషిత త్రిశతికి అనువాదము. ఇందు నీతిళతకము, శృంగార శతకము, వై రాగ్యశతకము అను మూడు శతకములున్నవి. ఒక్కొక్క శతకము పదేసి పద్ధతులుగా విభజింపబడినది. ఇది పెద్దాడపురీ నిలయుడైన సోమశంకర స్వామికి అంకితము చేయబడినది. ఇది అనువాద మయ్యు చక్కని ధారాశుద్ధియు, భావ సౌష్ఠవమును గల్గి ఆంధ్రదేశమున మిక్కిలి ప్రచారము నందినది. అన్వయ కాఠిన్యము కాని, ప్రౌఢ దీర్ఘ సమానబాహుళ్యము కాని లేక ఇందలి రచన ద్రాణాపాకమై ఆలరారుచున్నది. అనువాదాంతరము లున్నను దేశమున బహు వ్యాప్తి గాంచుటయే దీని
ప్రశస్తికి తార్కాణము.
సుభాషిత త్రిశతి నాంధ్రీకరించిన ఇతరకవులు ఎలకూచి బాలసరస్వతియు, పుష్పగిరి తిమ్మనయు, తిమ్మన (క్రీ. శ. 1730-1790) రచనలో ఒక్క నీతిశతకమే లభించు చున్నది. ఇతడును తన గ్రంధమును శివార్పితమే కావించెను. అతడన్నిశ్లోకములను చంపకోత్పలములందే తెనింగించెను. ఇట్టి నియమము పెట్టుకొన్న వాడగుట చేతనే ఇతడు చిన్న శ్లోకములను అనువదించుపట్ల వృత్తమునకు సరిపోవునట్లందలి భావములను పెంపుచేయవలసివచ్చెను.అయ్యును, ఇతని రచన మిక్కిలి సరసమును జాతీయమునై యొప్పుచున్నది. ఇది కాక ఇతడు సమీరకుమార విజయము అను ఏడాశ్వాసముల ప్రబంధమును కూడ రచించెను
బాలసరస్వతి తన అనువాదమునంఏలి పద్యములను 'సురఖిమల్లా నీతివాచస్పతీ' అను మకుటముతో రచించెను. ఈ సురభిమల్ల భూపతి జటప్రోలు సంస్థానాధీశుడని విమర్శకులు చెప్పుచున్నారు. బాలసరస్వతి కవిత్వము ప్రౌఢమై కొంచె మర్థక్లేశము కల్గించును. నన్నయ రచితమని ప్రసిద్ధమైన ఆంధ్రశబ్ద చింతామణికి ఇతడు టీక రచించెను. ఇదికాక చంద్రికాపరిణయమను ప్రబంధమును కూడ ఇతడు వ్రాసెనని చెప్పుదురు. కాశీరాజు కూతురైన చంద్రికను భీముడు వివాహమాడుట ఇందలి కథ. ఈ గ్రంథము సురభి మాధవరాయల చంద్రికాపరిణయము కంటె భిన్నమైనది.
అడిదము సూరకవి విజయనగర సంస్థానమున పూసపాటి (రెండవ) విజయరామరాజుగారి కాలమున (క్రీ.శ. 1730-80) ఉండినట్లు తెలియుచున్నది. కవిజన రంజనము రామలింగేశ శతకము, కవి సంశయ విచ్ఛేదము, ఆంధ్ర చంద్రా లోకము, ఆంధ్ర నామ శేషము అనున వీతని కృతులు. ఇవిగాక ఇతడు రచించిన చాటువులును, దూషణ పద్యములును, పెక్కు గలవు. కవి సంశయ విచ్ఛేదము మూడాశ్వాసములతో కూడిన చిన్న లక్షణ గ్రంథము. ఆంధ్ర నామశేషము అచ్చ తెలుగు నిఘంటువు. పైడిపాటి లక్ష్మణకవి రచించిన ఆంధ్ర నామ సంగ్రహమున కిది శేషగ్రంథము. ఆంధ్ర చంద్రా లోకము జయదేవ కృతమైన సంస్కృత చంద్రాలోకమున కాంధ్రీకరణము, రామలింగేశ శతకము "రామ లింగేశ రామచంద్ర పురవాస" అను మకుటము గల సీసపద్య శతకము, ఈశతకమున ఆ కాలపు రాజుల దుశ్చర్య లన్నియు వర్ణింపబడినవి. ఇందలి దూషణమునకు