Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/586

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ఆంధ్రదేశపు ఖనిజసంపద - II


నూటికి 55–65 పాళ్ళు) ఖమ్మముమెట్టు తాలూకాలో అప్పనరసింహపురము, ఇల్లిందల తాలూకాలో బయ్యారం మున్నగు చోట్ల 1954 నుండి త్రవ్వ మొదలిడిరి. ఈ సంహతికి చెందిన తక్కువరకపు ఇనుపరాళ్ళు (ఇనుము 35-40 పాళ్ళు) కరీంనగరుజిల్లా హుజూరాబాదు తాలూకాలో యడవల్లి ప్రాంతమున, జగ్తియాల తాలూకాలో ఛందోలి, ఆదిలాబాదు జిల్లా ఖానా పూర్ తాలూకాలో చిత్యాల, కల్లెడ, దస్తూరబాదు వద్ద సుమారు 4 కోట్ల టన్నులుండును. వీటినుండి ఉక్కు చేయు విధానమును రాష్ట్ర ప్రభుత్వము పరిశీలింప జేయుచున్నది.

పలుగురాయి(Quartz) ఫెల్స్ఫార్ (Felspar) : హైదరాబాద్ పశ్చిమ తాలూకా పెగ్మటైట్లనుండి పలుగురాయి, ఫెల్స్పార్ కొంత హైదరాబాదు గ్లాసు పింగాణీ పరిశ్రమలలో వాడబడుచు, కొంత బొంబయి మున్నగు బయటి కేంద్రము లకు పంపబడుచున్నది. ఈ ఖనిజములు మహబూబ్ నగరు జిల్లాలో షాద్ నగరు, మఖ్తల్, నల్లగొండ జిల్లాలో మిరియాలగూడ, దేవరకొండ తాలూకాలలోను. మెదకు జిల్లాలో చాలచోట్ల పెగ్మటైట్లనుండి లభ్యమగును,మహబూబ్ నగరు జిల్లా కొడంగల్లు తాలూకాలో శుద్ధమగు క్వార్ట్ జెట్లు, ఇసుక రాళ్ళుకూడ నున్నవి.

చవిటిసోడా (Saline efflorescence) : మ ఖ్తల్ తాలూకాలో చాలచోట్ల, దేవరకొండ తాలూకాలో పెద్దసర్లపల్లి, గోండ్లపల్లివద్ద చేయుచున్నారు.

తెల్లసుద్ద (Kaolin) కొలిమిసుద్ధ (Fireclay): పింగాణి పరిశ్రమ కుపయోగించు తెల్లసుద్దను మెదకు జిల్లా జహీరా బాదు తాలూకాలో షైఖాపూరు, హైదరాబాదు జిల్లా తాండూరు తాలూకాలో గింగుర్తి. మహబూబునగరు జిల్లా పరిగి తాలూకాలో శ్రీరంగాపురం, కుందుర్గు వద్ద వేర్వేరు రాళ్ళనుండి త్రవ్వుచున్నారు. నల్లగొండజిల్లా హుజూరునగరు తాలూకాలో చింత్రియాలవద్ద కర్నూలు సుద్ద రాళ్ళలో (Shale) 80 వేల టన్నుల తెల్లసుద్దగలదని అంచనా వేసిరి. వరంగల్లు జిల్లా పాకాల (నర్సంపేట) తాలూకాలో మద్దిగూడెం, ఖమ్మము మెట్టుజిల్లా ఇల్లిందల తాలూకాలో మిరియాల పెంటవద్దకూడ తెల్లసుద్ద కొద్దిగా దొరకును.

ఆదిలాబాదు జిల్లా ఆసీఫాబాదు తాలూకాలో పచ్ గాంవ్ ప్రాంతమున గోండ్వన శిలలయందున్న మేలురకపు కొలిమి సుద్ద రాళ్ళ పేటవద్ద త్రవ్వబడుచున్నది. ఈ సుద్ద పచ్ గాంవ్ వద్దనే 50 లక్షల టన్నులు, బుత ర్మల్ వద్ద 2 లక్షల టన్నులు గలవని లెక్క వేసిరి.

రాచిప్పరాయి (Steatite): కరీంనగరు తాలూకాలో మక్దుంపూరు, ఖమ్మముమెట్టు జిల్లా ఇల్లిందల తాలూకాలో రాగబోయినగూడెం మున్నగుచోట్ల స్ఫటమయ విభాజీయ శిలలలో త్రవ్వు రాచిప్పరాయి అధిక భాగము శిర్పూరు పేపరు మిల్లులో తొట్లకు లోవైపు పేర్చుటకు వాడబడుచున్నది. కరీంనగరు జిల్లాలో మెట్టపల్లి, సుల్తానాబాదు తాలూకాలో తురకల మద్దిగుంట, నిజామాబాదు జిల్లా ఆర్మూరు తాలూకాలో ఛోటపల్లి, నల్లగొండ జిల్లా దేవరకొండ తాలూకాలో కొలకపల్లి, ఇల్లిందల తాలూకాలో జస్టయపల్లి వద్ద లభించు రాచిప్ప రాయితో జాడీలు, రాతి పాత్రలు మున్నగునవి చేయుదురు. మహబూబునగరుజిల్లా మఖ్తల్ తాలూకాలో అభంగ పట్టణము హైదరాబాదు జిల్లాలో ఆరేమట్ల, తామూరుల వద్దను మలినమగు రాచిప్పరాయి దొరుకును.

సర్పెన్ టీన్ (Serpentine): నల్ల గొండజిల్లా హుజూర్ నగరు తాలూకాలో బత్తులపాలెం, మహబూబ్ నగరుజిల్లా కలవకుర్తి తాలూకాలో జూపల్లివద్ద రాచిప్పలు చేయుటకు వాడబడుచున్నది.

ఖనిజపు రంగులు (Ochres): ఎర్ర సుద్ధ మెదకుజిల్లా జహీరాబాదు తాలూకాలో షైఖాపూరువద్దను, పచ్చ సుద్ధ హైదరాబాదు జిల్లా వికారాబాదు తాలూకాలో నై దాలి పుర వద్దను, దక్కన్ లావాలపై (ఇష్టి కాశిల) (లేటరైట్లలో) త్రవ్వబడు చున్నది.

క్రోమైట్ (Chromite) : మధిర తాలూకాలో ప్రవేశించిన కొండపల్లి కొండలలో క్రోమైట్ అచ్చటచ్చట గలదు. 1954 లో దెందుకూరు వద్ద దీనిని త్రవ్వ నారంభించిరి.

గ్రాఫైట్ (Graphite): గ్రాఫైట్ ఖమ్మంమెట్టు జిల్లా పాలవంచ తాలూకాలో గుండ్లమడుగు, మందులబుడవ మున్నగుచోట్ల గార్నెట్లో తొ కూడిన నైసులలో 2 అడుగులలోపు మందముగల నాళములనుండి లభించుచున్నది.