ఆంధ్రదేశపు ఖనిజసంపద - I
వించిన నల్లని స్ఫటమయ శిలలగు ట్రావ్ (Trap) లను కూడ వాడుదురు. రామల్లకోట దేవాలయములోని తులసికోట ట్రాపులో చెక్కబడినది.
సీమెంటుకు సున్నపురాళ్ళు (Lime-stone for cement):- సిమెంటు పరిశ్రమలో టన్నుకు 1-48 టన్నులు సున్నపు రాళ్ళు కావలెను. సీమెంటు కుషయోగపడుటకు, సున్నపు రాళ్ళలో సున్నము (Lime) 43 శాతము; సిలికా (Silica) 14.5 శాతము, లోహామ్ల జనిదములు (Iron Oxides) 1.5 శాతము, అల్యూమినా (Alumina) 3.5 శాతము పాళ్ళు సుమారుగా ఉండి, మెగ్నీషియా (Magnesia) 2.6 కు మించరాదు. కర్నూలు సంహతికి చెందిన సున్నపురాళ్ళు కడపజిల్లా కమలాపురం తాలూకాలో 64 కోట్ల టన్నులు, జమ్మలమడుగులో 300 కోట్లు, కర్నూలుజిల్లా కోయిలకుంట్ల తాలూకాలో 500 కోట్లు, బంగనపల్లెలో 66 కోట్లు, ద్రోణాచలములో 47.5 కోట్లు, కర్నూలులో 125 కోట్లు, నందికొట్కూరులో 77 కోట్లు టన్నులున్నవి. గుంటూరు కృష్ణాజిల్లాలలో కృష్ణ కిరుప్రక్కల యందును, గోదావరి