ఆంధ్రదేశపు ఖనిజసంపద - I
కూడిన భాస్వరమును (Phosphorus) పరిమితిలో నుంచ గలిగినచో త్రవ్వదగిన నిధులు అధికమగుటేగాక, దీని
ధరకూడ పెరుగగలదు. భారతదేశములో ఉత్పత్తియగు మాంగనీసు చాలభాగము పరదేశములకు ఎగుమతి యగు
చున్నది. కొంత ఉక్కు పరిశ్రమలలో ఫెర్రో మాంగనీసు (Ferro - Manganese) అను లోహమిశ్రమముకును,
మరికొంత గ్లాసు పరిశ్రమలోను, డ్రైబాటరీలలోను వాడు డయాక్సైడ్ (Dioxide) ను చేయుటకును, వినియోగించు చున్నారు.
అభ్రకము (Mica) : అభ్రకపుగనులు నెల్లూరుజిల్లాలో ముఖ్యముగ రాపూరు, గూడూరు, పొదలకూరు, ఆత్మ కూరు, కావలి, పరిసరాలలో నున్నవి. పెక్కు గనులు 300 అడుగులలోతు మించినవి. పా గనిలో 900 అడుగుల లోతున పనిచేయుచున్నారు. ఇక్కడ మస్కోవైట్ (Mus-covite) రకపు అభ్రకము, అభ్రకహా౯ బ్లెండ్ విభాజీయశిలలను (Mica and Hornblende Schists) చొచ్చిన పెగ్మటైట్లు అను (Pegmatites) వెడల్పగు నాళములలో (Veins) పుస్తకములరీతిని దొరకును. పెగ్మటైట్లు పలుగు రాయి, ఫెల్ స్పార్, అభ్రకముల సమూహము, వీటిలో కొద్దిగ, టూర్మలీన్ (Tourmaline), గార్నెట్ (Garnet) అపటైట్ (Apatite) బెరిల్ (Beryl), జిర్కా౯ (zircon), ఖనిజములుండ వచ్చును. ఈ రాతిలో అభ్రకము నూటికి సుమారు 6 పొళ్ళుండి త్రవ్వినమీద అమ్మదగిన భాగము ఒక్కపాలు తేలుసు. అభ్రకపుస్తకములు కొన్ని అంగుళములనుండి కొన్ని అడుగుల వరకు వెడల్పు గలిగి యుండును. పలుచని రేకులు రంగులేనివై యుండును. నెల్లూరు అభ్రకపుస్తకములు ఆకుపచ్చవన్నె గలిగి "గ్రీ౯ మైకా" అని పేరుపొందినవి. బీహార్ లో దొరకు "బెంగాల్ రూబీ" అను ఎరుపువన్నెగల అభ్రకము ఇచ్చట కొన్నిచోట్ల స్వల్పముగ లభించును. ఈ పెగ్మటైట్లు 60 మైళ్ళ పొడవున 15 మైళ్ళ వెడల్పున గూడూరు, నెల్లూరు, సైదాపురము, ఉదయగిరి మున్నగు పట్టణ ప్రాంతములలో వ్యాపించి యున్నవి. ఇవి సాధారణముగ 1000 అడుగుల పొడవు, నూరు అడుగుల వెడల్పును మించవు. చిన్న మస్కోవైట్ నిధులు కృష్ణాజిల్లా తిరువూరు తాలూకాలోను, ఫ్లాగొపైట్ (Pholgopite) రకము విశాఖపట్టణం జిల్లాలోని కూడియా,మాజీ గూడెం, బొర్రా మున్నగుచోట్ల కలవు.
అభ్రకములో వేడి, విద్యుత్తు ప్రవహింపదు గనుక దీనిని ఎన్నో రీతుల వాడవచ్చును. భారతదేశములో ఉత్పత్తియగు అభ్రకములో 60, 70 హండ్రడ్ వెయిట్లు (3-3½ టన్నులు) తప్ప శేషించిన దంతయు పరదేశములకు ఎగుమతి యగుచున్నది. అంధ్రలో అభ్రకపు రేకుల నుండి మైక నైటును (Micanite) చేయ మొదలిడినచో అభ్రకోతృత్తి తిన్నగ సాగుచుండును. కాని ఇది భారత దేశములోని విద్యుత్పరికర పరిశ్రమలపై నాధారపడి యున్నది.
'కట్టడపురాళ్ళూ (Building stones) : స్ఫటమయ శిలలన్నియు గట్టి కట్టడపురాళ్ళు: వీటిలో స్ఫటికము (Quartz), ఫెల్ స్పార్, సూక్ష్మముగ ఇతర ఖనిజముల కణములతో నిండిన లేతరంగు రాళ్ళగు గ్రానైట్లు (Granites), నైసులు (Gneisses), అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలలోను, గార్నెట్ (Garnet) ఖనిజమువలన ఎర్ర చుక్కలుగల ఖోండలైట్లు (Khondalites), హైపర స్తీ౯ (Hypersthene) ఖనిజముల వలన కంచువాగుగల చార్నో కైట్లు (Charnokites) శ్రీకాకుళము. విశాఖపట్టణము, గోదావరి, కృష్ణా జిల్లాలలోను కట్టడములకు వాడబడు చున్నవి. ఆంధ్ర విశ్వవిద్యాలయ భవనములను ఖోండ లైట్లతో కట్టిరి. విశాఖపట్టణముజల్లా, అనంతగిరి, మాడుగుల ప్రాంతమునను, గుంటూరుజిల్లా పల్నాడులోను పలురంగుల చక్కని పాలరాళ్ళు దొరకును. పశ్చిమజిల్లాలలో కడప-కర్నూలు సహంతులకు (Cuddapah and Kurnool Systems) చెందిన క్వార్టుజైట్లు (Quartzites), ఇసుక రాళ్ళు, లైంస్టోన్లు విరివిగా వాడుదురు. కడపజిల్లాలో అణిమల, గండికోట, కర్నూలు జిల్లాలో రామల్లకోటవద్ద అద్భుత శిల్పకళాచాతుర్యమును చూపించు దేవాలయములను క్వార్టు జైట్లు, ఇసుక రాళ్ళతో కట్టిరి, లైం స్టోన్లలో పొరలులేని పెద్ద బండలను గోడలకు, “నాపరాళ్ళ”ను పలుచని చపటలను నేలపై పరచుటకు, అరుదుగ మిద్దెలకు నుపయోగింతురు. కొన్నిచోట్ల రాతిద్రవము (Magma) నుండి ఘనీభ