ఆంధ్రదేశ చరిత్రము . IV . ధైర్యముగా విమర్శించుచుండిరి. ఆయన 1869 లో చని పోగా కృష్ణదాస్ పాల్ గారు సంపాదకులై పత్రిక నెప్పటి వలెనే ధైర్యముతో నడపసాగిరి. జాతీయ చైతన్యము : క్రీ.శ.1875 నాటికి భారత దేశమున అన్ని ప్రాంతములలోను కొంత జాతీయచై త న్యము కలుగసాగేను, తెలుగుదేశమున కెల్ల ముఖ్య నగ రము చెన్నపట్టణము. అక్కడ విశ్వవిద్యాలయము ఉన్నత న్యాయస్థానము ఉన్నందున ఆంగ్లవిద్యాధికులు కొందరు దేశప్రజల స్థితిగతులనుగూర్చి చర్చించుటకు ఆరంభించిరి, వారిలో ప్రముఖులు సర్ టి. మాధవరావు, దివాన్ బహద్దరు ఆర్. రఘునాథరావుగార్లు. అప్పుడక్కడనున్న తెలుగువారిలో ప్రముఖులయిన పనప్పాకం అనంతా చార్యులు, సి. రంగయ్యనాయుడు, తల్లాప్రగడ సుబ్బా రావు, న్యాపతి సుబ్బారావు మొదలయినవారు దేశాభి వృద్ధికొరకు పాటుపడుచుండిరి. దేశప్రజల అభిప్రాయ ములను ప్రకటించుటకు మాధవరావుగారు స్థాపించిన 'నేటివ్ పబ్లిక్ ఒపీనియన్' అను పత్రిక కొలది కాలము లోనే అంతరించెను. అంతట పైన చెప్పబడినవారు ఆలో చింది జి. సుబ్రహ్మణ్య అయ్యరు మొదలయిన వారి తోడ్పాటుతో క్రీ. శ. 1878 లో హిందూపత్రిక నొక వార పత్రికగా స్థాపించి దేశీయులలో రాజకీయ పరిజ్ఞానమును విజ్ఞానాభివృద్ధిని కలిగించు వ్యాసములను అందుప్రకటింప సాగిరి. వీరి కృషివలన చెన్నపట్టణములో మద్రాసుమహా జనసభ యను ప్రజాసంఘముకూడ స్థాపింపబడెను. ఆకాలమున పాశ్చాత్యులు కొందరు సంస్కృత భాష నభ్యసించి భారతీయ మతధర్మములనుగూర్చి పరిశోధనలు జరిపి, భారతీయ నాగరకతవయిన చాల గౌరవముకలిగి, మన దేశీయులలో దేశాభిమానము కలిగింపగల వ్యాసము లను, గ్రంథములను వ్రాసిరి. ప్రపంచములోని మతధర్మ ముల నన్నింటిని పరిశోధించి అందలి ప్రాశస్త్యమును ప్రచారముచేయుటకు క్రీ. శ. 1875 లో దివ్యజ్ఞాన సమా జమును అమెరికాలో స్థాపించిరి. ఆ సమాజమువారు భారతదేశ మతధర్మములపై అభిమానము కలిగి ఈ దేశములోని విద్వాంసులతోను వేదాంతులతోను ఉత్తర ప్రత్యుత్తరములు జరిపి ఇక్కడికివచ్చి దేశములో పర్యట నము చేసి ఉపవ్యాసము లొసగిరి. మన దేశములోని ప్రము 490 ఖులు పెక్కుమంది ఆ సమాజమున జేరి, దేశాభిమానులై దేశోద్ధరణకు పాటుపడసాగిరి. దివ్యజ్ఞాన సమాజ స్థాపకుల గౌరవమునకు పాత్రు లయిన వారిలో ఆ కాలమున మద్రాసులో న్యాయ వాదిగానుండి గొప్ప బ్రహ్మజ్ఞాని యని పేరుపొందిన తల్లాప్రగడ సుబ్బారావుగా రొకరు. వీరి ప్రోత్సాహము ననే ఆ సమాజ కార్యాలయము క్రీ. శ. 1882 లో అడ యారులో నెలకొల్పబడినది. ఆ సమాజ సభ్యులలో కొందరు వీరి శిష్యులయిరి. అందులో భారతదేశోద్ధరణ కొరకు పాటుపడిన ఎ. పి. సిన్నెటు, ఎ. ఓ. హ్యూము అను దొరలుకూడ ఉండిరని సమాజ గ్రంథములందు వివ రింపబడియున్నది. ఈ హ్యూముగారు భారతదేశములోని వివిధప్రాంతములందలి ప్రముఖుల నందరిని ఏకోన్ముఖు లను గావించి 1885 డిశంబరులో బొంబాయిలో కాంగ్రెసు మహాసభా సమావేశము నేర్పాటు చేసి కాంగ్రెసు స్ధాపకు లలో నొకరయిరి. శ్రీ పనప్పాకం అనంతాచార్యులు గారు, తల్లాప్రగడ సుబ్బారావుగారు మొదలయిన ఆంధ్ర ప్రముఖులు కేవలము రాజకీయ వ్యవహారములందే నిమ గ్నులు గాక ప్రజల విజ్ఞానాభివృద్ధికొరకుకూడ పాటు పడిరి. వీరి కృషివలననే సంస్కృత రామాయణము శ్రీ చదలవాడ సుందరరామశాస్త్రిగారి తెలుగు తాత్పర్య ముతో చక్కని సంపుటములుగా ప్రకటింపబడెను. ఇంక ఎన్నో సంస్కృతాంధ్ర గ్రంథములు ప్రకటింపబడినవి. ఆ కాలమున మద్రాసు రాజధాని కళాశాలలో తెలుగుపండితులుగ నుండిన చిన్నయసూరిగారును, బహు జనపల్లి సీతారామాచార్యులుగారును, కొక్కొండ వేంకటరత్నం పంతులుగారును, కందుకూరి వీరేశలింగం వంతులుగారును, తుని సంస్థాన విద్వాంసులుగానుండిన పరవస్తు రంగాచార్యులుగారును, తెలుగుభాషలో అనేక ఉద్గ్రంథములు రచించిరి. ఆంగ్లభాషా సారస్వతముల ప్రభావమువలన తెలుగులో క్రొత్తరచనలు బయలు దేరి నవి. వచన రచన అభివృద్ధి చెందినది. జీవిత చరిత్రలు దేశచరిత్రలు, పాశ్చాత్య ప్రకృతి విజ్ఞానశాస్త్రములు, వ్యాసములు, ప్రహసనములు, కథలు, నవలలు బయలు దేరినవి. వీరేళలింగంగారి రాజ శేఖర చరిత్ర. క్రీ.శ. 1878 లో ప్రకటింపబడినది. అంతకుముందు కొక్కొండ వేంకట
పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/559
స్వరూపం