ఆంధ్ర జానపద గేయ వాఙ్మయము
కడంగెను. సోమనాథుడు రోకటిపాటలను, తుమ్మెద, ప్రభాత, పర్వత, ఆనంద, శంకర, నివాళి, వాలేశు, గొబ్బి, వెన్నెల ఇత్యాది పదములను పేర్కొనెను. ఏగంటివారి కాలజ్ఞానవచనములందు తుమ్మెదపదములు, ఏలపదములు. లెల్లెపాటలవంటివి గలవు. లక్షణకారులు ఉదాహరించిన నాచనసోముని జాజర పాట ఛందముననే ఇప్పటికిని తెలంగాణమున జాజరపాటలు కాముని పున్నమ పండుగు సందర్భమున జానపదులు పాడెదరు. కేతన దశ కుమార చరిత్రమున మూలమందు లేని పాటల ప్రసక్తి కలదు. శ్రీనాథుడు యక్షగానములను జాదుర (జాజర)లను తడవెను. మంచన శర్మ, టిట్టిభ సెట్టి యను మిత్రద్వయము ఓరుగల్లు చూడబోయి ద్విపద ప్రబంధమున వీరానీకమును పాడు వనితను, పరశురాముని కథలను పాడు బవనీల చక్రవర్తిని, కామవల్లి మహాలక్ష్మీ కైటబారుల వలపును పాడుచు వచ్చు జక్కుల పురంధ్రిని కాంచెను. పోతన్న గోవిందుమీది పాటలు వినెను. కొరవి గోపరాజు వెన్నెలగుడి పాటను పేర్కొనెను. తాళ్ళపాక అన్నమాచార్యుల వారు తమ కాలమందు వినబడుచుండిన జానపద గేయములు మాదిరుల కన్నిటికిని సరిపోవునట్లు సంకీర్తనలను రచించి పెట్టిరి. ఈయన భార్యయగు తాళ్ళపాక తిమ్మక్క యొక్క కృతి సాగినది ఈ పాట బాట యందే. చిన తిరుమలాచార్యుడు పదములు వ్రాయుటయేకాక సంకీర్తన లక్షణముగూడ రచించెను. జానపద
గేయములు కాకపోయినను తాళ్ళపాకవారి రచనలు గేయస్వరూపములను, వాటి పరిణామమును మాత్రము సూచించును. సంకీర్తన లక్షణమునందు ఏలలు, గొబ్బిళ్ళు, చందమామ పదములు, అర్ధ చంద్రికలు మొదలగు గేయముల లక్షణములు వివరింపబడినవి. దిగ్విజయార్థము బయలుదేరనున్న శ్రీకృష్ణదేవరాయలకు ఒక జానపద గేయము కలిగించిన అపరిమితోత్తేజనమును గూర్చిన ఐతిహ్యముఅంద రెరిగినదే. స్వయముగా ఆ మహారాజు ప్రాత ర్వేశల "సంధు యంత్ర నతిక్పత్రోృద్గీత గేయౌమము" ల్వినెను. రుద్రకవి సుగ్రీవ విజయమను యక్ష గానమునందు వివిధములగు గేయఫణుతులు కాననగును. దామెరల వెంగళభూపాలుడు జాజరపాటలను, ధవళములను కల్యాణపు పాటలను పేర్కొనెను. కదరీపతి నాయకుడు "సువ్వాలు న్శోభనములు ధవళాలు న్మొదలయిన పాట"లే కాక ఏలపదములు, రాట్నముపాటలు, పరశురామునిపై పాటలు తడవెను. నాయక రాజుల కాలమందు రంగాజి, రామభద్రాంబ, విజయ రాఘవ నాయకుడు మొదలగువారు పదకవిత లల్లిరి. భద్రాచల రామదాసు పాడినపాటలు జానపద గేయములుగా ప్రచార మందినవి. క్షేత్రయ్య పదములు, త్యాగరాజకీర్తనలు కర్ణాటక సంగీత సరస్వతికి తలమానికములై వరలినవి. ఎలకూచి సరస్వతి, కంకంటి పాపరాజు, గోగులపాటి కూర్మనాథకవి ఆలూరి కుప్పన మున్నగు పండితకవులుకూడ పద రచనమునకు దోహద మొనర్చిరి. వీరి కవిత్వమంతయు పదకవిత్వమే యైనను ప్రౌఢమైనది. ఇది దేశిసారస్వతమున జేరును. గేయ కవితా పరిణామమును కనుగొనుటకు కూడ ఉపకరించును.
త్యాగరాజు తరువాత స్వయముగా జానపదులు రచించినవి లేదా జనపదములందు ప్రచారముగాంచిన గేయము లనేకములు మనకు దక్కిన వనుకొనవచ్చును. కొన్ని కాలగర్భమున కలిసిపోయి యుండును. ఏ వాఙ్మయమునకును ఈ విపత్తు తప్పినదికాదు. భద్రపరిచేడువారుండినచో యాగంటి లక్ష్మయ్యగారి వచనములవంటి అతి ప్రాచీన గేయములు మనకు మరికొన్ని యైనను దక్కియుండును. ప్రాత తాళపత్ర గ్రంథములందు అచ్చటచ్చట కొన్ని పాటలుమాత్రము కనబడుచున్నవి. ముద్రణ సౌకర్యములు కలిగిన తరువాత ఈ గేయ వాఙ్మయము కొంత ముద్రింపబడినది. ముద్రిత గేయము లందు అధికభాగ మాధునికమే. మౌఖిక ప్రచారమున నున్న చిన్న చిన్న గేయములు ఆధునికులఅగు ఉత్సాహ వంతులు సేకరించి ప్రకటించుచున్నను సేకరింపవలసినవి ప్రకటింపవలసినవి ఇంకను పెక్కులున్నవి. వాటిసంఖ్య లక్షల కెక్కును, వాటి చావుపుట్టుకలు, పెరుగుట విరుగుటలు జానపదుల జీహ్వాంచలములందే జరుగుచున్నవి. ఏ గీత మెప్పటిదో, ఎన్ని యెన్ని మార్పుల నందినదో తెలిసికొనజాలము.
ఇట్టి జాతీయ సంపదను గూర్చి తొలిసారిగా ఆంధ్రలోకమునకు పరిచయము కలిగించినవాడు బ్రౌను మహాశయుడు. అతని తరువాత ముప్పదేండ్లకు మరల