ఆంధ్రజాతీయ కళాశాల
ప్రవేశము ఇయ్యబడెను. వారు తోడి హిందువులతో సమానముగా చూడ బడుచున్నారని సాంఘిక, ఆర్థిక, మత రంగముల యందు నిరసన బయలుదేరినది. కర్మాగారముల నిండ వివిధ జాతుల వారు మిశ్రమముగా ఉండెడివారు. అది సంవత్సరమునకు అయిదారు వేల రూపాయల నష్టముపై నడుపబడు చుండెడిది. మొట్టమొదట ప్రజలు చూపిన ఉత్సాహము క్రమముగా తగ్గిపో సాగినది. అయినను కళాశాలలో కుటీర పరిశ్రమలు, చేనేత, కంబళీలు తయారుచేయుట, రంగులు వేయుట, ముద్రించుట మొదలగు పనులను కూడ ప్రవేశ పెట్టి పురోగమించుటకు ప్రయత్నములు సాగెను. టైపుపని, షార్టుహాండు, భూమి కొలత డ్రాయింగు, చిత్రలేఖనము, కాగితపు చేతిపరిశ్రమ మొదలగు వాటికి కూడ ప్రవేశము కలిగెను. వీటికన్నిటికి చాలాధనము కావలసి వచ్చెడిది. కార్యకర్తలు అప్పులు చేయుచు, వీలునుబట్టి తీర్చుచుండెడివారు. 1917 వ సంవత్సరములో స్వపరిపాలనోద్యమము (Home Rule movement) వీరిని కాపాడినది.
జాతీయవిద్య స్వపరిపాల నోద్యమములో ముఖ్యాంశముగా మిసెస్ బీసెంటు ప్రకటించి, కళాశాలకు 20 వేల రూపాయలు సహాయము చేసెను. ఆ సొమ్ముతో అప్పులు తీర్చనయ్యెను. ఈ ఉద్యమము తీవ్రత తగ్గి పోగానే గాంధీ సిద్ధాంతములు రంగములో ప్రవేశించెను. దీనివలన కళాశాలకు మరల 25,000 రూపాయల సహాయము లభించినది. 1921 జూలైలో శ్రీహనుమంతరావు హృద్రోగముతో అస్వస్థులైరి. 1922 ఫిబ్రవరి 2 వ తారీఖున ఆయన చనిపోయిరి. అప్పుడు ఈ
రచయిత ఒంటరిగానే కళాశాలను నడుపవలసి వచ్చినది. ధనము సంపాదించి, ఆ సంస్థను నిలబెట్టుటకు చాల క్లేశ
కరమైన ప్రయాణములు చేయవలసి వచ్చెడిది. శ్రీ హనుమంతరావు మరణించిన పదిదినములలోనే ఉపాధ్యాయులు తమ జీతమును హెచ్చింపవలెనని ఒక పథకము ప్రతిపాదించిరి. “సంపాదించి, తీసికొమ్ము" అను సిద్ధాంతము నేను నా స్నేహితుల కందరకు నచ్చ చెప్పితిని. ఈ సిద్ధాంత సాధన చాల కష్టమయినది. ఉపాధ్యాయులకు ఇది ఒక సవాలుగా పరిణమించినది. కళాశాలనుండి రంగూనుకు వెళ్లిన ఒక నాటకబృందము చాలనష్టపడి
తిరిగివచ్చినది. ఈ నష్టమును పూర్తిచేయుట ఒక సమస్య ఆయెను, క్రమ ముగా విద్యార్థులు తగ్గిపోయిరి. ప్రభుత్వముచే గుర్తింపబడిన పరీక్షలలో కృతార్థులయి ఉద్యోగములు సంపాదించుకొనవలెనని విద్యార్థులు కాంక్షించిరి. మొట్టమొదట మూలవిద్యయందు ఉపాధ్యాయులకు ఇచ్చు శిక్షణము చాలా జనరంజకమై కనుపించెను, కాని కాలక్రమమున శిక్షణ కాలమున ఉపాధ్యాయులకు ఈయబడు వేతనము మాని వేసినప్పుడు ఆ విద్యార్థుల సంఖ్య తగ్గిపోయినది. ఆ మూలవిద్య విద్యార్థులకు ఆకర్షణము కలిగింపనందున సాంఘిక శాస్త్రములు నేర్పు తాతా స్కూలులో ఉండునట్టి ఒక సాంఘిక విద్యావిధానము ప్రవేశ పెట్టబడెను. తాతాస్కూలు ఆఫీసర్లకు, ప్రొఫెసర్లకు, ప్రజలతో కలసిమెలసి పనిచేయు స్త్రీపురుషులకు మాత్రమే శిక్షణము ఇచ్చుచుండెనని ఈ రచయిత అనుమానము. అయినను ఇటువంటి విద్యావిధానము ఆ కాలమునకు సరిపడునది కాదు. స్వాతంత్య్రము లభించిన పిదప కాని ఇటువంటి విద్యావిధానము ప్రజా ప్రశంస పొందలేదు. ఇప్పుడు మనకు స్వాతంత్య్రము లభించుటయు రెండు పంచవర్ష ప్రణాళికలు అమలులోకి వచ్చుటయు జరిగినది. కనుక, ఇటువంటి విద్యావిధానము తప్పక జనరంజక మగును.
కళాశాలాజీవితములో ఒక ఛిద్రము ఏర్పడినది. ఎటువంటి విద్యాపద్దతియైనను, తగు ప్రతిఫలము కలిగింపక, ప్రభుత్వముచే గుర్తింపబడకుండ ఉండినచో, అది ప్రజాదరమును పొందజాలదు. కళాశాలా కర్మాగారము నష్టమునకు గురియైనది. చేతితో చేయబడిన కాగితమునకు బజారులో అమ్మకము లేకపోయినది. చిత్రలేఖనము తదితర కళాత్మక విద్యలు విద్యార్థులను ఆకర్షింపలేకపోయినవి. ఒకటి తరువాత మరొకటి కారణములుగ కళాశాల విద్యార్థుల ఆకర్షణమును పోగొట్టుకొన్నది. మొత్తముమీద కళాశాలకు ఏడెనిమిది లక్షల రూపాయల విలువైన ఆస్తి ఉండినది. ఈ సొమ్ము, ఇతరమైన ఆస్తి భద్రపరుపవలసి వచ్చినది.
శ్రీ హనుమంతరావుగారు ఆ కళాశాలకు మొదటి ప్రిన్సిపాలు. కళాశాల ప్రారంభింపబడిన 1910 ఫిబ్రవరి, 21 వ తారీఖునుండి, 1922, ఫిబ్రవరి, 2 వ తారీఖున