ఆంధ్రజాతీయ కళాశాల
చిన ఈ ఉద్యమము భారత దేశమందంతటను అల్లుకొన్నది. బెనారసులో 1905 వ సంవత్సరమున కాంగ్రెసు సమా
వేశమైనది. ఆ కాంగ్రెసు సభలకు శ్రీ గోపాలకృష్ణ గోఖలే అధ్యక్షత వహించెను.
ఆ సమయమున ప్రముఖపాత్ర వహించి, జాతీయ విద్యా, స్వదేశీ,సందేశములు అందించిన వాడు లాలా లజపతిరాయ్. ఇవి ఆ తరువాత సంవత్సరములో కలకత్తాలో, స్వదేశీ, స్వరాజ్యము, జాతీయవిద్య, బహిష్కరణము అనుసూత్రములతో కూడిన తీర్మానములుగ పరిణమించినవి. 1907 ఆగస్టు 7 వ తారీఖున బహిష్కరణ పతాకము ఎగుర వేయబడినప్పుడు, రాజకీయ వాతావరణ మంతయు ఉద్రిక్త విప్లవశక్తులతో నిండిపోయియుండెను. 1908 ఏప్రిల్ 30వ తారీఖున, ఖుదీరామ్ బోస్ లను 18 సంవత్సరముల యువకుడు కింగ్స్ ఫర్డు అను ముజఫర్ పూర్ జిల్లా మేజస్ట్రీటు పై బాంబు విసరెను. కెన్నెడీ కుటుంబమునకు చెందిన తల్లి, కూతురు తక్షణమే చనిపోయిరి. దేశములో విప్లవశక్తులు ఉద్భవించుచున్నవని ఈ సంఘటన ప్రభుత్వమునకు వెల్లడిచేసినది. ఒక్క బెంగాలు, బీహారులలో నేకాక, దక్షిణమున కూడ ఈ స్థితి వ్యాపించెను. తిన్నె వేలిజిల్లాలో మిస్టర్ ఆవ్, ఐ. సి. యస్. పిస్టల్ తో చంపబడెను. దేశమంతయు ఉద్రేకముతో అట్టు ఉడికినట్లుడికి పోయినది. ఒక ప్రాంతములో జరిగిన సంఘటనలకు ప్రతిఫలములు మరొక ప్రాంతములో కను పించసాగెను. ప్రజాప్రభుత్వముల నడుమ నిజముగా ఒక యుద్ధము చెల రేగెను. 13 జూలై 1908 లో లోకమాన్య బాలగంగాధర తిలకును బొంబాయిలో నిర్బంధించి, 18 తారీఖున ఆయనకు ఆరు సంవత్సరముల కఠిన కారాగార శిక్ష విధించిరి. జాతీయ కళాశాల స్థాపనకు పూనుకొన్న మచిలీపట్నములో శ్రీ కోపల్లె హనుమంతరావు, ఎం.ఏ., బి.ఎల్., సూరత్ లో జరిగిన కాంగ్రెసు సభకు హాజరయిన పిదప, 1908 జనవరిలోనే తన వకీలుపట్టా వదలివేసినట్లు ప్రకటించెను. 1908 జూలై 13 వ తారీఖున శ్రీ జి.హరిసర్వోత్తమరావు, ఎం. ఏ. ను నిర్బంధించి చాల కాలము విచారణ జరిగినపిదప 1908 నవంబరులో 6 నెలల కఠిన శిక్ష విధించిరి. దీనిపై పునర్విచారణ జరిగి ఆ శిక్షను మూడు సంవత్సరముల కఠిన కారాగార శిక్షగా పొడిగించిరి. హరిసర్వోత్తమరావుగారు కళాశాలలో పనిచేయుటకు వాగ్దానముచేసిరి. ఆయన ఉపాధ్యాయుడుగా నియమితుడయ్యెను. ఆ విధముగా కళాశాలా పథకమునకు, రాజకీయములకు సంబంధము ఏర్పడినది. ఆరోజు నుండి ప్రభుత్వమునకు విరుద్ధముగ పెద్ద పోరాటము బయలు దేరినది. శ్రీ కె. హనుమంతరావు కళాశాలకు మొట్టమొదటి ప్రిన్సిపాలు. 1901లో స్థాపించబడిన జాతీయ వారపత్రికయగు 'కృష్ణాపత్రిక'కు సంపాదకులయిన శ్రీ ఎమ్. కృష్ణారావుగారిని మచిలీపట్టణములో రాజకీయ తత్త్వవేత్తగ అప్పుడు పరిగణించుచుండిరి. కళాశాలకు ఈ రచయిత కార్యదర్శిగా ఉండెను. కళాశాలా నిర్వాహకుల వెనుక పోలీసులు ఎప్పుడును తిరుగుచుండిరి. అప్పుడు ప్రోగుచేసిన ధనములోని ప్రతి రూపాయను ఎర్ర తలపాగా పోలీసువాడు జాగరూకతా దృష్టితో పరిశీలించుచు వెన్నంటుచుండెడివాడు.
కళాశాల విశ్వవిద్యాలయమునకు అనుబంధము కాకుండుట, ప్రభుత్వముచే గుర్తింపబడకుండుట, రాజకీయ దృష్టికి అనుమానము కలిగించినవి. వివిధములైన యంత్రములతోడను, బోయిలర్ల తోడను కూడిన ఒక పెద్ద కర్మాగారమును నిర్మించుట, అందులో పోతపనులు రంధ్రములు చేయుట, కత్తిరించుట, సమము చేయుట మొదలగు పనులు జరుగుచుండుటచే ప్రభుత్వము యొక్క అనుమానము ద్విగుణితమై ఇచ్చట బాంబులు తయారుచేయు పన్నుగడలు జరుగుచుండెనని భావింపబడినది. ప్రభుత్వముతో కళాశాలా నిర్మాతల సంబంధములు ఒక మాదిరిగా ఉండెడివి. ప్రభుత్వపు కాలువలనుండి వీరు నీరు తెప్పించు కొనెడివారు. ఒక వైపున కలెక్టర్లు, గవర్నరు పాఠశాలను సందర్శించుటతోపాటు పోలీసులు కూడ రహస్యముగా కళాశాలాధికారులను అనుమానించి తనిఖీ చేయుచుండిరి అయినప్పటికి వీరు కృష్ణస్వామి అయ్యర్, సుందర్ అయ్యర్, శంకర్ నాయర్, సదాశివ అయ్యరు, గురుస్వామి అయ్యరు, శేషగిరి అయ్యరు, శ్రీనివాస అయ్యంగారు మొదలైన రాజభక్తులైన న్యాయవాదుల ఇంటికి వెళ్ళుచుండెడివారు, అనుమానము అభ్యుదయము అనువానిమధ్య జీవితము పురోగమింప సాగెను. ఈ కళాశాల క్లాసులలో హరిజనులకు