ఆంధ్రజాతీయ కళాశాల
20 వ శతాబ్దమునందలి రచయితలలో పెక్కు మంది జీవులై యున్నవారే. కొంద రిటీవల కాలము చేసి యుందురు. Wells, Bennet, Galsworthy, Conrad అను నవలా రచయితలు Kipling, Yeats, Iliot వంటి మహాకవులు, Oscarwilde, Bernard Shaw, Galsworthy Priestley, Drink Walter, Synge, Yeats మున్నగు నాటక కర్తలు, Chesterton, Joyce, Belloc Max, Beerbhohm, Churchill, Lytton Strachey వంటి గద్య రచనా చతురులు, అసంఖ్యాకులు కలరు.
ఆంగ్ల సాహిత్యస్రవంతి జీవనదియై యింకను విరివిగా ప్రవహించుచున్నది. క్రొత్తపోకడలు కన్పట్టుచున్నవి. ప్రకృతి శాస్త్రముల ప్రభావముచే క్రొత్త వాఙ్మయము అనంతముగా బయలు దేరుచున్నది. అమెరికా, ఇండియా మొదలగు దేశములందు అనేక గొప్పరచయితలు గలరు. ఇమర్సన్ (Emerson) వంటి వ్యాసకర్త, సింక్లర్ (Sinclair) వంటి నవలారచయిత, రవీంద్రనాథ్ వంటి బహుముఖసాహిత్యనిర్మాత, సరోజినీనాయుడు, హరీంద్రనాథ ఛటోపాధ్యాయుడు మున్నగు మహాకవులు ఏ వాఙ్మయమునకైనను శోభను కూర్చువారే. Whittier, Lowell వంటి అమెరికళా కవులుకూడ సుప్రసిద్ధులుగా పేర్కొన తగినవారు. ఆధునికులైన కవులు నిచ్చట పేర్కొనుట లేదు.
ఇట్లు నిత్యనూతన శోభతో విలసిల్లుచు, శాఖోపశాఖలచే యావత్ప్రపంచమును ఆవరించుచు, సమస్తేతర వాఙ్మయము లందలి ఉత్తమ సాహిత్యమును తనలోనికి నిమిడ్చుకొనుటచే నిరంతరాభివృద్ధి నొందుచున్న ఆంగ్ల సారస్వత రసాస్వాదనమే భారత జాతీయాభ్యుదయమునకు దారితీసిన ప్రబల కారణములలో ప్రధానమైనది. దైవికముగా మనకు లభించిన అందలి పొండిత్య ప్రభావమును బుద్ధిపూర్వకముగా విడనాడుకొనుట భారత జాతీయాభివృద్ధికి అంతరాయము కాగలదనుట నిగ్వివాదాంశము. వివిధ భారతజాతీయ భాషలందలి సర్వతోముఖ వికాసమునకును ఆంగ్లసాహిత్య ప్రచారమే కారణమనుట చారిత్రక సత్యము.
పె. రా.
ఆండ్రియాస్ వెసేలియస్ (1514-1584): -ఇతడు బ్రసెల్సు పుర నివాసి, వైద్యవృత్తిలో నిమగ్నమైన ఒక కుటుంబమున జన్మించెను. లోవియన్ విశ్వవిద్యాలయములో ఉన్నతవిద్య సభ్యసించెను. పిమ్మట వైద్యశాస్త్రా భ్యాసమునకై పారిస్ విశ్వవిద్యాలయమున కేగెను. విషయ సామగ్రి ప్రోగుచేయు కుతూహలమున శవములను రహస్యముగ చేజిక్కించుకొనుట కీతడు చేసిన ప్రయత్నము లీతనిని పెక్కు పర్యాయములు ప్రమాదావస్థలోనికి దింపినవి. 1537 వ సం. న పడూరాయందు శస్త్ర చికిత్సాచార్య పదవి ఇతనిని వరించినది. 1543 వ సం.న ఫేబ్రికాయను ఉద్గ్రంథమును ప్రచురించెను. అది పెక్కు వర్ణచిత్రములుగల గ్రంథము. గాలన్ అను ప్రసిద్ధ వైద్య శాస్త్రవే త్త యందలి తప్పులను సవరించ సాహసించినందున కొందరితని భావములకు ప్రబల వ్యతిరేకులైరి. పిమ్మట అతడు తన ఆచార్య పదవికి స్వస్తిచెప్పి అయిదవ ఛార్లెస్ చక్రవర్తి యొద్ద ఆస్థాన వైద్యుడుగ పనిచేయుటకు మాడ్రిడు పట్టణమున కేగెను. 1564 వ సం.న ఒక నౌకా ప్రమాదమందీ వైద్యశాస్త్రవేత్త జీవిత మంతమయ్యెను.
డా. యస్. వేం. రా.
ఆంధ్ర జాతీయ కళాశాల : సుమారు ఏబదిసంవత్సరముల క్రితమే ఆంధ్రజాతీయ కళాశాల అను పదము
సృష్టింపబడినది. క్రమపద్ధతి లేక అసంగతముగా ఉన్న పూర్వయుగ జీవితము అప్పుడే భారతజాతీయతా సంయోగము నకు దారి తీయుచుండెను. పందొమ్మిది వందల ఏడు, నవంబరు, 17 వ తారీఖున మచిలీపట్నములో ప్రస్తుతము బియ్యపు మిల్లుగా పనిచేయుచున్న అప్పటి అయ్యంకి వారి థియేటరులో ప్రభుత్వముతో సంబంధములేని, విశ్వవిద్యాలయమునకు అనుబంధము కాని ఒక జాతీయ విద్యాసంస్థను నెలకొల్పవలెనని ఒక బహిరంగసభ జరుపబడెను. సాహిత్య, శాస్త్రీయ, సాంకేతిక విషయముల సమరస సంయోగముతోకూడిన ఒక చక్కని విస్తృత పథకమునకు అనుగుణముగా విద్యావిధానము పునర్నిర్మించుటకు ఈ సంస్థ ఉపయోగ పడవలెనని ఉద్దేశము. ఈ రోజున కూడ దేశము
లోని విద్యాప్రణాళికలో వాస్తవమైన మార్పు లేదు. బెంగాలు విభజన (16-10-1905). అఖిలభారత