Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/48

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

రము పేరు "లోవిటి". 6 దీని ఎత్తు 7,790 అడుగులు. మధ్యగతమైన పర్వతపంక్తి పుష్కలముగా పెరిగిన తరు గుల్మములతో నిండియుండును. తూర్పున ఈ పీఠభూమి కాంగో, జాంబెజీల నిమ్న భాగముల వైపు ఒరిగియున్నది. దక్షిణమున ఇది చెట్లు చేమలు లేని ఇసుక ఎడారిలో కలిసిపోవును. • అంగోలా దేశములో పశ్చిమ ముఖముగా సముద్ర మునకు పెక్కునదులు ప్రవహించుచున్నవి. అవి అన్నియు చాలవరకు వైపర్వతమండలములో నే జన్మించినవి. అచ్చటి ముఖ్యమైన నదులు కాంగో, క్వాంగో అనునవి. లుంగ్వే, బుంగు అనునవి జాంబేజీనది యొక్క ముఖ్యమైన ఉప నదులు. అమితమైన వేడిమి, అమితమైన తేమ ఇచ్చట గల శీతోష్ణ పరిస్థితులు. ఇచ్చటి సామాన్యమైన శీతోష్ణ పరిమాణము 75° గా నున్నది. సముద్రతీరము నందలి మైదాన ప్రదేశములు యూరోపియనుల నివాస మునకు అనుకూలముగా లేవు. పీఠభూమియందలి శీతోష్ణ స్థితి మిక్కిలి ఆరోగ్యకరముగాను, పుష్టికరముగాను ఉండును. అచ్చటి శీతోష్ణస్థితి, అచ్చటి వ్యాపారపవనముల ప్రభావమునకు లోనగుచుండును. ఏప్రిల్ నెలలో అచ్చట వానలు మెండు. ఉగ్రమైన తుపానులుకూడ చెలరేగును. ఈ మండలపు ఉత్తరభాగమందు అంతటను దట్టమైన ఉష్ణ మండల అరణ్యములు కలవు. దక్షిణభాగమున చిట్టడవులు వ్యాపించియున్నవి. అచ్చట టేక్యులా, దేవదారువు, టేకు, నూకమ్రాను మున్నగు కలపకు పనికివచ్చు చెట్లు విరివిగాకలవు. మ్యూసెంఖా యొక్క బెరడును, తోళ్ళను వదను చేయుటకు ఎక్కువగా ఉపయోగింతురు. అంగోలా యందలి ముఖ్యమైన పంటలు వరి, జొన్న, చోళ్ళు, చెరకు, దుంపలు, కాఫీ, పొగాకు, వేరుసెనగ మొదలగునవి. ఇవిగాక పామ్ అయిలు, కొబ్బరి, కోకో మొదలగునవియు, తీరుతీరులపండ్లును లభించును. అంగోలా ఈశాన్యభాగమునందు వజ్రములు దొరకును. ఇచ్చట మాంగనము, బొగ్గు, రాగి, ఇనుము మొదలగు ఖనిజ ములు కూడ దొరకును. ఇచ్చట చక్కెర కర్మాగారములు కలవు. వీటియందు రమ్ (rum) అను సారాయి, తదితర అనుబంధ వస్తువులు కూడ తయారగును. ఈ రాష్ట్రము యొక్క అభ్యుదయము అంతయు అడవులకు, తోటలకు 2 9 అంటార్క్టికా సంబంధించిన వస్తువుల ఉత్పత్తి పై ఆధారపడియుండును. 1950 సంవత్సరములో ఇచ్చటిజనాభా 41,25, 266. ఇచ్చట నివసించు వారిలో పెక్కుమంది బంటూ, నీగ్రో జాతులవారు. దక్షిణమున అనేక రకముల జాతుల ఆట వికులు (బుష్ మెన్) కలరు. ఉన్నత ప్రదేశములందును, సముద్రతీరపు మైదాన ప్రదేశములందును పోర్చుగీసువారు నివసించుదురు. అంగోలా యొక్క ముఖ్యపట్టణము సెయింటుపాల్' డిలొయాండా అనునది. దీనిని సాధారణముగలొయాండా అందురు. లొయాండా నుండి అంబకా, మలాంజే వరికు వేయబడిన రై లుమార్గమును రాయల్ ట్రాన్సు ఆఫ్రికను రై లుమార్గ మందురు. ఇదిగాక, సముద్రతీరపు దేవులను, అందలి ఎగుమతులకు వలసిన వస్తువుల నుత్పిత్తిచేయు పర గణాలతో, అనేక చిన్న రైలుమార్గములు కలుపుచున్నవి. రైలుమార్గము యొక్క మొత్తము పొడవు 1,442 మై. 22,708 మైళ్ళ పొడవుకల రహదారులును, దేశీ దేశాం తర విమానమార్గములును కలవు. P ఈ దేశమందు యంత్రములును, నేత వస్త్రములును ముఖ్యమైన దిగుమతులు. ఎగుమతులలో ముఖ్యమైనవి కాఫీ, జొన్న, వజ్రములు, రాగి, చక్కెర, ప్రత్తి, రమ్ అను సారాయి, వేరుసెనగ, కొబ్బరి, కోకో, పొగాకు మొదలగునవి. బెంగో అఖాతమునందు బెంగ్వేలా అనునది గొప్ప రేవు. వర్తకము విశేషముగా పోర్చుగీసు దేశము తోనే జరుగుచుండును. కె. వి. రె కొ అంటార్క్టికా- అంటార్క్టి కా దక్షిణధ్రువము మీద నున్న ఆరవఖండము. దీనిని మూడవ ప్రపంచము అని పేర్కొనుచున్నారు. అంటార్క్టికు మండలమును మొట్టమొదట తరించినవాడు ఆంగ్ల నావికుడు జేమ్సుకుక్ (1778). అమెరికా సంయుక్త రాష్ట్ర వాసి పామరు అను వాడును, రష్యా నావికుడు బెర్లింగ్ అనువాడును (1820) అంటార్క్ టికాను కని పెట్టిరి. క్రీ.శ. 1840 ప్రాంతమున అమెరికా దేశీయు డగు విల్క్సు అను నాతడు ఈ ఖండమును పరిశోధించెను. 1938-1935 లో జరిగిన బిర్ట్ సంచార ము ముఖ్యమయినది. ఈనాటివరకు పెక్కుమంది దానిని చాల