అష్టోత్తర శతతాళములు
తాళములు బహుళ వ్యాప్తిలోనికి వచ్చుచుండెను. అష్తొత్తర శతములందలివి కొన్ని ఇప్పటి మనసూళాదులందు కలవు. ఇప్పటి ఆది, మఠ్య, అడ్డ, ఏక, ఝంప, రూపక తాళములు ప్రాచీన తాళములందు తెలియవచ్చినను, ఇప్పటి తాళములందలి అంగములు వాటి యొక్క మాత్రాకాలములు పూర్వపు తాళములందుకంటె భిన్నములుగ నున్నవి. ఆదితాళ మిప్పుడు 100 అంగములతో ఎనిమిది అక్షరములు కలిగియున్నది. కాని పూర్వ మియ్యది ఒక్క లఘువును మాత్రము కలిగియుండెను. ఇప్పటి అట 1100 అంగములతో నుండగా పూర్వమియ్యది 10 మాత్రలుగల 0౹౹ అంగములు గలదై యుండెను. ఇప్పట ఏక తాళము ఒక్క లఘువుతోనుండగా పూర్వము అది ఒక్క ద్రుతమునే కలిగియుండెను. ఇప్పుడు మఠ్య తాళము 101 అంగములతో నుండగా పూర్వము ఇది SOS ఇట్లు అంగములు కలిగియుండెను. మన ఝంప తాళము IUO అను అంగములతోనుండగా పూర్వమున నిది 10 మాత్రలు గల SSI అను అంగములతో
నుండెను.
మరియు నిప్పటి కొన్ని నూళాదులకును పూర్వపు తాళములకును కొన్నిపోలికలు కలవు. కొన్ని అంతర్భూతములుగ నుండునట్లు ఎంచనగును. శార్గ దేవుడు తెలిపిన యతిలఘ్న ఇప్పటి రూపకముకు తుల్యముగ నున్నది. ప్రతి అనుతాళము ఇప్పటి అటతాళమునకును, ఝంప తాళము ఇప్పటి మిశ్ర ఝంపతాళమునకును, తురంగ లీల తాళము ఇప్పటి ఆదితాళమునకును, సమచావు తాళమునకును తుల్యముగ నున్నవి. తక్కిన తాళములను గూడ ఇట్లే పోల్చి ఎంచనగును.
ధ్రువతాళము గీత ప్రబంధమునందలి ధ్రువఖండము ననుసరించి గ్రహింపబడియుండును. సోమనాథుడు ధ్రువలయ, ధ్రువమఠ్యలు అనువాటిని తెలిపెను. ఆధునిక తాళములందు ఇవి చెప్పబడినను గీతములందు మాత్రమే వీటిని మనవారు చేర్చిరి.
త్రిపుట లేక శివడ (తేవడ) అన్నమాచార్యుల కీర్తన లందు ప్రప్రథమముగ చెప్పబడెను. పద ప్రబంధమున కను గుణముగ నీతాళము చెప్పబడియుండును. ఇది శార్గ దేవుని తృతీయలేక తురంగలీల తాళమునకు తుల్యమగును. తాళ్ళపాకవారు చెప్పిన చౌ తాళము, చౌ జౌత్తరీయ తాళములందు కలదు. ఇయ్యది 1100 అను అంగములతో నుండుటచే దీనిని మన అటతాళమునకు తుల్యముగ నెంచనగును.
నేడు సూళాది సప్తతాళములు వాడుకలో నున్నవి. పూర్వపు అష్టోత్తరశత తాళములు మరుగుపడినను అయ్యవి అంతరించినట్లు ఎంచుటకు వీలులేదని తెలిపితిమి. శతవర్షములకు ముందుండిన రామస్వామి దీక్షితులు సప్తతాళములతో మరి యేబదినాల్గు తాళములను అష్టోత్తరశత తాళములనుండి జేర్చి అరువదొక్క తాళములతో రాగమాలికను పాడి విశ్రుతుడయ్యెను. పూర్వపు తాళములు అసాధ్యము లను వారి కయ్యవి సుసాధ్యములని ఇతడు ప్రకటించుచు, వాటితో రాగమాలికను నేర్పుతో చెప్పగలుగుట ఇతని వైశిష్ట్య మన చెల్లును. ఈరాగమాలికయందలి తాళములు (1) ధ్రువ (2) మఠ్య(3) రూపక (4) ఝంప (5) త్రిపుట (6) అట(7) ఏక (8) లలిత, (9) లక్షణ (10) రతిలీల (11) జయ, (12) దర్పణ (13) రాజచూడామణి (14) మదన (15) రతి (16)రాజ (17) కీర్తి (18) కుందర (కందుక) (19) మదన (20) క్రీడ (21) విజయనందన (22) రంగ (23) ఆనంగ (24) వీరవిక్రమ (25) సింహ లీల (26) పరిక్రమ (27) సంపద్వేష్ట (28) సమ (29) సింహ విక్రమ (30) చతుర్ముఖ (31) శ్రీనందన (32) విషమ (33) లఘుశేఖర (34) వసంత (35) వన మాలి (36) శ్రీ కీ ర్తి · (37) తృతీయ (38) అంతర క్రీడ (39) అభంగ (40) పార్వతీ (లోచన) (41) కోకిల ప్రియ (42) హంసనాద (43) కందర్ప (44) శ్రీరంగ (45) ప్రతాప శేఖర (46) రాగవర్ధన (47) లలిత (48) శ్రీకీర్తి (49) విలోకిత (50) ముకుంద (51) రాజ విద్య (52) చతుర్థ (53) కుడుక్కు (కుటుంబ) (54) విజయ (55) తురంగలీల. (56) మకరంద (57) నందన (58) రాజబంగాళ (59) నంది (నది)(60) కళ (61) శ్రీ అను పేళ్ళతో నున్నవి. ఇందు లక్షణ, శ్రీ కళ అను తాళములు అష్టోత్తర శతతాళము లందు లేవు. ఈ తాళములందలి అంగములకు సశబ్ద. నిశ్శబ్ద క్రియలను పాటించుచు గానము చేయుట విద్వాం