Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/459

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అష్టోత్తర శతతాళములు


చెప్పిరి. కోహలుని తాళలకుణము, తాళకళావిలాసము, తాళప్రకరణము మున్నగు గ్రంథములందు 108 తాళములే లిఖింపబడెను. శార్ణదేవుడు స్వకల్పితము అయిన తాళములను కొన్ని చేర్చినట్లు దీనిచే విదితము. నారదుడు 108 తాళములనే చెప్పెను.

అష్టోత్తరశత తాళములు :ప్రాచీన కాలమునుండియు బహువిధ గేయములందు విలసిల్లినట్లు శార్ణ దేవాది సంగీత శాస్త్రవేత్తల ప్రబంధములందలి ప్రబంధరీతుల ననుసరించి తెలియుదుము. గీత ప్రబంధములు ఛందస్సు, తాళము, నాదము, లయ మున్నగువాటితో కూడియుండును. తాళములచే ధాతుమాతువులు (స్వర సాహిత్యములు) వర్ధిల్లును. తాళాంగములు తాళమును నిరూపించును. మాతువు మాత్రావృతమై ఆయా తాళాంగములను గుర్తింపజేయజాలును, అనుభవమున మాతువు ననుసరించి గేయము, త్రిపుట,రూపకము, ఝంప మున్నగుతాళములు కలవని ఎంచనగును. గీతము తాళము నధిష్ఠించి తాళా వర్తములతో పెరుగుచుండును. ఈ విధముగా కలిగినవే అష్టోత్తర శతతాళములు, శార్ణ దేవుడు త్రివిధ ప్రబంధములను చెప్పి అష్టవిధ సూఢలు పేర్కొనుచు, మఠ్య తాళము ద్వితీయ తాళము, కంకాళ తాళము, ప్రతితాళము మున్నగు వాటిని వివరించెను. ప్రబంధ విధముల ననుసరించి తాళముల కీ పెళ్ళేర్పడెను. అభిసంశ్రయ ప్రబంధములందు తురంగలీల, గజలీల, ద్విపద, పంచతా ళేశ్వరము అనువాటిని, విప్రకీర్ణ ప్రబంధముల ననుసరించి శ్రీరంగము, విజయ, త్రిపద, చతుర్ముఖ, సింహలీల, హంసలీల, దండకము, ధవళము మున్నగువాటిని చెప్పెను. ఈ వేళ్ళతోనే తాళములుకూడ వెలయింపబడెను.

అష్టోత్తర శతతాళములు దశ ప్రాణాత్మకములు. ముఖ్యముగ నివి కాల, మార్గ, క్రియా, అంగ, గ్రహ, జాతి,కళాలయ - యతి ప్రసారయుతములు, మార్గకళలు ప్రాచీన చచ్చత్పుటాదులందే కలవు. శార్గ దేవుని, కాలపు దేశీయతాళములందు చతురశ్ర, త్రిశ్ర అను రెండు జాతులే కలవు. శార్జదేవు డిట్లు చెప్పెను: "చతురశ్ర స్తథా త్య్రశ్ర ఇతి తాళో ద్విధా మతః". పూర్వము ద్రుత, లఘు, గురు, ప్లుతాంగముల ప్రస్తావముచే అష్టోత్తర శతతాళము లేర్పడెను. అట్లయ్యు నీ తాళములు క్రమ ప్రస్తారమున లేవని తెలియగలము. కొన్నిట ప్లుతము లేదు. ఇట్టివి 67 తాళములు గలవు. ఒక ద్రుతము, రెండు, నాలుగు, ఆరు ద్రుతములు గలట్టివియు, ఒక లఘువు, రెండు, నాలుగు లఘువులు గలట్టివియు తాళములు గలవు. ద్రుత, లఘువులు మాత్రము గలట్టివి 35 తాళములు కలవు. ఈ సంఖ్య చొప్పుననే ఇప్పటి మన సూళాదులున్నవి. ద్రుతములేకయే లఘు, గురు, ప్లుతములు గలవి 43 తాళములు కలవు. మూడు, ఆరు అక్షరకాలము లెంచుటకు ద్రుతవిరామము, లఘు విరామము అను తాళ - అంగములు కూడ చేర్పబడెను. అందుచే పెక్కు అంగములతో తాళము లెంచవలసి యుండెను. అనంతరము "తాళలక్షణమ్" "తాళ కళా విలాసమ్" మున్నగు గ్రంథముల కాలములందు ఈతాళములు కొన్నిటియందు అనుద్రుతమును చేర్చి చెప్పబడెను. తాళములందు అంగముల పేళ్ళు చేర్చి పేర్కొనుటకు మారుగ వాటికి అంగసంజ్ఞ లేర్పరచి, వాటినివివరించుట ప్రాచీన కాలమునుండి తెలియుదుము ఒక అక్షర కాలము

గల అనుద్రుతమునకు గుర్తును, ఇట్లే రెండక్షరముల కాలముగల ద్రుతమునకు ౦ గుర్తును, నాలుగక్షరములు గల లఘువునకు గుర్తును, ఎనిమిది అక్షరములుగల గురువునకు ఏ గుర్తును, పండ్రెండక్షరములుగల దానికి గుర్తును చెప్పబడెను. విరామమును ఎంచుటకు అంగ సంజ్ఞకు శిఖరము చేర్చి 89 గుర్తులు చెప్పబడెను. క దేశీయములగు పూర్వపు అష్టోత్తరశత తాళములు అంగసంజ్ఞలతో నిట్లున్నవి : (1) ఆదితాళము 1 (2) ద్వితీయతాళము OOl (8) తృతీయతాళము 008 (4) చతుర్థ తాళము 110 (5) పంచమ తాళము 00 (6) నిశ్శంకలీల తాళము SSSSI (7) దర్పణతాళము OOS (8) సింహవిక్రమ తాళము SSSISISS (8) రతి లీల తాళము ISS (10) సింహలీల తాళము 0001 (11) కందర్పతాళము OOISS (12) వీరవిక్రమ తాళము TOOS (18) రంగతాళము 00005 (14) శ్రీరంగ తాళము IISIŚ (15) చచ్చరితాళము ంగ్ ంగ్ ంంంగ్ ဝပ်ဝပ်ဝပ်ဝပ်၊ (18) ప్రత్యంగ తాళము SSSI (17) యతిలఘ్న తాళము 01 (18) గజలీల తాళము Iii (18) హంసలీల తాళము (20) వర్ణభిన్న