Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/427

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అల్యూమినియము


2. ఆమ్లజనిదములు  ;- బాక్సైట్ (స్ఫోదిజము) అనునది అల్యూమినియము యొక్క ఆమ్లజనిద ఖనిజములలో అన్నిటికంటె విరివిగా దొరకును. వాణిజ్య సంబంధమగు అల్యూమినియము అంతయు ఈ మూలాధారము నుండి లభించుచున్నది. కురువిందము (వర్ణరహితము), కెంపు (మాణిక్యము-ఎరుపు), ఇంద్రనీలము (నీలిరంగు) మరకతము (ఆకుపచ్చ) అనునవి ముఖ్యమయిన ఇతర ఆమ్లజనిద ఖనిజములు.

వీటికి నుందరత, ప్రకాశము, ఉండుటచే ఈ ఖనిజములు రత్నములుగా ఉపయోగపడుచున్నవి. స్ఫటామ్లజనీధము యొక్క (Alluminium oxide) అపరిశుద్ధ రూపమగు కురువిందశీల పొడి చాల గట్టిగా నుండును. అది రాపిడిచేయు పదార్థముగా ఉపయోపడుచున్నది.

3. స్ఫటీయములు  :- కొన్ని ధాతు స్ఫటీయములు కూడ ప్రకృతిలో దొరకును. అవి "భ్రాజా స్ఫటీయములు" (Spinels) అనబడును.

4. ఇతరములు  :-సహజముగా దొరకు స్ఫట ఖనిజములు -వైడూర్యము, క్షాసృతిజము (cryolite) స్ఫాశ్మము (alunite or alum stone)

అల్యూమినియము యొక్క ధాతునిస్సారణము (Extraction) : సామాన్యమగు రేగడి మట్టినుండి అల్యూమిన ధాతు నిస్సారణముచేయు విధానము కష్టమైనది. 1886 వ సం. న ఛార్లెస్ మార్టిన్ హాల్ అను అమెరికను రసాయన శాస్త్రజ్ఞుడు బాక్సైడు (స్ఫోడిజము) అను ఖనిజమునుండి విద్యుత్కరణ విధానమున అల్యూమినియమును తయారు చేసెను. ఈ విధానము రెండు దశలలో జరుగును.

(1) స్వచ్ఛమైన స్ఫటకామ్లజనిదమును (అల్యూమినా) తయారు చేయుట. (2) స్ఫట కామ్లజనిదము యొక్క విద్యుత్కరణము.

1. స్వచ్ఛ స్ఫటకాన్ల జనిదమును తయారుచేయుట :ఇనుము యొక్క ఆమ్లజనిదము, ఇసుక, స్ఫోడిజములో నుండు ముఖ్యమగు కలుషములు, స్ఫోడిజమును పరిశుద్ధము చేయుటకు రెండు విధము లగు ప్రక్రియలను ఉపయోగింతురు.

బేయరు ప్రక్రియ  : బాగుగా చూర్ణము చేయబడిన స్ఫోడిజము గాఢ దాహకసోడా ద్రావణమున కరిగింపబడును. స్ఫట కామ్లజనిదము కరిగి, ఇనుప ఆమ్లజనిదము కరుగక నిలచిపోవును. దానిని వడపోత పోయుదురు. ఈ