మధ్య అలాస్కా :- ఈ మండలము యుకానుకు అలాస్కాకు సరిహద్దగు 141 వ రేఖాంశమునుండి పశ్చిమముగా అలాస్కా పర్వతశ్రేణికిని పసిఫిక్ సముద్రమునకును మధ్యనున్నది.
శీతోష్ణస్థితి :- ఇచ్చట ఉష్ణోగ్రత తగుమాత్రముగ నుండును. వర్షపాతము ఎక్కువగ నుండును. తీరప్రాంతమున అధికముగా వర్షించినను లోనికి పోవుకొలది వర్షపాతము తక్కువగుచుండును. ఉదా: ల ఔషులో సగటున 185 అంగుళముల వానపడును. ఆంకొ రేజిలో 15 అంగుళముల వాన మాత్రమే.
పశ్చిమ అలాస్కా : ఇందులో బ్రిస్టలు,కుస్కో క్విమ్ అఖాత మైదానములు చేరియున్నవి. ఇది అలాస్కా పర్వత పాద భూమినుండి పశ్చిమముగా బేరింగు సముద్రపు వైపు వ్యాపించినది. ఈభూభాగమునందే యూ కాను, కుస్కోక్విమ్ అను నదులు పారు చున్నవి. ఇందులో టుండ్రా ప్రాంతమే అధికము
శీతోష్ణస్థితి : వానమితముగా పడును. తరచుగా ఆకసము మేఘావృత మగును. తీరప్రాంతమున పొగ మంచు కనిపించును.
అలాస్కా ద్వీపకల్పము, అల్యూషను ద్వీపము : ఈ మండలము మెరక పల్లములతో నుండును. ఇందు చెట్లు చేమలు లేని కొండలు నిండియుండును. ఈ ద్వీపకల్పము యొక్క దిశాంతమందు 80 మైళ్ళ పొడవుగల ఇవి యామ్నా అను మంచినీటి సరస్సు ఒకటి ఉన్నది. ఇందు 58 అగ్ని పర్వతము లున్నవి. వాటిలో పెక్కు పర్వతములు ఇప్పటికిని నిప్పులను గ్రక్కుచుండును. అల్యూషన్సులో పెక్కు ద్వీపము లున్నవి. వీటిలో 13 పెద్దవి. ఇవికూడ అంతర్విభాగము లను పొందియున్నవి. ఫాక్సు ద్వీపములు, ఆండ్రినాధ్ ద్వీపము, రాట్ ద్వీపము, నియర్ ద్వీపము తూర్పున నున్నవి.
శీతోష్ణస్థితి : ఈ మండలమునందలి వాతావరణము తరచుగా మారుచుండును. వేసవియందు పొగమంచు కనిపించును. తుపానులు చెల రేగును.
ఉత్తరదేశము : ఇక్కడ ఉత్తరదేశ మనగా ఆర్కిటికుపర్వత మండలము ఆర్కిటికు ప్రాంతమందలి ఏట వాలుగానున్న టుండ్రాభూమి బేరింగు సముద్ర తీరమువరకు వ్యాపించి యున్నది. ఇందలి బీళ్ళు టుండ్రా మాదిరివి.
శీతోష్ణస్థితి : గొడ్డునేల. ఇందలి వర్షపాతము 10 అంగుళములకంటె తక్కువ. వేసవియందలి ఉష్ణోగ్రత సహ్యముగ నుండును, శీత కాలమునందలి చలి దుర్భరము,
ఆహార ధాన్యములు : ఇచటి తీరమండలములు సేద్యమునకు పనికి రానివి. తనానా లోయవంటి దక్షిణప్రదేశము లందు గోధుమలు పండును. అచ్చటనే యవలు, ఓటు ధాన్యములుకూడ పండించుటకు వీలున్నది. ఫెర్ బాంక్సు జిల్లాలో ధాన్యోత్పత్తికై ప్రయోగశాలలు నెలకొల్పబడినవి.
చేపల పరిశ్రమ : సాల్మన్ చేపల పరిశ్రమ అలాస్కా దేశమున ఎక్కువ ప్రాముఖ్యమును వహించినది.ఈ రకపు చేపలు దేశమందు అంతటను, ముఖ్యముగా ఫియర్డు తీరములందు అధికముగాను లభించును. పసిఫికు అమెరికాలలో దొరకు సాల్మను చేపల మొత్తములో 5 వ భాగము అలాస్కాలోనే లభించును.