అలంపురము
అలంపురములో నందులు మఠము, మబ్బు మఠము, అను శైవ మఠములు కలవు. నందుల మఠములో మల్లి కార్జునరాయల సేనాని కాచప్పొడయలు దానమిచ్చిన తామ్ర శాసనము కలదు. అలంపురములోను పరిసర గ్రామాలలోను ఉన్న తామ్ర శిలాశాసనములు ప్రకటింప బడినచో ఇదివరకు తెలియని యనేక విశేషములు బయల్పడ గలవు.
పుణ్యక్షేత్రము : అలంపురము దక్షిణ కాశీ యనియు, భాస్కర క్షేత్రమనియుప్రసిద్ధిపొందినది. శ్రీశైల క్షేత్రమున కిది పశ్చిమద్వారము. తుంగభద్రాతీర మందలి 64 ఘట్టములతో, అష్టాదశ తీర్థములతో, జోగుళాంబాబ్రహ్మేశ్వరులతో, మాధవ, గణేశ, కాలభైరవ, మణికర్ణి కాతీర్ధములతో అలంపురము వారణాసితో నన్ని విధముల పోలియున్నది. ఇచట కోటిలింగము లున్నవని ప్రతీతి. ప్రస్తుత మిచట నరసింహస్వామి, సూర్యనారాయణస్వామి, చెన్నకేశవ, నీలకంఠేశ్వర, బ్రహ్మేశ్వరాలయము లున్నవి. అన్నియుసుందర
ఆలంపురము దేవాలయములు
నటరాజు- ఆలంపురము
శిల్ప విలసితములు. వీనిలో బ్రహ్మేశ్వరాలయము ప్రధాన మైనది.
అలంపురమునకు 9 'మైళ్ళ దూరములో కృష్ణా తుంగభద్రా సంగమేశ్వరమును, 18 మైళ్ళలో సప్త నదీ సంగమ క్షేత్రమును కలవు.
బ్రహ్మేశ్వరాలయ పశ్చిమద్వారమున 'షాఆలీ పాదుషా' దర్గా ఉన్నది. దానికి “జిలభాత్" నెలలో గొప్ప ‘ఉరుసు' జరుగును. మహమ్మదీయుల కిది పవిత్రమైనది.
దేవతామూర్తులు : ఈ క్షేత్రమున సూర్యుడు, సప్తమాతృకలు, కుమారస్వామి, మహిషాసుర