అలంకారశాస్త్ర చరిత్ర
ఔవమ్యాతిశయమూలము. ఉపమాదులు సాదృశ్య గర్భములు, విభావనాదులు విరోధగర్భములు. కావ్య లింగాదులు తర్క న్యాయమూలములు. యథాసంఖ్యాదులు కావ్యన్యాయమూలములు. ప్రతీపాదులు లోక న్యాయ మూలములు, సూక్ష్మాదులు గూఢార్థ ప్రతీతిమూలములు. కారణమాలాదులు శృంఖలాబంధమూలములు- అని అర్థాలంకారముల వర్గీకరణము, అనేక అలంకారముల యొక్క కలయిక సంశ్లేష మనబడును. అర్థాలం కారములు చతుర్విధములు. అవి (1) ప్రతీయమాన వస్తువులు. (2) ప్రతీయమాన ఔపమ్యములు. (3) ప్రతీయమాన రస భావాదులు- (4) అస్ఫుట ప్రతీయమానములు అని
ఇందు అతిశయోక్తి మొదలగునవి మొదటివర్గమునకును, రూపకాదులు రెండవవర్గమునకును, రసపదాదులు మూడవ వర్గమునకును, అర్ధాంతరన్యాసాదులు నాలుగవ వర్గమునకును చెందును. అలంకారములు శబ్దగతములనియు అర్థగతములనియు మరియొక విభాగము. అందు శబ్దాలంకారము, అనుప్రాస, యమకము అని ద్విధాభిన్నము. ఛేకానుప్రాస, వృత్యనుప్రాస, శ్రుత్యనుప్రాస, అంత్యానుప్రాస మొదలగునవి అనుప్రాసభేదములు. లాటానుప్రాసాదులు ఉభయగతములు అని కొందరి మతము. అర్థాలంకారములు ఉపమాదులు. అర్థాలంకారములలో ఉపమాలం కారము నిర్వాదరణీయము, "ఉపమా కవిలోకన్య మాతా" కవికుల గురువగు కాళిదాసుని ఉపమలు జగత్ప్రసిద్ధములు.
రీతి వాదము :- ఈ వాదమును ప్రవేశ పెట్టిన వారిలో వామనుడు అతి ముఖ్యుడు. దండి దీనినే 'మార్గము' అని వ్యవహరించెను. అతడు వైదర్భ, గౌడ అను రెండు మార్గములను నిర్దేశించెను. భామహుడు రీతిద్వయ వాదమును అంగీకరింపలేదు. కావ్యమునకు ఆత్మరీతియని వామనుడు సిద్ధాంతీకరించెను. రీతియనగా గుణసహితమైన విశిష్టపద రచన యని అతని భావము, రీతి గుణాత్మకమే. అతడు వైదర్భి, గౌడి, పాంచాలి, అను మూడు రీతులను పరిగణించెను. వామనుడు గుణములు పదియని పేర్కొ నెను, ఓజస్సు, ప్రసాదము, సమత, శ్లేష, సమాధి, మాధుర్యము, సౌకుమార్యము, ఉదారత, అర్థవ్యక్తి, కాంతి అనునవి పదిగుణములు, వామనుడు ఈ గుణములను శబ్ధగతములుగను, అర్థగతములుగను విభజించెను. భరతుని నాట్య శాస్త్రములోగూడ పదిగుణములే గ్రహింపబడినవి. భరతుడు గుణాలంకారములను రసమునకు అంగములుగా వర్ణించెను. దండి గుణాలంకారములకు భేదమును పాటింపలేదు. వామనుడు అవి భిన్నములని చెప్పెను. వైదర్భీరీతిలో అన్ని గుణములు ఉండుననియు, గౌడీ రీతిలో ఓజస్సు, కాంతి మాత్రము ఉండుననియు, పాంచాలీ రీతిలో మాధుర్య, సౌకుమార్యములు ఉండుననియు వామనుడు వివరించెను. ఈ రీతులు విదర్భ మున్నగు దేశములలో ఎక్కువగా వ్యవహరింపబడుటచే వాటికి ఆపేళ్ళు వచ్చియుండునని సూచించెను.
గుణముల లక్షణములను నిర్వచించుటలో భరతుడు దండి, వామనుడు, భిన్నమార్గములను త్రొక్కిరి. ఎట్లన సమాసవత్తులయిన విచిత్ర పదములతో గూడినది ఓజో గుణమని భరతుడు నిర్వచించెను. సమాస భూయ స్త్వము ఓజస్సు అని దండి మతము. గాఢ బంధత్వము, అర్థప్రౌఢి, ఓజోగుణము అని వామనుడు విస్తరించెను, కావ్యమునందు గుణములు నిత్యములు. అలంకారములు అనిత్యములు. కాన అలంకారములు లేకున్నను కావ్యమునకు కావ్యత్వ భంగము కలుగదు. రీతి ఒక వేళ వాస్తవమైన కావ్యసారమును అందుకొనలేక పోయినను దానికి అతి సమీపమునకు చేరగలదు. వామనుడు చెప్పిన మూడు రీతులకు భోజుడు అవంతి, మాగధి, లాటి, అను మరి మూడు రీతులను చేర్చెను.
గుణములు నిజముగా కావ్యాత్మయైన రసాదులకు చెందినవి. మాధుర్య గుణము ప్రత్యేకముగా శృంగార రసమునకు చెందినదనియు, ఆ గుణము విప్రలంభ శృంగారములోను, కరుణములోను పరాకాష్ఠ నందుకొనుననియు ఓజోగుణము రౌద్ర, వీర, అద్భుతములుగల కావ్యములలో ప్రత్యేకముగా ఉండు ననియు, ప్రసాదగుణము సర్వరస సామాన్యమనియు ధ్వని కారుడు స్పష్ట పరచెను. భామహుడు గుణములనుగూర్చి చాల సంగ్రహముగా వివరించి, మాధుర్య, ఓజః, ప్రసాదగుణములను మాత్రమే సూచించెను. తరువాతి శాస్త్రకర్తలైన హేమ చంద్రాదులు గుణములను పై మూడింటివరకు తగ్గించి 'తక్కిన గుణములు ఈ మూడింటిలో నైనను చేరును. లేదా నిజ