అలంకరణ కళ
ముండుటచే అవి చూచుటకు అందముగ నుండును. హార్మోనియమునందలి 'స'అనుస్వరము ప్రక్క నున్న రీడును నొక్కినచో 'రి' అను స్వరము పలుకును. ఇటులనే 'రి' అను స్వరమునకు ప్రక్కననున్న రీడును నొక్కినచో 'గ' అను స్వరము పలుకును. ఇట్లు సప్తస్వరములు ఒక దాని ప్రక్కన నొక్కటి ఇల్లు కట్టుకొనినట్లే, రేఖలు రూపమును స్వల్ప భేదములచే ఒక దాని ప్రక్కన నొక్కటి ఉన్నచో వాటి సుసంగతి మనకంటికి గోచరించుచుండును.
ఏకాంతరితము. ఇట్లే ఏకాంతరిత (Alternative) రేఖాదృశ్యములలో కొంత సుసంగతి దృగ్గోచరమగుచుండును.
చిత్రములో రేఖలు రెండింటికంటె అధికముగా నున్నచో, వాటి పరస్పర స్నేహమే సుసంగతి యగును. ఒక రేఖ మరొక రేఖతోను, ఒక పర్ణము మరొక పర్ణముతోను, గుణ ధర్మమునందు సంపూర్ణ వ్యతిరేకముగా నున్నను, ఖండించు చున్నను అసంగత రేఖలు (Contrasting lines) లేక వర్ణములు అనబడును.
పటములో 1, 2, 3, 4, 5 అనునవి ఒకదాని ప్రక్కన ఒకటి యున్నచో సుసంగతములు అనబడును. కాని 1,5 లు అసంగతములు. ఎందుకనగా, 1 వృత్తము; 5 సూటిగీత. ఈ రెంటి గుణధర్మములు వేరు. కాని 5, 4; 4, 3; 3, 2; ఇవన్నియు సుసంగతములే.
ఇటులే వర్ణములయందు సుసంగతి గాంచనగును.నారింజ - ఎరుపు; ఎరుపు - ధూమ్రము ; నీలము - ఆకుపచ్చ; పసుపు - నారింజ ; మొదలగు వర్ణములన్నియు సుసంగతములే. ఎందుకనగా, ప్రతి జంటవర్ణములో ఏదో యొకరంగు రెంటిలో కలిసియుండుటచే, స్వల్పభేదము వలన రెండును ఇంపుగానే కన్పించును. ఎరుపు, నారింజలలో, ఎరుపురంగు ఈ రెంటిలో నుండి, నారింజలో కొంచెము పసుపువన్నెతో కలిసియుండును. కావున చూచుటకు స్వల్పభేదముండి కూడ ఆకర్షణమును కలిగించును. కాని ఎరుపు, నీలము, పసుపు అను వర్ణములు యథాతథముగా పరస్పరము భిన్న వర్ణములు, ఈమూడు వర్ణములను సమన్వయపరచుటకు ఏదైన నొక వర్ణము అన్నిటిలో కలిసియుండినచో చిత్రములో ఏకత్వము (unity) కుదిరి సుసంగతి వ్యక్తమగును. లేనిచో అసంగతి తోచును. ఉదా :-
సుసంగతియు క్రమవృద్ధిక్షయములును ఈ క్రింది వస్తునిర్మాణములలో గాంచును.
పరి ప్రేతత దృష్టితో (perspective) చూచిన ద్వారములు, వరుసగానున్న కుండలు కూడ సుసంగతి నొనగూర్చును.