అర్జెంటైనా
సిన మేతను నీటిని ఒంటేలపైన తీసికొనిపోవుచుందురు. ఉత్తరభాగమునందలి ఎడారిలోను, మెసపొటోమియాలోను, అనేజ, షమ్మర్ అను జాతులవారు అధికసంఖ్యలో గుఱ్ఱములను పోషింతురు. ఇచ్చట కొన్ని ఉత్తమజాతికి చెందిన గుఱ్ఱములును కలవు. కాని అవి దప్పికను ఓర్చు కొనజాలవు. అరేబియా దేశమందంతటను గాడిదలను పెంచుదురు. పట్టణములందు ధనికులు వీటిపై నెక్కుదురు. వీటి పాలను కూడా జనులు ఉపయోగింతురు. ఈ దేశమునందు గల జనుల ఆస్తులలో గొట్టెలు, మేకలు ముఖ్యమైనవి. ఎండ కాలమున రెండు దినములకొకసారి నీరు త్రావును. ఇచటి స్త్రీలు దినమున కొకసారి సంజ వేళ పాలు పితుకుదురు.పు రు షు లు ఒంటె పాలను పితుకుదురు.
బి. యజ, చ.
అర్జెంటైనా : 1516 వ సంవత్సరములో రయోడిలా ప్లాటా అను ప్రదేశమును డా౯ జువా౯ డయాజ్ డిపోలిస్ అను యాత్రికుడు గొనెను. ఈ దేశము దక్షిణ అమెరికా ఖండములోనిది. 1816 లో అర్జెంటైనా రిపబ్లికా అను రాజ్యము స్పెయిను వారి పరిపాలనము నుండి స్వాతంత్య్రము సాధించుకొనెను. ఇది 27 లక్షల చదరపు కిలోమీటర్ల వైశాల్యముకలిగి, ఒకకోటి 78 లక్షల ప్రజలతో నిండియున్నది.
జనులు, పరిపాలనము : ఇది ప్రజాస్వామ్యదేశము 1949లో రాజ్యాంగనిర్ణయము జరిగినది. ఈ దేశములో 16 రాష్ట్రాలు, 8 ప్రదేశాలు, 1 ఫెడరలు జిల్లా ఉన్నవి. ఈ దేశములో నున్న వారిలో ఎక్కువ మంది