అరేబియా (భూగోళము)
లేక ద్రిమ్మరుచుందురు. గోపాలకవృత్తి నవలంబించు చుందురు.
(ii) మధ్యభాగము:- ఇది శుష్కమైనది. ఇసుక స్టెప్ లతోను, రాళ్ళతోను నిండియుండును. అచ్చటచ్చట కొన్ని బావులు కనిపించును. ఎప్పుడును సంచరించు స్వభావముగల జను లీప్రాంతము నాక్రమించియుందురు. ఇక్కడ సేద్యము చేయుటకు కొంత అవకాశము కలదు.
(iii) దక్షిణభాగము -ఇందుఆసియాఖండపు ఎత్తయిన పీఠభూములు కలవు. పశ్చిమమున ఎమెను, తూర్పున జెబెల్ అఖ్తర్ అను పర్వత పంక్తులు కలవు. ఉన్నత ప్రదేశ మగుటవలనను, సముద్రము సమీపమున నుండుటచేతను, ఇచటి శీతోష్ణ స్థితి సమముగా నుండును. జనులు వ్యవసాయమే వృత్తిగా గలవారు. ఈద్వీపకల్పముతో ఓమెన్ ప్రాంతమునందలి బాటినా తీరము మిక్కిలి సారవంతమయిన మండలము ఆమండలము జేబిల్ - అఖ్తర్ కొండల నుండి పారు ఏరుల సహాయముతో సాగు చేయ బడుచున్నది.
ఉద్బిదజాలము : వేసవి కాలములో అన్ని ప్రాంతము లందును జొన్నలు, ధురా, దుఖాన్ మున్నగు ఆహార ధాన్యములను ఇచట పండింతురు. పీఠభూములలో మొక్కజొన్న, గోధుమ, బార్లీ, చలికాలమునందు పరిమితముగా పండింతురు. గుమ్మడికాయలు, ముల్లంగి గడ్డలు, దోసకాయలు, కర్భూజాకాయలు బంగాళాదుంపలు, ఉల్లిగడ్డ, వీక్సు (ఒక విధమైన ఉల్లి) మున్నగు శాకములు పండింతురు. గులాబీ, మల్లె, వాము చెట్టు, లవెండరు మున్నగు సువాసనగల మొక్కలను ఇచట పరిమళద్రవ్యములను తయారు చేయుటకయి పెంచుదురు. 4000 నుండి 7000 అడుగుల ఎత్తుగల ప్రదేశములలో కాఫీ ఉత్పత్తి జరుగును. అరేబియా ఖర్జూరపు చెట్లకు సుప్రసిద్ధము.
జనులు : ఇచటి జనులు రెండు తెగలకు చెందినవారై యున్నారు. అచ్ఛమైన అరబ్బులనియు, ముస్తారబ్ లేక స్వదేశస్థులుగా అంగీకరింపబడిన వారనియు. ఇచటి మొత్తము జనాభా 60 లక్షలు. ఇందులో సంచరణ శీలురైనవారు పదిలక్ష లుందురు. జనులు విశేషముగా ద్వీపకల్పము యొక్కతీరప్రాంతమందు నివసింతురు. వారు వర్షపాతమున్న ప్రాంతములలో భూమిని దున్ని వ్యవసాయము చేసి కొందురు.
జంతుజీవనము :ఒంటె అరబ్బులకు మిక్కిలి ఉపయోగకరమైన పెంపుడు జంతువు. ఇది దప్పికను సహింపగలుగును. అందుచేత ఇది ఎడారిలొ దీర్ఘమైన ప్రయాణము చేయగలదు. దీనిపాలుమనుష్యులకును, గుఱ్ఱములకును జీవనాధారము. సాధారణముగా, 400 పౌనుల బరువును మోయును. ఎండకాలములో దినమునకు 20, 25 మైళ్లవరకు ప్రయాణము చేయగలదు. మూడు నాలుగు దినముల కొకసారి దీనికి నీరు అవసరమగును. చలికాలమున 25 దినములు మీరి నీరు త్రాగకుండ ఇది బ్రతుకకలదు. సవారి చేయువానిని సవారిఒంటే దినమునకు నూరుమైళ్లు మోసికొనిపోగలదు. ఎడారి వేడిమిని తుఫాను గాలులను తట్టుకొనగలదు. కావున దీనికి 'ఎడారి ఓడ' అను పేరు కలిగినది.
ప్రముఖులైన పేకులు, అమీరు కుటుంబముల వారు మాత్రమే గుఱ్ఱములను పోషింతురు. దాడులు జరుపుటకు మాత్రము వీటిని ఉపయోగించుచుందురు. వీటికి కావల