Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/323

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అమరావతి పూర్వమే యమరావతి గొప్ప విద్యాస్థానముగను, బౌద్ధ మత ప్రథాన పీఠముగను విఖ్యాతి చెందియుండెను. ఈ యమరావతీ స్తూప మెప్పుడు నిర్మితమైనదో స్పష్ట ముగా తెలిసికొనుట కాధారములు లేవు. స్తూపపు రాలమీద మౌర్య లిపితో శాసనము లుండుటవలన మౌర్యవంశమువారి పరి పాలనలోమాత్ర మిది నిర్మింప బడియుండుననుట నిస్సంశయము. స్తూపము నందలి అపరిణతములైన ప్రాచీన రీతులను, పరిణత ములుగా గానవచ్చు అర్వాచీన రీతులను వేరు పరచి చూచిన యెడల ప్రాథ మిక స్తూపము క్రీ.పూ. 200 సం|| ప్రాంత మున వెలసినది కను పట్టు ను. మొత్తము నిర్మాణమంతయు నాలుగు దశలలో జరిగినదనియు, ప్రథమదశ క్రీ. పూ. 200 సం. నాటిది కాగా చతుర్థదశ క్రీ. శ. 8వ శతాబ్దినాటి దనియు చెప్పవచ్చును. బౌద్ధకళ ఆరంభదశలో శిల్పమున బుద్ధుని చిత్రింప వలసివచ్చినప్పుడు భౌతిక మానవిధేయములైన నామ రూపములను విడిచి ఆ మునిపుంగవుడు నిర్వాణము నొందేనని తెలుపుటకు గుర్తుగ నచ్చటి స్థలమును శూన్య ముగ నుంచువారు. చిత్రాభావమే బుద్ధ భావమునకు చిహ్నముగ నుండెను. కాలము, గడచినకొలది మొదట నీ స్థలమున శాక్యముని శ్రీపాదములును, పిదప రూప మును చిత్రితములైనవి. బౌద్ధ కళముందు బుద్ధుని మహా పరినిర్వాణమునకు స్తూపమును, జననమునకు పద్మమును, మహాబోధి, పరమ సత్య ప్రబోధనమునకు బోధి వృక్ష మును మృగదావమునందలి బుద్ధుని మొదటి ధర్మబోధన మునకు 'ధర్మచక్రమును సంకేతములుగు చిత్రితము లైనవి. 264 స్తూపాధిష్టానము రమారమి 188 అడుగుల వ్యాసము కలది. అండము (Dome) ఎత్తు 90 అడుగులకంటే ఎక్కువ. కీట్లు కిట్లుగ మట్టి పోయుచు, దిమ్మెస కొట్టుచు, తేల్చిన స్తూపాకృతిని చివరకు పాలరాతితో చిత్రశోభితము గావించినారు. అండము దిగువభాగమునకు వేదిక యని పేరు. ఈ వేదిక చుటుకొలత 521 అడు గులు. దీని లోపలివైపు భాగము నిర్మాణమునందు పడిపోవుట చేత నిది వెలు పలవై పుమాత్రమే చిత్రిత మైనది. ఈ వేదిక పై భాగ మును కప్పియుండు శిలా ఫలకములలో పక్కింటి వెయి-చైత్య చిత్రములు చెక్కబడియున్నవి. దగో బాలు, నాగములు చెక్కిన వలకకు కుడి ఎడమవై పు అందు విడిరాల మీద చెక్కిన స్తంభము లున్నవి. ఈ విడి స్తంభముల మీద బోది వృక్షము, ధర్మచక్ర ప్రవర్తనము, మారప్రలోభనము మొదలైన చిత్రము లున్నవి. ఈ వేదిక చైత్య శిలాఫలక ములకు మీద నంచు కట్టినట్లు చిత్రాలంకృతమైన యొక్క పట్టిక యుండును. ఇది వేరువేరు రాతిపలక లనుగూర్చి యొక రాతిఫలకముపై గాని తీర్చుట చూడ నగును. నాలుగు దిక్కులయందును ఈ వేదిక ప్రతిద్వార మునకు నరుగు తీర్పబడినది. ఈ ప్రతి యరుగుపై నై దేసి స్తంభములు చొప్పున నాలుగు దిక్కులందును ఆయక స్తంభములు (పూజనీయ స్తంభములు) ఇరువది గలవు. ఉత్తర హిందూస్థానమునందలి ఏ స్తూపమందును లేని యీ ఆయక స్తంభ ప్రతిష్టాపనము ఆంధ్రదేశ స్తూప విశిష్ట లక్షణమునకు తార్కాణము. ఈ వేదిక చుట్టును శ్రీవీథియను పేర ప్రదక్షిణవీథి యుండెడిది. ఈ వీథి నావరించి నిలువ రాతికంబములతో నిర్మించిన కట్టువవంటి శిలాప్రాకారము కలదు. ఆచార్య