Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/286

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

- అబుల్ హసను 20-4-1872 క్రీ. శ. నాడు పట్టాభిషిక్తు డయ్యెను. పదునైదు సంవత్సరములు అత్యంత వైభవముతో, ప్రజారంజకముగ ఇతడు గోల కొండ రాజ్యమును పరిపాలించెను. ఇతడు 21-9 1687 ఉదయము రమారమి తొమ్మిదిగంటలవేళ గోలకొండను ముట్టడించిన మొగలు సైన్యమునకు వశుడయ్యెను. ఔరంగజేబు ఇతనిని దౌలతాబాదు కోటలో నిర్బం ధించెను. ప్రతి సంవత్సరము అబుల్ హసన తన రాజ్య ప్రజల . బాగోగులను విచారించుటకై దేశభ్రమణము చేయు చుండెడివాడు.' ఇతడు పాడుపడిన వందలకొలది గ్రామ ములను పునరుద్ధరించెను. నూతన గ్రామముల ననేకము లను నిర్మించెను. భూముల విస్తీర్ణమును, పంటల పరి స్థితిని అనుసరించి శిస్తులను నిర్ణయించెను. అనేక రాజ మార్గములు, అన్న సత్రములు, దేవాయతనములు, వాపీ, కూప, తటాకములు, విద్యాలయములు, ఔషధాలయ ములు ఏర్పాటుచేసెను. ధనవంతుల దౌర్జన్యమునుండి, అధి కారుల క్రౌర్యమునుండి, దొంగల అలజడినుండి, ప్రజ లను రక్షించి, అబుల్ హసన్ వారిని కన్నబిడ్డలవలె కాపాడెను. సర్వమత సహిష్ఠు డయి, అందరను అతడు సమముగ చూచుచుండెను అనేక ముఖ్యపదవులపయి తెలుగువారిని, హిందువులను ప్రతిష్ఠించెను. ఈ ఘన కృత్యములచే ఆతని కీర్తి చంద్రికలు దశదిగంతముల వ్యాపింప జొచ్చెను. అబ్దుల్లాఖాన్ పొనీ అనువాని ద్రోహమువలన గోల కొండ దుర్గము మొగలులు చేజిక్కినది. కర్మయోగియగు అబుల్ హసను ఈ పతనమునకు ఆవంతయు చింతింప లేదు. ఆతని గుండె నిబ్బరము, సహజ ధీరోదాత్తత, మొగలు దండనాథులను చకితుల గావించెను. వారి ప్రశ్న కాత డీ విధముగా సమాధాన మిచ్చెను: "ఈశ్వరునియందు నా కచంచల భక్తి విశ్వాస ములు గలవు... నా పూర్వులు అమిత ధనవంతులు, అయినను చాల కాలము నేను భిక్షాటనము చేసి జీవించి తిని... ఈశ్వరుడు నన్ను రాజుగ చేసినాడు... ఇచ్చిన వాడు నేడు తీసికొన్నచో నేడు నెత్తి, నోరు కొట్టు కొమట ఏటి న్యాయము? అదియునుగాక భగవద్దా 227 అబుర్హాసన్ తానాషా సుకును, నీజ మగు ముకల్లానుకురు అగు ఔరంగ జేబు వంటి వాడు నావారసు డగుట నిజముగ నంది సింపవలసిన విషయము గదా !" కె. శ. 18-21663 తారీఖున అబుల్ హసనును జాను నిస్సారుఖాను నాయకత్వమున దౌలతాబాదు దుర్గమున కంపి, అందు అతనిని కాలాకోరాలో నిర్బంధించిరి. అతని ధక్యమునకై ఏబడివేల హొన్నుల వార్షికము ఏర్పా టయ్యెను. పదునాలుగు సంవత్సరములు చెర ననుభవించి 1113వ హిజరిక సరియగు క్రీ.శ.1708 సంవత్సర ప్రారంభమున అతడు రక్త విరేచనములవలన దాదాపు డెబ్బది అయిదు వత్సరముల ప్రాయమున చనిపోయెను. అతని కోరిక ప్రకారము కలిని కళేబరమును దౌలతా బాదు సమీపముననున్న హజరత్ గే సూదరాజులో రండ్రి సమాధివద్ద నిక్షేపము చేయబడినది. అబుల్ హసన్ పట్టువడిన సందర్భమును గురించి దేశీయ, విదేశీయ సమకాలిక చరిత్రకారులు అనేక విధములుగ వ్రాసియున్నారు. అవి యసందర్భములును, అసమర్థనీయములును గావున త్యాజ్యములు. అబుల్ హసను జననము క్రీ. శ. 1628. వివాహము 1861. పట్టాభిషేకము 1672. రాజ్యచ్యుతి 1887. చెర 1698. మరణము 1708. అబుల్ హసను పండితుడు, కవి, గాయకుడు, శిల్పి, దైవ భక్తిగల ముసల్మాను, సూఫీ, మతసహిష్ణువు, పవి త్రుడు, న్యాయశీలి, సుందరుడు. అతడు రాజఠీవికి వరా కాష్ఠ. దక్కన్ సుల్తానులలో ఐకమత్యమును గూర్చు చునో, విదేశీయవర్తకుల కలహములను దీర్చుచునో, పరి పాలనా చక్రమును, సైన్య వ్యవస్థను, విదేశ విధానమును చక్కబరచుచునో అబుల్ హసను తానాషా చరిత్ర యొక్క పుటలయందు మనకు గానిపించుచుండును. నూరీ, ఫాయిజ్, లతీఫ్, షాహి, మిర్జా, గులాం అలీ ఖాను, మున్నగువారు ఆతని ఆస్థాననకవులు, షారాజూ ఖత్తాల్, రామదాసు అతనికాలపు సుప్రసిద్ధ భక్తులు. గోషామహలు, చారుచమను, ఇమ్లీబాగ్ మొదలగునవి ఆతడు కట్టించిన సుందర కట్టడములు. సామ్రాజ్య వ్యాపార విస్తృతుల కాటంకముగా అబుల్లాహపను నిలుచుండుటచే పారసీక చరిత్రకారులును, విదేశీయ .