Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/241

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనవేమారెడ్డి చివర అనపోతనరేంద్రస్య బాలసరస్వతిః అకరోత్ నిర్మలం ధర్మశాసనం" అని ఇతడు లిఖించెడివాడు. ఈ విధముగ అనపోతారెడ్డి వీరుడై, విజేతయై, ధార్మికుడై, ప్రభువై, ప్రజారంజకుడై ప్రసిద్ధిచెందెను. అన వేమారెడ్డి : 26 'తన బ్రతుకు భూమిసురులకుఁ దనబిరుదులు పంటవంళ ధరణీశులకున్ తననయము భూమిప్రజలకు షి. య. రె. $9 నన వేమన యిచ్చెఁ గీర్తి నధికుం డగుచున్ ' అని కీర్తింపబడిన మహాధార్మికుడు, ధర్మవేమన యని ప్రసిద్ధివహించిన అనవేమారెడ్డి. అతడు ప్రోలయ వేమా రెడ్డి కుమారుడు. కొండవీటిరాజగు అనపో కా రెడ్డితమ్ముడు. అనపోతా రెడ్డిఅనంతరము అతనికుమారుడు కుమారగిరి రెడ్డి బాలుడగుటచేగాబోలు అనవేమారెడ్డి పైతృకమగు కొండవీటిసింహాసనమును అధిష్ఠించెను. కొండవీటి రెడ్డి ప్రభువులలో ఉత్తముడగు నీతడు వారసత్వపుటధి కారము కంటె రాజ్యక్షేమమే ప్రధానమని భావించెను. ములలో నితడు “ మహనీయాంధ్రదేశ పట్టాభిషేక సంవృత మహాభాగ్యు " డని వర్ణింపబడినాడు. " సోయం భ్రాతురనంతరమ్ నిజమహీకారమ్ వహన్ శాసన పైతృకమ్ రాజ్య శ్రీరమణీ స్వయంవరపతిః శ్రీ అన్న వేమప్రభుః " అనియు రాజ్యరమారమణీస్వయంవరఅబ్ద నాయక సౌభాగ్యు " డనియు, శాసనగతశ్లోకములచే కీర్తింపబడిన ఈ అన వేమనృపతి, రాజ్యలక్ష్మి స్వయముగా కోరి వరిం చిన పతి యని భావింపవచ్చును. సహాయు 1.

డనియు, శూరాగ్రగణ్యుడయిన అన వేమా రెడ్డి " మరికా డనియు, కరవాలవైనతేయు " డనియు, విక్రమపంజర నిగృహీత రిపురాజసింహు " కీర్తింపబడినాడు. పై బిరుదు లన్నియు బాహుబలశాలి యైన ఈతని విజయప్రస్థాన గౌరవ చిహ్నములు కావచ్చును. - రాజ్యారంభమున మొదటి రెండుసంవత్సరములు ఈ వేమనృపతి తనరాజ్యమును సుస్థిరము గావించుటయందు గడిపి, పెక్కు సైన్యములను కూర్చుకొని శా. శ. 1294లో 182 ts తన సీమావధులను దాటి, తన అన్న అనపోతనృపతికి స్వాధీనముకాని గోదావరిపర్యంత దేశమునందలి స్వతంత్రులగు మండలేశ్వరులను అణచి తద్దేశములను స్వాధీనముచేసికొనుటకై బయలు దేరెను. అనపోతా రెడ్డి బాహుబల దర్పముచే జయించిన దివిసీమ 3 ను పద్మనాయకులు విజృంభించి స్వాధీనపరచుకొనిరి. ఆవిధముగ పరాయ త మయిన "దివిసీమ" ను ఈతడు మున్ముందే జయించి “దివిదుర్గ విభాల" అను బిరుదు నొందెను. తరువాత శూరవరపట్టణము రాజధానిగ నేలిన ఉండిరాజులను, కామవరము రాజధానిగ నేలిన భక్తి రాజును ఇతడు జయించెను. పిమ్మట ఇతనిదృష్టి నిరవద్య ప్రోలు వైపు మరలెను. నేటి పశ్చిమగోదావరిజిల్లాయందలి నిడదవోలుపురమే నాటి "నిరవద్యప్రోలు". తురుష్క క్రమణకు పూర్వము కాకతీయ చక్రవర్తుల బలవత్తరమగు కోటలలో ఇది యొకటిగా నుండెను. తరువాత అన్న దేవ చోడున కిది ప్రధానదుర్గముగా నుండెను. అన్న దేవచోడు నకును అన వేమా రెడ్డికిని జరిగిన యుద్ధమునందు అనవే మునకు ఈదుర్గము స్వాధీనమయ్యెను. ఈదుర్గవిజయ ముతో అన వేమునకు అన్న దేవునిరాజ్యము స్వాధీనమగుట యేగాక, గోదావరియొక్క ముఖ్యశాఖలగు వాసిష్ఠ, గౌతమి అను నదుల మధ్యస్థమగు సారవంతమైన ప్రదేశము లీతనివళ మయ్యెను. క్రీ. శ. 1874 నాటి వాదపుర శాసనమువలనను, ద్రాక్షారామశాసనమువలనను, వానపల్లి తామ్రశాసనముమూలమునను, గౌతమీనదీ సాగరసంగమ స్థానమున నున్న కోనసీమ, పానారుసీమ (నేటి రాజోలు తాలూ కా) అన వేమునకు వళపడినట్లు గ్రహింపవచ్చును తనవశమయిన కోనసీమయందలి "నడుపూరు" గ్రామ మును వేమవరమను పేరుతో చంద్రగ్రహణ సమయమున తనచెల్లెలు వేమసానికి పుణ్యము చేకూరుటకుగాను బ్రాహ్మణులకు దానము చేసి, ఈ ప్రభువు శాసనము వేయించెను. విజయవంతములగు పై దండయాత్రలయందు ఇతనికి సహాయపడినవారు రెండవ కాటయరెడ్డి, రెండవ మారయరెడ్డి, దొడ్డారెడ్డి, దువ్వూరి వంశస్థులు మున్నగు వారు. ప్రథమసంగ్రామములందు విజయలక్ష్మిని చేపట్టిన రెడ్డి సేనలు అధికతర జయోత్సాహముతో గోదావరిని దాటి