Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/237

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అనపోతనాయడు నముల వలన వెన్నమనాయనితో ఈ వంశము ఆరంభ మగుచున్నది. వెన్నమనాయునకు దాచభూపతి పుత్రుడు. అతని కుమారుడు సింగభూపతి. ఈ సింగభూపతికి అనపోత నాయడును, మాధవనాయడును ఉదయించిరి మనక థా నాయకుడగు అనపోతనాయడు మహావీరుడు. అతడు రాచకొండ (నల్ల గొండజిల్లా) రాజధానిగ జేసికొని తెలంగాణమును పాలించిన వీరచూడామణి. తమ్ముడగు మాధవనాయడు అన్న అడుగుజాడలలో నడిచి సంగర రంగములలో అతనికి బాసటగా నుండి విజయముల గడించిన శూరవర్యుడు. వెన్నమనాయడు రాణియగు రుద్రమదేవి కాలమున ననేక సమరములలో విజయము గడించెను. దాచ భూపతియునీంగమనాయడును పత్రాపరుద్రమహారాజుకడ సేనానాయకులు. దాచభూపతి కాంచీపురము భేదించి పంచ పాండ్యులను జయించి స్వర్ణమయ సింహాసనమును “పెద్ద పచ్చను విజయ చిహ్నములనుగా దెచ్చి ప్రతాపరుద్రున కర్పించెను. మరల పాండ్యులు తలయెత్తగా సింగమ నాయడు వారలపై కి ప్రతాపరుద్రదేవుని ఆనతిపై బోయి పాండ్యరాశ్యలక్ష్మిని రాజునకు కైవసము చేసెనని అయినవోలు శాసనమున చెప్పబడియున్నది. సింగమనాయడు కాకతీయరాజ్య పతనానంతరము తెలంగాణములో ప్రసిద్ధివహించి రాచకొండ దుర్గమును రాజధానిగ జేసికొని పలుకుబడి గడించెను. ఇతని తమ్ముడు నాగానాయడు, రాచకొండలో ప్రధాన దుర్గమునకు చేరువలో నొక దుర్గము కట్టించి, రాజధానిని మిగులు విస్తృతముగా చేసెను. కాకతీయ రాజ్యాంతమున సింగమ నాయడు చిన్న చిన్న దుర్గములు జయించి రాజ్యము స్థాపించు ప్రయత్నము చేయుచు జల్లిపల్లికి పోయి ముట్ట డించెను. గెలుపు సాధ్యము గాదని లోపలనున్న రాచవారు భావించి చుట్టుపట్టులనున్న రాజులను కూడగట్టుకుని కుట్రలన్ని సింగమనాయని భావమరదియగు చింతలపాటి. సింగమనాయని చెరలోనుంచిరి. తమ్మళ బ్రహ్మాజీ అను మోసగాడు రాచ వారి వక్ష మున ' రాయబారిగ వచ్చి సింగమ నాయనితో "మీరు ముట్టడిమానిన మేము మీ బావమరదిని విడిపింతు"మని సంధివిషయములు మాట లాడుచు ఏమరుపాటుననుండగా, సింగమనాయని ఆయువు పట్టున క త్తితో పొడిచి పారిపోయెను. తన కుమారులగు అనపోతనాయని, మాధవనాయని పిలిచి సింగమనాయడు తన్ను చంపప్రోత్సహించిన రాచవారిని చంపి వారి ర క్తముతో తర్పణము లొసగుడని చెప్పి ఈ కార్యము నెర వేర్తుమని ఒట్టు పెట్టించుకొని మరణించెను. ప్రత్యర్థు లగు రాచవారు ప్రాణభీతితో పారిపోయి, ములంగూరు దుర్గమున డాగియుండి, తోడి దుర్గాధిపతులను గూడ దీసి కొని చెంజర్లకడ విరోధులను మడియింప కాచియుండిరి. ఇది విని ప్రతిజ్ఞా నిర్వహణమునకై అనపోతనాయడు, మాధవనాయడు సై నిక బృందముతో బయలుదేరి రాచ 'వారిని, వారికి సాయము వచ్చినవారిని తునిమి వారి రక్తముతో పీతకు తర్పణము నొసగి "సోమకుల వరకు రామ” అను బిరుదము ధరించిరి. అనపోతనాయడు భువనగిరి, సింగపురము, రాచకొండ, ఓరుగల్లు దుర్గముల నాక్రమించి దిగ్విజయమునకు బయలు వెడలి అయినవోలు లోని మైలారుదేవుని సందర్శించి (క్రీ.శ.1889) సం॥ లో అయినవోలు సమర్పించి గొప్ప శిలాశాసనములు ప్రతిష్ఠించెను. అందుగల బిరుద ములు చూచిన అతడు మహావీరుడనితోచును. 'రాయబందీ విమోచక', ఇతర శాసనములలోని 'కాకతీయ రాజ్య స్థాపనాచార్య' అను బిరుదములు తండ్రియగు సింగమ నాయనివిగ తోచును. అవి కాకతీయ సామ్రాజ్యము విచ్ఛిన్నము నొందినపిదప రాజ్యమేలిన అవపోతనాయనివి కావు. వంశపరంపరగా రాజధానియగు రాచకొండలో 178 శా.శ. 1291 దుర్గ పునరుద్ధరణము గావించి రాయసముద్రము, అనపోత సముద్రము, రామస్వామి దేవాలయము, వీరభద్రాలయము, రాజమందిరములు, బొడ్డుచౌకీ, కొలువుకూటపు బావి, సంకిళ్ళబావి నేటికి నిలిచి, అనపోత నాయని కీర్తిచిహ్నములుగ నున్నవి. నాగానాయని కొండపై గొప్ప దుర్గము గలదు. రాచకొండతో గలిపి నాగానాయని కొండకు గొప్ప ప్రాకారము కట్టి లోన మహోన్నతములగు నాలుగు ప్రాకారములను దిమిడ్చెను. మహైశ్వర్యము ననుభవించిన రాచకొండ దుర్గమునిండ అడవులు బలిసి ప్రవేశింప రాకుండుటచే అందలి విశేషములు చరిత్రమున కెక్కకుండుటలో వింత యేమియు లేదు.