Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/165

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

జంతా తోడను దానిని ముగించినాడు. మధ్యభాగమున అతడా గజరాజు పద్మసరస్సున స్నానమాడుటయు, ఒక పెద్ద మట్టిచెట్టు క్రింద గల దాని ప్రియమైన ఆశ్రయ స్థలమును చిత్రించియున్నాడు. ఈ విధముగా జంతుజీవితమునకును, ప్రకృతి సౌందర్యమునకును సంబంధించిన దృశ్యములు దుఃఖ క్లేశ తమస్సు భక్తి విశ్వాసాలోకముచే ప్రకాశింప జేయబడు మానవ భావములను చిత్రించు దృశ్యముల నుండి వేరుగా ఉంచబడినవి. అడవియందలి జంతు జీవితమునకు సంబంధించిన దృశ్యములలో ఒక ఏనుగునకును మొసలికిని జరిగిన పోరాటమును వర్ణించు దృశ్యమును చిత్రకారుడు మిక్కిలి నేర్పుతో చిత్రించియున్నాడు. అందే నుగు తన శత్రువును వెలికిలబడవైచి, దాని పొట్టపై తన ముంగాలొకటి పెట్టి, దానిని తుత్తునియలు చేయుటకై తొండముతో గట్టిగా నొక్కుచున్నట్లు చిత్రితమైయున్నది. దానికి సమీపముననే భీకరమైన మహానాగము ఏనుగు కాలి నొక దానిని పట్టు కొనగా అది దురంతరమైన వేదనపొందుచు తన తోడి ఏనుగుల సాయము నర్థించుటకై ఆర్తనాద మొనరించు టకో అన తొండమును పైకెత్తినట్లుగా చిత్రింపబడి యున్నది. గజయూధ మొకటి పద్మసరోవర మున స్నానము చేయుచు తొండముల నెత్తి వివిధ స్వాభావిక విన్యాస ములతో వానిని వంకరగా త్రిప్పుచు జలక్రీడోత్సాహమున ఉప్పొంగు దృశ్యమొకటి మిక్కిలి మనోజ్ఞముగా ఉన్నది. రాణి గజదంతములను చూచి మూర్ఛాక్రాంతురాలైన ఆస్థానదృశ్యము నాటకీయ ప్రభావముతో కడు మనో హరముగా ఉన్నది. ఆ పద్దంతనాగము పూర్వము ఒక అవతారములో ఆమెకు ప్రియదయితుడై యుండెను. తనపై కంటె అప్పుడింకొక భార్యపై అత డెక్కువప్రీతి కలిగిఉండిన ట్లామె భావించుటదే కోపావేశమున దాని దంతములను కొనిరమ్మని ఆమె వేటకాండ్రను పంపి యుండెను. వర్తమాన జన్మమున ఆమెకు భర్తయైన కాశీ రాజు ఆమెకు దగ్గరగా కూర్చుండి, తన చేతులలో నొక దాని నా మె వీపు వెనుక నుంచియు, రెండవదానితో, నా మె కుడిభుజమును పట్టుకొనియు ఆమెకు అవలంబ మొసంగు చున్నాడు. పరిచారిక ఒకతె రాణికి విసనకఱ్ఱతో వినరు చున్నది. తలపై పోయుటకో, ముఖముపై చల్లుటకో 106 వేరొక తే జలము తెచ్చియున్నది. మూడవయామె రాణి కేదో పానీయి మొసగుచున్నది. దృశ్యమునకు కుడివై పున నున్న నాల్గవయామె భారతీయులకు సహజ మైన విధమున విచారభావముల నడచుటకై తన చేతిని ముఖముపై పెట్టుకొనియున్నది. ఛత్ర ధారిణియైనపరిచారిక ఆస్థానము సంతను భయకంపిత మొనరించిన ఆ దంతములవంక చూచు చున్నది. భూతలాసీనయైయున్న వనిత యొకతె రాణిని తెప్పిరిల్ల జేయుటకై ఆమె అరకాళ్ళను రాయుచున్నది. దృశ్యమునంతను ఆవరించియున్న సామాన్య కరుణ వాతావరణముమాట అటుండ, వ్యక్తుల వర్గీకరణమును, మనోహరములైన విన్యాసములును స్త్రీల భూపణ కేశాలంకరణ విధానములును, అల్పమయ్యు కళా సంపన్న మైన వివిధ వ్యక్తుల వస్త్రధారణ ప్రకారమును, చిత్రకారుని సజీవమైన భావనాశక్తిని, సరసమైన అభి రుచిని మాత్రమేకాక సుపరిపక్వమైన అతని సాం కేతిక కళా కౌశలమును తనఊహ ననుసరించి ఏ వస్తువునైనను ఏరీతిగనైనను యథేచ్ఛముగా చిత్రింపగల అతని సామర్ధ్య మును ప్రదర్శించుచున్నది. క్రీస్తుపూర్వ యుగమునందలి చిత్రలేఖనములవలె ఈ చిత్రమున చిత్రింపబడిన వ్యక్తు లందరునుకూడ అనార్యులు గనే కానవచ్చుచున్నారు. చిత్రణమునందలి సాంకేతిక విధానమును, వస్తుసామగ్రియు కేవల దేశీయములై యున్నవి. అందు పరదేశములకు సంబంధించినదేకాక మిక్కిలి సమీపమునందున్న ఉత్తర హిందూస్థానమునకు సంబంధించినదియు ప్రభావ మిసుమంతయు గోచరించుట లేదు. కాని దృశ్య సౌందర్యమును కల్పించుటలో చిత్ర కారుడుచూపిన ఉత్సాహమును, అతడుమృగ జీవితమును గూర్చి కావించిన సునిశిత పరిశీలనమును, మత ముద్రతో కూడిన కరుణరస భావములను చిత్రించుటలో ప్రదర్శించిన నైపుణ్యమును, సూక్ష్మ వివరములతో కూడిన అలంకరణ విధానమందలిప్రీతియు, ఎడమకుడిగోడలపై చిత్రములను చిత్రించుటలో కలిగిన నాలుగు శతాబ్దుల వ్యవధానమున చిత్రలేఖన కళ వైజ్ఞానిక వ వైజ్ఞానిక ముగను, సాంకేతికముగను కూడ మిక్కిలి అభివృద్ధిని పొందెనని సూచించుచున్నవి. క్రీ. శ. నాలుగవ శతాబ్దిలోని చిత్రలేఖనము :- పైని వర్ణింపబడిన పడ్డంత జాతకమునకు ఎడమవైపునగల