Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/134

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

అజంతా స్థలమంతయు ఎండినమీదగాని దానిపై రంగు వేయరు. రంగు వేయబడునపుడు శ్రీ కుమారస్వామిగారు తలంచి నటుల ఆ ప్రదేశమంతయు తడిగా నుంచబడుననుట అను మానాస్పదము. మొదట రూపు రేఖలు గీచి, వాటిలో రంగులతో చిత్ర లేఖనము జరుపబడును. ఆరూపరేఖలు సర్వదా మొట్ట మొదట ధాతురాగముచే గాని, ఎఱ్ఱ సుద్దచే గాని స్పష్ట ముగా గీయబడును. ఆ రేఖాకృతులలో ఎరుపు రంగు నింపబడును. దాని మీద మిక్కిలి పలుచనై అచ్చమైన పచ్చనిమట్టి పూయబడును. అపుడు దానిగుండా ఎఱ్ఱదనము కనిపించుచుండును. స్థానికముగా లభించు రంగులు భిన్న చ్ఛాయలతో పూయబడుచుండగా కపిశవర్ణముచే గాని, గాఢమైన ఎఱుపు లేక నలుపు రంగుచే గాని, స్థూల సూక్ష్మములై న ఛాయలచే గాని, బిందువులచే గాని, పత్ర రేఖలచే గాని రూపరేఖయు నవీకృత మొనర్పబడును. దీనిచే రూపరేఖకు సంపూర్ణముగా ప్రమాణ భూతమును, వలయితమునగు ఘనపరిమాణగుణము ఘటిల్లును. ఇందు ఉపయోగింపబడిన రంగులలో ధాతురాగము, కుంకుమ లేక సిందూరము, హరిదళము, నీలిమందు రంగు, నీలి మైలుతుత్తము (Lapis lazuli blue), కజ్జలము, ఖడి మట్టి, “జేగురుమట్టి, ఆకుపచ్చరంగు మున్నగునవి పేర్కొన దగినవి. రంగులన్నియు స్థానికముగ లభించియుండును. నీలి మైలుతు త్తము (Lapis lazuli blue) మాత్రము జయ పూరు నుండి గాని, దేశపు బహిర్భాగమునుండి గాని తెప్పింపబడియుండును. మిశ్రవర్ణములు కూడ అపురూప ముగా ఉపయోగింపబడెను. ఉదా:- బూడిద వర్ణము. వర్ణములన్నియు సమసాంద్రతతో ఉపయోగింపబడ లేదు. అది విషయమును బట్టియు, స్థానిక వాతావరణమును బట్టియు నిర్ణయింపబడెను. అజంతా చిత్రలేఖనమునందు సాధారణముగా ప్రాచీన హైందవ చిత్రలేఖనము నందువలె వర్ణ సాంకర్య వై లక్ష ·ణ్యము ప్రధాన లక్ష్యముకాదు. భిత్తితలమును ప్రధాన ముగా జాజుమన్ను, పచ్చమన్ను మున్నగు సాంద్రమును, గాటునయినవన్నెలతో అమేయములయిన భావములతో, ఛాయలతో నింపుటకై యత్నించుటయే ప్రధానలక్ష్యము. ఇట్లు పరిపూర్ణ రచనతో, గాటయిన రంగులతో భిత్తి 91 తలమును నింపుట ప్రాచీన చిత్రలేఖన గౌరవమును అతిశయింప జేయును. కాలమున కాల గణనము :- పదవ గుహ ఒక చైత్యశాల. అందు రెండు శాసనములు కలవు. అవి ఆ గుహా నిర్మాణకాల మును నిర్ణయించుటకు తోడ్పడుచున్నవి. ఆ శాసనము లలో నొకటి ఆ గుహా ముఖతలమున చెక్క బడియున్నది. రెండవది దాని యెడమ వసారా గోడమీద చిత్రింపబడి యున్నది. ప్రాచ్య పాశ్చాత్య శాసన పరిశోధకులలో ప్రముఖుడయిన ప్రొఫెసరు లై డర్సు (Liiders) యొక్క అభిప్రాయము ప్రకారము ఆ రెండు శాసనములలో చిత్రింపబడిన శాసనము క్రీ. శ. రెండవ శతాబ్ది మధ్యభాగ మునకు చెందియున్నది. గుహా ముఖతలమున చెక్క బడిన శాసనము అంతకంటే ప్రాచీనమయినది. ఇట్లనుటకు కారణము అందలి కొన్ని వర్ణములు అశోకుని శాసనము లందలి వర్ణాకృతులను కలిగియుండుటయే. ఈ శాసనము నందు ఈ గుహా పురోభాగమును "వాసిష్ఠీ పుత్తకటపోడి అనువాడు మలిపించి, దానమొసగినట్లు వ్రాయబడి యున్నది. ఈ శాసనము మహాచైత్య వాతాయనమునకు కుడివైపున నెదుట చెక్కబడియున్నది. ఆ దక్షిణాపథమునందు అత్యంత విస్తృతమయిన రాజ్య మును ఆంధ్ర శాత వాహ నులు పరిపాలించుచుండిరి. దక్షిణాపథము నందును ప్రస్తుతము ఆంధ్ర ప్రదేశముగా ఏర్పడియున్న ప్రాచ్య ప్రదేశము నందును, ప్రస్తుత ము బొంబాయి రాష్ట్రములో ఒక భాగముగా ఏర్పడియున్న పశ్చిమప్రదేశమందును బౌద్ధ శిల్పము యొక్కయు, వాస్తు శాస్త్రము యొక్కయు అభివృద్ధిని కల్పించి, శాతవాహ నులు విఖ్యాతులయిరి. దక్షిణాపథము నందలి స్మృతి చిహ్నములు. అవి కొండనే, బేడ్సా, కార్లే మున్నగు స్థలములందలి ప్రస్తరములను తొలిచి నిర్మించిన గుహా మందిరముల వంటివై నను సరే, (లేక) భట్టిప్రోలు, అమ రావతి, జగ్గయ్య పేట మొదలగు తావులందు గల నిర్మా ణాత్మక నిదర్శనముల వంటివైనను సరే నిర్మాణ విధా నము, సాం కేతికరచన, సన్ని వేశములయందలి సామ్యము మున్నగువానిచే పూర్వోక్తమయిన అజంతా యొక్క పూర్వకాలికతను ధ్రువపరచుచున్నవి. పదవగుహ యొక్క ఎడమగోడ యందలి చిత్రలేఖనమునకును, దీనికి సమకా