Jump to content

పుట:సంగ్రహ ఆంధ్ర విజ్ఞానకోశము మొదటి సంపుటము అ-ఆర్ష.pdf/132

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

ఏర్పడును. సరిచూచు యంత్రమునందు కొలతబద్ద కల ఒక స్తూపము కూడ కలదు. కార్యకర్త కావలసిన సంజ్ఞ లను, ఎడములను పంక్తిలో అమర్చినతరువాత, ఆ స్తూపము పంక్తిని సరిచేయుటకై స్వతశ్చలనముచే గిరగిర తిరుగును. కొలతబద్ద యొక్క పైభాగము చిన్న సమకోణ చతుర స్రములుగా (Rectangles) విభజింపబడి యుండును. ఒక్కొక్క చతురస్రములో మీటబల్లపై నున్న మీటలతో సంబంధమును చూపు సంఖ్యలుండును. పంక్తిలో కావల సిన సంజ్ఞలు చేర్చబడినపిదప సూచిక సూచించిన ఈ రెండు సంఖ్యలకు అనుగుణముగా నుండు మీటలను కార్యక ర్త నొక్కుచుండును. మీటల వలన ఏర్పడిన రంధ్రములు, ఎడములను ఏర్పరచుటకును, పంక్తి యొక్క ఎడమును సరిచేయుటకును చీలలను పోతయంత్రమువద్ద అమర్చును. పోతయంత్రము సంపూర్ణముగా స్వతశ్చలనముచే పని చేయును. అది మీటబల్లపై రంధ్రములు చేయబడిన రిబ్బను అధీనములో నుండును. అచ్చు పెట్టెలో 225 అచ్చు ముక్క లుండును. వివిధ సమ్మేళనములకు ప్రత్యామ్నా యముగా వివిధ సంజ్ఞల నుంచవచ్చును. లేదా ప్రాత అచ్చుముక్కల పెట్టెను తీసివై చి, క్రొత్త పెట్టెను యంత్ర ములో సమర్చవచ్చును. అచ్చుముక్కలపై ముద్రాక్షర ముల స్వరూపము పోతపోయబడును. అచ్చు అక్షరము యొక్క క్రింది భాగము మూసకట్టులో పోతపోయ బడును. ఇదివరలో వర్ణించిన విధమున పోతయంత్ర ముపై ముద్రాక్షరములు (అక్షర) పంక్తిగా ఏర్పడును. అచ్చు అక్షరములను కూర్చి అమర్చి పెట్టు సాధారణ చట్రములో ఈ పంక్తులన్నియు కూడుకొని సిద్ధముగా నుండును. ఇట్లు బహు విధముల ఉపయోగకరమయిన ఏక ముద్రణయంత్రము వార్తా పత్రికలు, గ్రంథములు, చిల్లర విషయములు ముద్రించు ననేక కార్యస్థానములలో ముద్రణమునకు వలసిన వివిధ కార్యములను ఒకేచోట జరుగుటకు వీలును కలిగించునదై యున్నది. ఒకసారి ఉప యోగించిన అన్ని అచ్చు అక్షరములను తిరిగి కరిగించి, క్రొత్త సంజ్ఞలను తయారుచేయుటకు ఈ యంత్ర ము తోడ్పడును. అందుచే ఈ క్రొత్త పద్ధతి ఆర్థిక సౌలభ్యమును చేకూర్చినది. ఏక ముద్రణ యంత్రము ఈ విధముగా ఒక అచ్చుకూర్పు యంత్రముగా నే కాక అచ్చు వేయు కార్య 12 ' 89 అజంతా స్థానమునకు కావలసిన వస్తువులలో పక్కింటిని సమ కూర్చ గల ముద్రాక్షర సంధానిగా కూడ ఉపయోగ పడుచున్నది. డా. గ. కె. శా. అజంతా :- అజంతా హిందూ దేశమునందు మిక్కిలి ప్రాచీనమయిన కళాక్షేత్రముగా విఖ్యాతమైయున్నది. ఇది వాస్తుశాస్త్ర శిల్పశాస్త్రములను సరసముగా సమీక రించి రచింపబడిన ప్రాచీన హైందవ భిత్తి చిత్రలేఖనము లకు ఒక అసదృశమును, అద్వితీయమును అగు నుదా 1. ప్రవేశిక హరణము. స్థలము :- అజంతా అను గ్రామము సుప్రసిద్ధిచెందిన గుహా మందిరములకు ఏడు మైళ్ళ దూరములో నున్నది. (20-80 ఉ. 75-45. తూ.) ఈ గుహలు ప్రస్తుతపు బొంబాయి రాష్ట్రమున ఔరంగాబాదు జిల్లాయందలి ఫరద్ పూరు అను గ్రామమునకు మిక్కిలి సమీపమున గలవు. ప్రకృతి సౌందర్య రసజ్ఞుడగు ఒకానొక కళా నిష్ణాతునిచే ఈస్థలము వరింపబడినది. హరిత తృణాది సౌందర్యముతో ఇరుదరుల నొరయుచు పారు సెల యేటితో లోయ అత్యు త్తమముగా భాసించు తరుణమున భిక్షువులకు ఏకాంత వర్షావాసముగా ఉపయోగపడుట కయి ఈ అజంతా గుహలు తొలుచబడినవి. ఈరీతిగా గుహలు సుందర సుందర పరిసరములలో నిర్మితములయినవి. ఇచ్చటి సహజశోభయు, వివి కతయు, భిక్షువులు ప్రశాంతముగా ధ్యానము చేసికొనుటకును, కళాభిజ్ఞులును, వాస్తుశాస్త్ర పండితులును ఆవేశపూరితు లగుటకును తోడ్పడెను. భూగర్భశాస్త్ర విషయము :- వాఘోరా (waghora) నది నానుకొనియున్న చరియ పొడుగునను, దాని మధ్య భాగమునందును ఈ గుహలు త్రవ్వబడినవి. ఈ చరియ అర్ధచంద్రాకారమును కలిగియున్నది. మొదటి గుహ మొదలుకొని ఏడవగుహవరకు చరియ యొక్క ముఖ పాతము సాపేక్షముగా క్రమముగాను, పిమ్మట ఆకస్మి కముగా మిక్కిలి నిలువుగాను పరిణమించుచున్నది. వస్తుతః ఈగుహలలో సగపాలు గుహలు పశ్చిమాభిముఖ ముగాను, తక్కు సగపాలు గుహలు ప్రాఙ్ముఖముగాను