పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/42

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

ఈ మేరకు భవిష్యత్తులో ఎవరి వ్యక్తిగత ఆస్తి కూడా దోచుకోరాదని విప్లవకారులు నిర్ణయించారు.ఆర్థిక వనరుల సమీకరణ కోసం ప్రభుత్వసొమ్మును మాత్రమే దోపిడు చేయాలని రాంప్రసాద్‌ బిస్మిల్‌ నిశ్చయానికి వచ్చారు. ఆది నుండి రైలు దోపిడికి అష్పాఖ్‌ వ్యతిరేకం

ప్రజల ఆస్తులను కాకుండా ప్రభుత్వధనాన్నిదోచుకోవాలన్ననిర్ణయం తరువాత బిస్మిల్‌ ఆ మేరకు పథకం రూపొందించారు. ప్రభుత్వ ఖజానాను తరలిస్తున్నరైలు నుండి ప్రభుత్వ సొమ్మును దోపిడీ చేయాలన్న ఆలోచనను కేంద్ర సమితి ముందుంచి, తన పథకాన్ని సహచరులకు వివరించారు. ఆ పథకం గురించి విన్న పార్టీ సభ్యులయిన యువ విప్లవకారులు పొంగిపోయారు. బ్రిటిష్‌ ప్రభుత్వం ఖంగుతినేలా ఏదో ఒకటి చేయడానికి మంచి అదను అనుకున్నారు. ప్రాణత్యాగం చేయాలన్న బలమైన కోరిక ఇప్పుడు మా మనస్సులో సుడులు తిరుగుతోంది. చూడాలి శత్రువు భుజాల్లోని బలమెంతో (సర్‌ఫరోషీకి తమన్నాఅబ్‌ హమారే దిల్‌మేం హై.. దేఖనాహై జోర్‌కితనా బాజుయే ఖాతిల్‌ మేం హై) అంటూ మౌలానా హసరత్‌ మోహాని రాసిన ఉత్తేజపూరిత గీతాలాపన చేయసాగారని శచీంద్ర బక్షీ తెలిపారు. (ప్రజా సాహితీ డిసెంబరు 200, పేజి. 27).

ఈ ప్రతిపాదానను సమావేశానికి హాజరైన సభ్యులలో అష్పాఖ్‌ తప్ప మిగిలిన వారంతా అంగీకరించారు. మిత్రులందరి ఆలోచనలు విన్న తరువాత అష్పాఖ్‌ నింపాదిగా మాట్లాడుతూ, దళం ఇంకా బలోపేతం కాలేదు, ప్రభుత్వంతో నేరుగా తలపడగల శక్తి మనకు ఇంకా సమకూరలేదు, అందువలన మనం ముందు పార్టీని పటిష్టం చేసుకోవాలి, పార్టీని విసృతపరచుకోవాలి. ప్రభుత్వానికి ఇటువంటి సవాల్‌ విసరడం ఆత్మహత్యా సదృశ్యం కాగలదు. ఈ సంఘటన జరిగితే ప్రబుత్వం దళసబ్యుల మీద చాలా దారుణంగా

విరుచుకు పడగలదు. విప్లవోద్యమం మనుగడ ప్రమాదంలో పడగలదని, ఆందోళన

వ్యక్తం చేసారు. (Shaheed Asfaqulla Khan aur Unka yug. by Sudhir Vidhyardhi Page.34)

ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పష్టం చేస్తూ విప్లవోద్యమం మనుగడ దృష్ట్యా ఈ నిర్ణయం మంచిది కానందున తాను వ్యతిరేకిస్తున్నానని అష్పాఖుల్లా ప్రకటించారు. ఈ పదకాన్నినిలుపుదల చేయడం మంచిదని చివరి వరకు బిస్మిల్‌కు చెబుతూనే ఉన్నారు. ఆయన చేసన హెచ్చరికలను వినిపించుకునే సితిలో మిగతా సహచరులు లేరు, అష్పాఖుల్లా

39