పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/41

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

కడు దయనీయంగా ఉండినాయి. శెనగలు బుక్కి బతుకుదామnnaa అవైనా కొనలేని స్థితి. ఎవరి ఒంటినిండా బట్టలు లేని రోజులవి. కొంతమంది విద్యార్థ్ధులుగా మారి ధర్మసత్రాల్లో, గుళ్ళు, పుణ్యతీర్థాలలో ఉచిత భోజనాలకు వెళ్ళేవారు...ఈ దుస్థితి గాంచి నాకెంతో క్లేశం కలగసాగింది. యువకుల శుష్కవదనలను చూసి, అయ్యో స్వదేశ సేవాకార్యక్రమంలో నిమగ్నమవడంవల్ల బిచ్చగాళ్ళకంటే అధ్వాన్న స్థితి దాపురించిందేమని కుములుతూ తరచూ ఏడ్చేవాడిని, (బిస్మిల్‌ ఆత్మకథ: పేజి 72-73) అని బిస్మిల్‌ తన ఆత్మకథలో వాపోయారు.

బలమైన శత్రువును మాతృభూమి నుంచి తరిమి కొట్టేందుకు సాగుతున్నపోరుకు, అంగబలంతో పాటుగా ఆర్థిక, సాయుధ బలం విప్లవోద్యమానికి చాలా అవసరమైంది. ఆయుధాలను సమకూర్చుకోవడానికి తగినంత ధనం కావాల్సి వచ్చింది. ఈ విషయాలను కాకోరి కేసులో అష్పాఖ్‌తో పాటుగా విచారణ ఎదుర్కొని పదిసంవత్సరాల జైలు శిక్షను అనుభవించిన శచీంద్రానాధ్‌ బక్షీ ఒక వ్యాసంలో ఈ విధంగా వివరించారు. 1925 సంవత్సరం వచ్చేదాకా ఉత్తరప్రదేశ్‌లో విప్లవ పార్టీ నిలదొక్కుకుని, చురుకుగా కదులు తోంది. జూలై చివరి వారంలో జర్మనీ నుంచి స్టీమర్లో పిస్తోళ్ళ చలానా వస్తుంది. పిస్తోళ్ళు కలకత్తా పోర్టు చేరడానికి ముందే డబ్బుని నగదు రూపంలో జమకట్టాలి. అందుకు చాలా నగదుకావాలి. పార్టీ దగ్గర అంత సొమ్ము లేదు. దోపిడికి దిగడం తప్ప పార్టీకి మరో మార్గం లేకుండాపోయిందని, ('కాకోరి కుట్ర కేసు నడిచిన విధం' (వ్యాసం), వ్యాసరచయిత: శచీంద్రానాధ్‌ బక్షీ, ఆనువాదం: విపుల్‌ చక్రవర్తి, ప్రజా సాహితి, డిసెంబరు

2000 నాటి సంచిక, పేజి. 26)

1925 మార్చి 6వ తేదీన ఫిల్‌ఖిత్‌ జిల్లాలోని బిచ్‌పూరి గ్రామంలోని బ్రిటిషర్ల తొత్తు ఇంట జరిగిన దోపిడిలో అష్పాఖుల్లా ఖాన్‌ పాల్గొన్నారు. ఆ విధంగానే పలు ప్రాంతాలలో నిర్వహించిన యాక్షన్స్‌లో అష్పాఖ్‌ పాత్ర వహించినప్పికీ, ఆయనకు ఈ తరహా దోపిడీలు ఇష్టం లేదు. ఈ అదోపిడుల వలన కలిగే ప్రయోజనం కంటే పార్టీ పట్ల ప్రజలలో ఏర్పడే ప్రతికూల అభిప్రాయం ప్రమాదరకమని ఆయన భావించారు. ఆ అభిప్రాయాన్ని అయన తొలుత నుండి వ్యకం చేస్తూ వచ్చారు. ఆ విమర్శల పర్య వసానంగా, మరోమార్గం లేక దోపిడులకు దిగాలని నిర్ణయానికి వచ్చాము. అయితే ఎవరి వ్యక్తిగత ఆస్తుల్నికొల్లగొట్టడమన్నామాకు యిష్టం లేకుండెను. కనుక దోపిడి చేయడమే తప్పనట్టయితే ప్రభుత్వ ధనాన్నే ఎందుకు దోచుకోరాదని యోచించినాము, అని బిస్మిల్‌ ఆనాడు తీసుకున్న నిర్ణయాన్ని తెలిపారు. (బిస్మిల్‌ ఆత్మకథ: పేజి.76)

38