పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/34

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

షహీద్‌ - యే - ఆజమ్‌ అష్పాఖుల్లా ఖాన్‌

స్వర్గం నుండి దేవదూతలు దిగివచ్చి హిందూ-ముస్లింల ఐక్యతను వదులుకుంటే ఇరవైనాలుగు గంటల్లో దేశానికి స్వరాజ్యం లభిస్తుందని కుతుబ్‌మినార్‌ నుండి ప్రకటిస్తే, ఆ స్వరాజ్యాన్ని నేను నిరాకరిస్తాను. అలా కాదు మిత్రమా, హిందూ-ముస్లింల ఐక్యత కోసం నేను స్వరాజ్యం డిమాండ్‌ను వదలుకున్నాను. స్వరాజ్య సిధ్ధి ఆలస్యమైతే భారత దేశం మాత్రమే నష్టపోతుంది. హిందూ-ముస్లింల ఐక్యతకు భంగం వాటిల్లితే మానవ జాతికి నష్టపోగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

(‘ If an angel descends from heaven today and proclaims from the Qutub Minar that India can attain Swaraj within 24 hours provided I relinquish my demand for Hindu-Muslim Unity, I shall retort to it: ‘ No my friend, I shall give up Swaraj, but not Hindu-Muslim unity, for if Swaraj is delayed, it will be a loss for India, but if Hindu-Muslim unity is lost, it will be a loss for the whole of mankind. - Understnding Muslim Mind, Rajmohan Gandhi, Penguin Books, 1986, Page 230 )

ఆనాడు మౌలానా ఆజాద్‌ హిందూముసింల ఐక్యత అతి ముఖ్యమని కోరుకుంటే అష్పాఖుల్లా ఖాన్‌ ఆర్థిక-సామాజిక అంతరాలు లేని సమసమాజ వ్యవస్థగల ఇండియా ముఖ్యమన్నారు.

హిందూ-ముస్లిం ఐక్యతాభిలాషి

సమసమాజానికి అధిక ప్రాముఖ్యత ఇచ్చిన అష్పాఖ్‌ హిందూ-ముస్లిం ఐక్యతకు కూడా అంతటి స్థానం కల్పించారు. మౌలానా అబుల్‌ కలాం స్థాయిలో హిందూ -ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలిచారు. ఈ విషయాన్ని బిస్మిల్‌ ప్రస్తావిస్తూ, నీవెప్పుడూ హిందూ - ముస్లిం ఐక్యతనే కాంక్షింస్తూండేవాడివి. నీవొక నిజమైన ముస్లింగా, నిజమైన దేశబక్తు నిగా ఉన్నావు. (ఆత్మకథ: పేజి.106) అని రాసుకున్నారు.

హిందూ-ముస్లింల మధ్యన ఉన్న అనైక్యత పలితంగా బ్రిటిషర్ల పెత్తనం సాగుతుంది. ఈ ఆనెక్య త ఫలితంగా ఇండియా ఆంగ్లేయుల పరమైపోయింది. ఆంగ్లేయులు డబ్బు, పదవులు ఆశ చూపి మనల్నిచీల్చి పబ్బం గడుపుకుంటున్నారు. ఈ విషయంలో పెద్ద పెద్దవాళ్ళు కూడా అతీతంగా లేరు. నేను మరణిస్తున్నాను. నాదేశం కోసం మరణిస్తున్నాను. నా మాట వినండి ఐక్యంగా వ్యవహరించండి, అని అష్పాఖుల్లా ప్రజలను కోరారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, by Sudhir Vidyardhi, Page.119)

31