పుట:షహీద్-యే-ఆజం అష్ఫాఖుల్లా ఖాన్.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

అఫ్పాఖుల్లా ఆ భారాన్ని భగవంతుడి మీద మోపారు.ఈ కారణంగా భగత్‌ సింగ్ కు స్పూర్తినిచ్చిన అష్పాఖుల్లా ఖాన్‌ను కొన్ని వర్గాలు విస్మరించాయి.

సుమారు 80 సంవత్సరాల క్రితం ఓ గ్రామీణ ప్రాంతంలో, ఒక నిమ్నకులానికి చెందిన ఘనీ, సామాన్య కార్మికుడు అబ్దుల్లా, ఓ చిన్నపాటితు కలసి ఆనాటి సమాజంలో పేరెన్నికగన్న నాయకులు, సంపన్నుల సరసన కూర్చోని ఉన్న దృశ్యాన్ని తాను కళ్ళారా చూడాలని అష్పాఖ్‌ ఆశపడ్డారు. ఈ మేరకు సామాజిక-ఆర్థిక అసమానతలు లేని సమసమాజాన్నిఅష్పాఖ్‌ ఆనాడు కాంక్షించటం ఆయనలోని ప్రబలమైన ఆకాంక్షకు నిదర్శనం.

అసమాతల స్వాతంత్య్రం అక్కరలేదు

అష్పాఖుల్లా ఖాన్‌ జమీందారి వ్యవస్థ పట్ల కూడావ్యతిరేకత వ్యక్తం చేసారు. జమీందారి వ్యవస్థ రతు శ్రమ పలితాన్ని దోచుకుంటుందని విమర్శించారు. జమీందారి కుటుంబీకుడైన ఆయన జమీందారి వ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడడం, రైతు పక్షం వహించడం , రైతుల కష్టార్జితాన్ని జమీందారులు జలగలురక్తం పీల్చినట్టు పీల్చుకుంటున్నారని వ్యాఖ్యానించడం గమనించాల్సిన అంశం. ఆయన తన స్నేహితునితో భూమి నాది, పెట్టుబడి నీది, శ్రమ మనిద్దరిది, ఫలితం మనది - మనందరిది అనడం ఆయనలోని ప్రగతిశీల భావాలకు అద్దం పడుతుంది.

ఒకవళ ఇండియాకు సమసమాజం సాధ్యం కాని స్వాతంత్య్రం లభించినట్లయితే అటువంటి స్వరాజ్యం అక్కరలేదని అష్పాఖ్‌ స్పష్టంగా ప్రకటించారు. భారతదేశం స్వాతంత్య్రం పొంది తెల్లపాలకుల నుండి మన స్వదేశీ సోదరుల చేతుల్లోకి అధికార పగ్గాలు వచ్చిన తరువాత కూడా పేదా ధనిక, జమీందార్‌ రైతు సంబంధాలు యధావిధిగా ఉన్నట్టయితే అటువంటిస్వతంత్ర భారతదశాన్నినేను కోరుకోనని అన్నారు. (Shaheed Asfaqulla Khan Aur Unka Yug, Page.10) అన్ని రకాల వివక్షతల నుండి ప్రజలకు సమానత్వం ప్రసాదించలేని స్వతంత్రం అక్కరలేదని స్పష్టం చేయడం ద్వారా ఎటువంటి అసమానతలు లేని సమసమాజాన్ని అష్పాఖ్‌ ఎంత బలంగా కోరుకున్నారో తెలుస్తుంది.

ఈ తరహాలోనే మౌలానా అబుల్‌ కలాం అజాద్‌ కూడాహిందూ-ముస్లింల మధ్య ఐక్యత లేని స్వరాజ్యం వలదన్నారు. ఈ విషయమై మౌలానా మాట్లాడుతూ,

30