పుట:శ్రీ శివ స్తోత్ర మాల.pdf/61

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట ఆమోదించబడ్డది

శివానందలహరి


కలాభ్యాం చూడాలంకృతశశి కలాభ్యాం నిజ తపః
ఫలాభ్యాం భక్తేషు ప్రకటితఫలాభ్యాం భవతు మే |
శివాభ్యామస్తోకత్రిభువనశివాభ్యాం హృది
పునర్భవాభ్యామానన్దస్ఫురదనుభవాభ్యాం నతిరియమ్ || 1 ||

గలన్తీ శంభో త్వచ్చరితసరితః కిల్బిషరజో
దలన్తీ ధీకుల్యాసరణిషు పతన్తీ విజయతామ్ |
దిశన్తీ సంసారభ్రమణపరితాపోపశమనం
వసన్తీ మచ్చేతోహృదభువి శివానన్దలహరీ ||2||

త్రయీవేద్యం హృద్యం త్రిపురహరమాద్యం త్రినయనం
జటాభారోదారం చలదురగహారం మృగ ధరమ్ |
మహాదేవం దేవం మయి సదయభావం పశుపతిం
చిదాలంబం సాంబం శివమతివిడంబం హృది భజే ||3||

సహస్రం వర్తస్తే జగతి విబుధాః క్షుద్రఫలదా
న మన్యే స్వప్నే వా తదనుసరణం తత్కృతఫలమ్ |
హరిబ్రహ్మాదీనామపి నికటభాజాంఅసులభం
చిరం యాచే శంభో శివ తవ పదాంభోజభజనమ్ ||4||

స్మృతౌ శాస్త్రే వైద్యే శకునకవితాగానఫణితౌ
పురాణే మన్త్రే వా స్తుతినటనహాస్యేష్వచతురః|
కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కో౽హం పశుపతే
పశుం మాం సర్వజ్ఞ ప్రథితకృపయా పాలయ విభో ||5||

ఘటో వా మృత్పిణ్డో౽ప్యణురపి చ ధూమో౽గ్నిరచలః
పటో వా తన్తుర్వా పరిహరతి కిం ఘోరశమనమ్ |
వృథా కణ్ఠక్షోభం వహసి తరసా తర్కవచసా
పదాంభోజం శంభోర్భజ పరమసౌఖ్యం వ్రజ సుధీః ||6||

మనస్తే పాదాబ్జే నివసతు వచః స్తోత్రఫణితౌ
కరౌ చాభ్యర్చాయాం శ్రుతిరపి కథాకర్ణనవిధౌ |