పుట:శ్రీ రామాయణము - బాలకాండము.pdf/33

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

xxiii

శ్రీ వేంకటేశ్వరస్వామి కలలో నీతనికిఁ బ్రత్యక్షమై :

“మున్ను నా పేర నంకితంబుగ నొనర్చితవనిలోఁ బొగడొంద భాగవతచరిత మిపు డొనర్చు ప్రబంధమ్ము నిమ్ము నాకు, నంకితమ్ముగ శ్రీ వేంకటాధిపతిని” అని పలికెను.

రామాయణమున స్వప్నసందర్భముననే యవతారికయందు :-

“నిను మెచ్చి వచ్చితి నీతలం పెఱిఁగి,
ననుఁ దిరువేంగళనాథుగాఁ దెలియు
పద్యకావ్యముఁ జేసి 'పరమభాగవత,
హృద్యచరిత్రంబు' నిచ్చితీ మాకు
మంగళప్రద మసామ్యము శతాధ్యాయి,
రంగమాహాత్మ్యంబు రచియించినావు
మా పేర నిపుడు రామాయణద్విపద,
యేపుమీఱుఁగ రచియింపు మింపలర.”

పై యుద్ధృతాంశములఁబట్టి వరదరాజకవి తొలుత పరమభాగవతచరిత్రమును నావెనుక శ్రీరంగమాహాత్మ్యమును నాపైని శ్రీరామాయణమును రచియించె ననియు నందు పరమభాగవతచరిత్రమే యాతని తొలిగ్రంథ మనియుఁ దెలియుచున్నది.

కాని యీగ్రంథమున పుండరీక, రుక్మాంగద చరిత్రములుగల రెండాశ్వాసములు మాత్రమే లభించుచున్నవి, గాని తక్కినగ్రంథము పూర్తిగ లభించుట లేదు - పై రెండు కథలు

గల భాగములు తంజావూరి పుస్తకశాల గ్రంథవివరణపట్టికలో రెండుప్రత్యేకగ్రంథములుగా పేర్కొన్నారు[1]; దీని ననుసరించియే

  1. పుట. 41 పరమభాగవతచరిత్ర, రుక్మాంగదచరిత్ర సంఖ్య 177

    పుట. 47 పుండరీకచరిత్రము సంఖ్య 189