పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/7

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

3

1934 జనవరి మాసమున గ్రంథముప్రతులు నాయొద్దఁ జేరెను. నాయెఱిఁగిన కవులకును, బండితులకును, మిత్రులకును, బంపుకొంటిని. వారందఱు సంతోషించి నాయోగ్య తకు మించి నన్నుఁ గొనియాడిరి. వారికృతమును మఱవను. ఒక్కొకచోఁ బది పదు నాఱు పుటలవఱకును బ్రాఁకిన యమూల్యాభిప్రాయములను సంగ్రహపఱచి ముద్రింపించి నందులకై వారు క్షమింతురని నమ్మదును. నా గ్రంథము నెడ నపారాదరము నెఱపిన బ్ర. చిలుకూరు నారాయణరావు పంతులు ( M. A. P. H. D.) గారీ యుదార-మృదు హృద యమును నేను ప్రత్యేకవిశ్వాసముతోఁ గొనియాడు చున్నాను. ప్రతాపమహారాణా గారీ త్రివర్ణ చిత్రపటము ప్రతు లొక సహస్రము నాకుఁ బంపి యువకరించిన భారతీపత్రికా' సంపాదకులు శ్రీ. గన్నవరము సుబ్బరామయ్య గారి సాయము స్మరింతును. మైసూరు-మద్రాసు విశ్వవిద్యాలయములవారు గ్రంథమును వరుసగా “నింటర్ మీడియెట్_బి. ఏ.” పరీక్షలకుఁ బాఠ్యముగ నిర్ణయించి నన్నుఁ బ్రోత్సహించిరి.

చతుర్థాశ్వాసమున నొక్క యెడను బంచమాశ్వాసమున నొక్కతావునను గొన్ని పద్యములను జేర్చుటతప్ప నీముద్రణమున నా చేసిన మార్పొక్కండును లేదు. ఈ కావ్యమున లేశమేని గుణము గనఁబడు నేని యిది యాంధ్ర మహాజనులమన్ననకుఁ బాత్రమై శాశ్వతస్థాయి నలరారుఁ గాతమని పరమేశ్వరుని బ్రార్థించుచు నుపరమించు చున్నాను.

ఇట్లు,

'అవధాని పంచానన - కవిసింహ- కావ్యకళానిధి,'

డి. రా జ శే ఖ ర శ తా వ ధా ని.

ప్రొద్దుటూరు.
1-9-35.