పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర దుర్భాక.pdf/4

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రతాపుడు ప్రకృతి బిడ్డ, భోగ విముఖులైన రాజ ప్రతాపుడు గాంధీ వంటివాఁడు. ఏసుక్రీస్తు వంటివాఁడు. మహర్షుల వంటివాఁడు. ఇట్లు వ్రాసిన నూరక పెరిగిపోవును, “శ్రీనృపలోకజగద్గురుండు మాయప్ప ప్రతాపదేవుఁడు” ఇందు రసధ్వని వేయిమూర్తుల రూపు గుచున్నది. హృదయమునుండి వచ్చిన భాష యనగా నిది. ఇట్టి రచన మహాకవులే చేయఁగలరు.

అంతయునైశది గాని, ఓయి ప్రతాపా! శ్రీనృపలో కసగ్గురూ! మాయప్పా!

సీ॥ అక్బరు విశ్వంభరాధీశమౌళిది
              ధనసేవ! నీయది దైవసేవ!
    మతని కుండినదెల్ల నైహికబలము ని
              న్నాశ్రయించిన దెల్ల నాత్మబలము!
    యాతని దెల్లప్పు డాత్మవైభవము! నీ
              యది నిరంతరము నాత్మావబోధ!
    మతని దందఱకన్ను లలరించు భోగంబు!
              నీది జగముమెచ్చు నిండుత్యాగ!
              
ఆ॥వె॥ మతఁడు జగము గెలిచె! నాత్మ గెల్చితివి నీ!
       వాతఁ డితరజనుల నాశ్రయించు!
       నీవు స్వాశ్రయుఁడవు! నీకు నాతని కెన
       లేదు జగము క్రిందు మీదులైన॥

ఇంక నొకమాట. ఈరసప్రవాహములో ప్రవాహము వెంటనే పోయి విమర్శించితిని. వేఱొక గతి లేదు. కాని, ప్రవాహము నడుమను తీరము వెంట నంగుళమంగుళము కల తామరపూలు, కలువపూలు, నీటిబెగ్గురులు మొదలైన శోభలు పాఠకులే చూచుకొనుచు చదువుకొనవలయును. ఇది పరమోత్తమ గ్రంథములలో నొకటి.