Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/40

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది


శా.

ఆవిశ్వోన్నత పుణ్యవై భవ యశోహారాళి హారావళీ
గ్రావోత్తంసము తూర్పునన్ సరసిజారామంబునన్ బొల్చు ల
క్ష్మీవామన్ బలె రాజధానియగుచున్ జిత్తూర్పురం గొప్పఁగా
మేవాడ్దేశము వీరఖండ మగుచున్ మించున్ ధరాస్వర్గమై.

6


సీ.

సచరాచరప్ర పంచప్రాణమగు సూర్య
         భగవానుఁడాదీమ వంశకర్త
త్రిజగతీధానుష్క దీపకుండైనరా
         ముని సుతుండు లవుండు మూలపురుషుఁ
డలయగస్త్యాశ్రమఖ్యాత మాబూగిరి
         నేకలింగేశ్వరుం డిష్టదైవ
మతి పావనము లయోధ్యా వల్లభీసీమ
         లాదికాలము నాఁటి యాటపట్టు
లాదికాలము నాఁటి యాటపట్టు


గీ .

లాశీలాదిత్య కనక సేనాది రాజ
రాజపరమేశ రణ విహారప్రతిష్ఠ
ఖండఖండాంత నగర విఖ్యాతి హేతు
వట్టి మేవాణ్ణృపుల నెన్న నలవి యగునె.

7


మ .

సమమైయొప్పు విశాలభైల శిఖరస్థానంబునన్ రాజపు
త్రమహీకాంతకు వజ్రభూషణమటుల్ రాణించు చిత్తూరుసం
ద్రము మధ్యంబునఁ గోడలేడు కొమరొందన్ బైకిఁగన్పట్టు దు
ర్గమ లంకాపుర పూర్వవైభవము జోకల్ జ్ఞప్తికిన్ దెచ్చుచున్.

8


గీ .

ప్రక్కపక్కనఁ బదిబండ్లు వరుసగాఁగ
సరుగ ననువైన వైశాల్య మతిశయిలఁగ
నహిత దుర్భేదమగు గోడ లలరు కోట
లేడుచుట్టు చిత్తూర్పురి కెసఁగియుండు.

9


సీ.

విపణిమార్గములతో వీధుల తుదినొప్పు
             శివకేశవాలయ శ్రేణితోడ
నారామముల తోడ నపరంజి తాఁపిన
           సముదార భవనాంగణముల తోడ

8