పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

కా మే శ్వ ర్యై న మః

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

ప్ర థ మా శ్వా స ము

శ్రీ

మత్కందుకమట్లు గుండ్రమయి వారిన్ రెండు పాళ్ళొక్కపా

ల్బూమిన్ నిండియు నూఱునర్వదియుఁ గోట్లు మర్త్యు లొప్పారఁగా
వ్యోమంబంటు నగాధిరాజ నివహంబుల్ మీఱ విశ్వంబు శో
ధామూల్యస్థితి నొప్పు నీశ్వరు ననంతైశ్వర్యముల్ చాటుచున్.1

సీ॥ కాంచన శృంగభాగము కిరీటము గాఁగఁ
              గాశ్మీర మాస్యపంకజముగాఁగ
   సింధు గంగానదుల్ చేఁదోయి గాఁగ నా
              ర్యావర్తదేశం బురంబుగాఁగ
   వింధ్యాచలేంద్రంబు బెడఁగు మధ్యము గాఁగ
              గౌతమీ కనక మేఖలయుఁగాఁగ
   మలయ సహ్యాద్రు లడ్గులు గాఁగ సింహళ
              ద్వీప మంథోరుహ పీఠిగాఁగ
              
గీ॥ లవణ రత్నాకరము సరః ప్రవర మగుచుఁ
   జెలఁగు భారత దేశ లక్ష్మీ సమగ్ర
   భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవము
   లిట్టివని వివరింపఁగా నెవరి తరము. 2