Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/200

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

కా మే శ్వ ర్యై న మః

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర

తృ తీ యా శ్వా స ము

మ॥ జలపూరంబడుగంటి కూపములు కాసారంబులున్ వ్రీలి సం
    దులఁ బాతాళము లోఁతు చూప; ధరయున్ దుర్వార ఘోరాగ్నిమం
    డలమై మండుచుఁ బేలగింజ వలెఁబెట్లన్ జంతు జాలంబు శో
    షిల గ్రీష్మంబది నిప్పులన్ జెఱఁగి డాసెన్ సర్వమున్ గాల్చుచున్. 1
    
-♦అక్బరు సార్వభౌముఁడు మేవాడపైఁ దన నైన్యముల సంపుట♦-

సీ॥ స్థిరవైరి యముఁడనన్ జెల్లు తోడరమల్లు
             రణ మర్మము లెఱుంగు రాయసింగు
    చండారి విపినానలుండు వీరబలుండు
             ప్రబల కీర్తినిదేలు రాయశీలుఁ
    డుల్లాసమతియు నబ్దుల్లా చమూపతి
             పౌరుషంబూను షాబాజుఖానుఁ
    డభిమానసంధానుఁ డబ్దూరు రహిమానుఁ
             డసమ శౌర్య విధానుఁ డసపుఖాను
             
గీ॥ మఱియు ఖాసిముఖాన్ ముఖుల్ మహితశౌర్య
   రేఖ ముల్లోకములఁ జప్పరింపఁ గలుగు
   యవన నరపాలమౌళి సైన్యాధినాధు
   లేక ముఖమునఁ గదలి దండెత్తి రపుడు. 2 2
   
మ॥ అరి సంత్రాస కరోగ్ర సత్వయుతమై హారావళీ పర్వతాం
    తరమందుఁ జెలరేఁగుచున్ జగమునంత గాల్చు స్వీయోగ్ర సో