Jump to content

పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/199

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

162

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర



మ॥ అవనీదేవులఁ బిల్వఁబంచుచును బుణ్యాహమ్ము చేయించి మ్రో
    లవెలుంగొందు నదీజలంబులు సచేలస్నానముల్ చేసి పూ
    జ్యవిధానమ్మునఁ బంచగవ్యమును బ్రాయశ్చిత్తమున్ బొంది మ
    క్కువమై నందఱుపోయి చేరుకొని రా'కుంభల్ మియన్' దుర్గమున్. 331
    
గద్య:- ఇది శ్రీమత్కామేశ్వరీ కరుణా కటాక్ష వీక్షా సమాసాదిత రసవ
       త్కావ్య నిర్మాణ చాతురీధురీణ, సుగుణగణపారీణ, దుర్భాకవంశ
       దుగ్ధాంభోరాశి రాకాకైరవమిత్ర, శాలంకాయనగోత్ర పవిత్ర,సుజన
       జనానుగ్రహపాత్ర, వెంకటరామార్యపుత్ర, కవిసార్వభౌమ సాక్షా
       ద్వీర ప్రతాపాది వింశత్యధిక బిరుదవిఖ్యాత, సుకవిరాజశేఖర, రాజ
       శేఖరకవి ప్రణీతంబయిన "రాణా ప్రతాపసింహ చరిత్రం "బను పద్య
       కావ్యమునందు ద్వితీయాశ్వాసము.