పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/179

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

142

రా ణా ప్ర తా ప సిం హ చ రి త్ర


   మహియెల్ల నీశ్వర మయమంచు జాటఁ గో
          వెలలు దీపములట్లు వెలయుఁజేసె
          
గీ॥ సకల భాషాకవీంద్రుల సత్కరించి
   కృతులు వారియించి బహుబహూకృతులు చేసె
   బదియు నాఱునూఱులు సైన్య పతులు గొలువ
   మీఱె మధ్యమలోక మందారుఁ డగుచు. 252
   
సీ॥ క్ష్మాచక్రమెల్ల నేకచ్ఛత్రమైయుండ
            నాసించి దిగ్విజయము లొనర్చు
    దనచేఁ బరాభూతిఁ గనిన రాజులనెల్ల
            సమ గౌరవమ్మున సత్కరించుఁ
    దనయేలుబడిని నౌఁదలదాల్తు మనిపించి
            వారిదేశమ్ము లవ్వారి కిచ్చు
    నిఁకఁగొంత రాజ్యంబు నిచ్చు : నాస్థానమం
            దరిసి సేనాధి పత్యంబు నిచ్చు
            
గీ॥ నెయ్యమునకుఁ దోడుగఁ దన వియ్యమిచ్చు
   నడుగ లేదనఁజాలఁ డేమైననిచ్చుఁ
   గల్పకము మేరుగిరి కామగవియుఁ జేరి
   యతని యాకృతి నిలజన్మ మందెనిజము 253
   
మ॥ అలబృందావనమేగి యిందలి మునీంద్రాసికమున్ గొల్చి గో
    కులపాలాన్వయవార్ధి చంద్రుఁడగు నా గోవిందు భావించి కో
    వెలలన్ నాలుగు గట్టినాఁడు! యవనోర్వీనాధు లీభారతీ
    యుల దైవంబుల మ్రొక్కి దేవళములోహో! కట్టి సేవించిరే. 254 254
    
సీ॥ ప్రజ బానిసలుచేయఁ బడు చట్టమునునిల్పె
            జుట్టుపన్నును దుద ముట్టఁజేసె
    బరమేశుఁగొలువ నందఱును సమానార్హు
            లని యాత్రికుల సన్ను నణఁచి పైచె
    బ్రతిదినోదయము తల్పమునుండి లేచిన
            యంతఁ బరబ్రహ్మ మాత్మఁ దలఁచు