పుట:శ్రీ రాణా ప్రతాపసింహ చరిత్ర.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీ యా శ్వా స ము

141


మ॥ పొడయెండై నను సోఁకఁగా నెఱుఁగ కెప్డున్ శీతలచ్ఛాయలన్
    బడినన్ దుఃఖము మాటెఱుంగక సుఖప్రాబల్య భావంబు లే
    ర్పడినన్ నొప్పి రవంతయు దెలియ కశ్రాంతంబు భోగంబు చొ
    ప్పడినన్ మానవుఁ డాత్మజీవితపు కోభాలాభముల్ చెందునే. 249
    
క॥ నాకష్టంబులఁ గూఱిచి
   వాకొనకుము; కష్టములకు భయపడ” నన “నౌఁ
   గాక” నుచు మానసింహుఁడు
   “నాకొక్కఁడు తోఁచుఁ దెల్సిన గనలకుఁడీ 250
   
:ప్రతాపసింహునితో మానసింహప్రభువు సంధిమాటలు జరుపుట.:

సీ॥ కాబూలు మొదలు వంగముదాఁక వ్యాపించు
             నకలభూతల మేలు చక్రవర్తి
   యవన హైందవులను లవము భేదములేక
             సమదృష్టిఁజూచు విజ్ఞానశాలి
   యడుగరేకాని తన్నడిగిన రాజ్యమై
             న నొసంగఁగలఁ వదాన్య ప్రభుండు
   తనచూపుపాఱు దిక్కున నెం దపజయంబు
             వినరాని రణరంగ విజయమూర్తి
             
గీ॥ కాలిబం ట్లైఁబదైదు లక్షలను బదియు
   నైదులక్ష లాశ్వికదళం బై దువేలు
   హస్తితతి గల్గు విశ్వలో కైకభర్త,
   యక్బరు నృపాలుతుల్యు లీయవనిఁ గలరే! 251 251
   
సీ॥ భూదేవి పూలమేల్ముసుఁ గూనెనోయన
             వఱలు నుద్యానముల్ పెరుగఁజేసె
    ఛత్రముల్ వలేవంగి చలువ నిచ్చెడుచెట్ల
             రాజమార్గముల నేర్పాటు చేసె
    ద్వాదశవర్షముల్ వర్షంబు లేకున్న
             దఱుఁగని చెఱువులఁ ద్రవ్వఁజేసె